For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనారోగ్య సమస్యలకు అమ్మమ్మ చిట్కాలతో ఉపశమనం

జబ్బుల నుండి తక్షణం ఉపశమనం కలిగించే అమ్మమ్మ చిట్కాలు

|

మీ అమ్మమ్మ చెప్పే ఇంటి పరిష్కారాలను మీరు విన్నారా? ఈ రోజుల్లో మాకు ఏ క్షణంలోనైనా అనారోగ్యం రావచ్చు. మేము మొదట డాక్టర్ కి కాల్ చేయటం లేదా సమీప క్లినిక్ కి వెళ్ళతాం. అప్పుడు మేము కొన్ని మాత్రలను వాడతాం. కానీ కొంత మంది మొదట ఇంటి పరిష్కారాలను ప్రయత్నిస్తారు. ఈ సహజ పరిష్కారాలు ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చి మాకు చేరుతున్నాయి.

Grandmas Home Remedies

ఈ అమ్మమ్మ ఇంటి పరిష్కారాలకు మీ ఇంటిలో తక్షణమే అందుబాటులో ఉండే సహజ పదార్ధాలను ఉపయోగించవచ్చు. అవి పనిచేయవచ్చు లేదా కొన్నిసార్లు అవి పనిచేయకపోవచ్చు. అవి మంచివని నిరూపణ అయింది. కానీ చికిత్స కోసం ప్రత్యామ్నాయాలు లేవని గుర్తుంచుకోవడం ముఖ్యం.

గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఏమిటంటే ఈ ఇంటి పరిష్కారాలు కేవలం స్వల్ప సమస్యలకు మాత్రమే ఉపయోగించాలి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు విషయంలో ఒక వైద్యుడుని సంప్రదించాలి. చికిత్స యొక్క సాధారణ విధానాన్ని అనుసరించాలి. ఈ పోస్ట్ లో,మనం కొన్ని సాధారణ అమ్మమ్మ ఇంటి నివారణల గురించి చర్చిద్దాం.

దగ్గు

దగ్గు

ఒక టీ స్పూన్ లో కొన్ని చుక్కల తేనెతో సగం వరకు నింపండి. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి దీనిని త్రాగండి. ఇది చాలా సందర్భాలలో పనిచేస్తుంది.

వికారం

వికారం

వికారం వదిలించుకోవటం కొరకు, మీ నోటిలో నిమ్మ లేదా అల్లం ముక్క ఉంచుకొని నెమ్మదిగా పీల్చటం మొదలుపెట్టండి. నిమ్మ,అల్లం రెండింటిలో కూడా వికారం ఉపశమనం కొరకు పోషకాలను కలిగి ఉంది. ఇది అమ్మమ్మ ఇంటి పరిష్కారాలలో ఒకటి.

సన్ బర్న్

సన్ బర్న్

మీరు సన్ బర్న్ తో బాధపడుతూ ఉంటే, మీ చర్మం మీద ఆపిల్ సైడర్ వెనిగర్ రాయాలి. మీ నొప్పి క్రమంగా తగ్గి ఉపశమనం కలుగుతుంది. సన్ బర్న్ నయం అయిన తర్వాత, మీ చర్మానికి కొద్దిగా కొబ్బరి నూనె రాసి స్నానం చేయాలి.

కాలిన గాయాలు

కాలిన గాయాలు

కాలిన గాయాల విషయంలో కలబందను ఉపయోగించండి. ఒక ఆకు తీసుకొని ప్రభావిత ప్రాంతం మీద రాయాలి. ఇది అమ్మమ్మ ఇంటి పరిష్కారాలలో ఒకటి.

పంటి నొప్పి

పంటి నొప్పి

మీ చిగుళ్ళు మరియు దంతాలకు లవంగం నూనెను రాయాలి. పంటి నొప్పితో బాధపడుతున్న వారికి ఇది ఒక మంచి హోం రెమడీగా ఉంది.

నిద్రలేమి

నిద్రలేమి

మీరు పడుకోవటానికి ముందు ఒక గ్లాస్ వెచ్చని పాలు త్రాగాలి. ఇది వందల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్న ఒక పరిష్కారం. పాలు ఖచ్చితంగా మీరు నిద్రపోవడానికి సహాయం చేస్తాయి.

కాలేయ సమస్యలు

కాలేయ సమస్యలు

డాండెలైన్ టీ కాలేయంనకు సంబంధించిన కొన్ని సమస్యలను నయం చేయటానికి ఉపయోగిస్తున్నారు. ఈ చికిత్సకు ఎలాంటి ఆధారం లేనప్పటికీ,అనేక మంది ఇప్పటికీ దీనిని ఒక ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

మూత్ర మార్గము

మూత్ర మార్గము

ఎటువంటి ఆధారం లేనప్పటికీ,పురాతన కాలంలో,ప్రజలు మూత్ర మార్గమును క్రాన్బెర్రీస్ ద్వారా నయం చేయవచ్చని నమ్మేవారు.

బహిష్టు సమస్యలు

బహిష్టు సమస్యలు

మీరు 2 లేదా 3 తమలపాకులను తీసుకోని మెత్తని పేస్ట్ చేయాలి. ఒక స్పూన్ పేస్ట్ ను గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. కొన్ని క్షణాల తరువాత,ఒక గ్లాస్ చల్లని నీటిని త్రాగాలి.

క్రమరహిత పీరియడ్స్

క్రమరహిత పీరియడ్స్

ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిలో సరిపడా నిమ్మరసం కలిపి ప్రతి రోజు తీసుకోవాలి. ఇది అమ్మమ్మ ఇంటి పరిష్కారాలలో ఒకటి.

కొత్తిమీర

కొత్తిమీర

కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకోని,వాటి రసం తీయటానికి గ్రైండ్ చేయాలి. ఈ రసంను కొన్ని రోజుల పాటు ప్రతి రోజు త్రాగాలి. ఇది అమ్మమ్మ ఇంటి పరిష్కారాలలో ఒకటి.

అజీర్ణము

అజీర్ణము

రెండు నారింజపండ్లను తీసుకోని రసం తీయాలి. ఈ రసంను ఒక గ్లాస్ లో పోసి దానిలో కొంచెం ఉప్పు,మిరియాల పొడి కలపాలి. దీనిని త్రాగితే అజీర్ణం నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

English summary

12 Grandma's Home Remedies

Have you heard of the grandma's home remedies? Well, nowadays, the moment any of us falls ill, the first thing we do is call up the doctor or rush to the nearest clinic. Some of us even go to an extent of using over the counter pills. But there are some people who first try home remedies.
Desktop Bottom Promotion