For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేకపాలలోని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ?

By Nutheti
|

ఎప్పుడైనా మేక పాలు తాగారా క‌నీసం మేక పాల‌తో పొందే అనేక‌ ప్ర‌యోజ‌నాలైనా విన్నారా చాలామంది మ‌న‌లో టీవీల ద్వారా, మీడియా ద్వారా ప్ర‌పంచంలో ఆవుపాలే అన్నింటి కంటే మంచివ‌ని న‌మ్ముతున్నాం. అంద‌రికీ ఆవుపాల గురించే తెలుసు. కానీ ఆవుపాల కంటే మ‌రో పాలున్నాయి. అవే మేక పాలు.

READ MORE: పాలు ఎందుకు తాగాలి ? పాలతో పొందే ప్రయోజనాలేంటి ?

మేక‌పాలు కూడా అద్భుత‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉన్నాయి. మేక‌పాలు తీసుకోవ‌డం పొందే చాలా అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ఇందులో ఉండే పోష‌కాలు ఎంత‌గానే మేలు చేస్తాయి. మేక‌పాలు తీసుకోవ‌డం పొందే ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసుకోండి.

ఇన్ల్ఫ‌మేష‌న్ త‌గ్గించ‌డానికి

ఇన్ల్ఫ‌మేష‌న్ త‌గ్గించ‌డానికి

శ‌రీరంలో ఇన్ల్ఫ‌మేష‌న్ ఏర్ప‌డిందంటే అది చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. మంట‌, వాపు, నొప్పి కార‌ణంగా మాన‌సిక ప్ర‌శాంత‌త కోల్పోవాల్సి వ‌స్తుంది. మేక పాలు ఇన్ల్ఫ‌మేష‌న్ ను త‌గ్గించ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవాళ్లు మేక పాలు తీసుకోవ‌డం ఆరోగ్య‌క‌రం.

జీవ‌క్రియ‌కు

జీవ‌క్రియ‌కు

మేక‌పాలు ఐర‌న్, కాప‌ర్ వంటి వాటి జీవ‌క్రియ‌ను మెరుగుప‌రిచే గుణం ఉంది. డైజెష‌న్ ప్రాబ్ల‌మ్స్ ఉన్న వాళ్లు మేక పాలు తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. బ్లోటింగ్ స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు మేక‌పాలు తీసుకుంటే స‌రిపోతుంది.

ఫ్యాట్ త‌క్కువ‌

ఫ్యాట్ త‌క్కువ‌

ఫ్యాట్ ఎక్కువ‌గా ఉంటే ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గాల‌నుకునే వాళ్ల‌కు మేక‌పాలు వండ‌ర్ ఫుల్ ప‌రిష్కారం. ఆవు పాల‌తో పోలిస్తే ఇందులో ఫ్యాట్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే ప్రొటీన్స్ కూడా పుష్క‌లంగా ఉంటాయి.

క్యాల్షియం

క్యాల్షియం

ఎలాంటి పాల‌లోనైనా క్యాల్షియం ఉంటుంది. అయితే మేక‌పాల‌లో క్యాల్షియం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే ట్రైటోఫాన్ అనే ఎమినో యాసిడ్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇది చాలా ముఖ్య‌మైన పోష‌క విలువ‌.

రోగ‌నిరోధ‌క శ‌క్తికి

రోగ‌నిరోధ‌క శ‌క్తికి

శ‌రీరంలో రోగనిరోధ‌క వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌నిచేస్తున్న‌ప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. సెలినియం అనే మిన‌ర‌ల్ ఇమ్యూన్ సిస్ట‌మ్ ప‌నితీరుకు బాగా స‌హాయ‌ప‌డుతుంది. ఇది మేక‌పాల‌లో స‌మృద్ధిగా ల‌భిస్తుంది.

ఫ్యాటీ యాసిడ్స్

ఫ్యాటీ యాసిడ్స్

ఎసెన్షియ‌ల్ ఫ్యాటీ యాసిడ్స్ శ‌రీరానికి చాలా అవ‌స‌రం. ఇవి క‌ణాల వృద్ధికి, అవ‌య‌వాల‌కు ఉండే పొర ఆరోగ్యానికి స‌హాయ‌ప‌డ‌తాయి. ఒక క‌ప్పు మేక‌పాలు తీసుకోవ‌డం వ‌ల్ల 35శాతం ఫ్యాటీ యాసిడ్స్ పొందవ‌చ్చు.

బ‌యో

బ‌యో

త‌ల్లిపాలు చాలా స్వ‌చ్ఛ‌మైన‌వి. వాటి నుంచి మ‌నం పొందే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. చాలా ప్యూర్ న్యూట్రిషియంట్స్ త‌ల్లిపాల ద్వారా పొందుతాం. అలాగే మేక‌పాలు కూడా త‌ల్లిపాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటారు. ఇవి చాలా త్వ‌ర‌గా డైజెస్ట్ అవుతాయి.

యాంటీ అల‌ర్జిటిక్ గుణాలు

యాంటీ అల‌ర్జిటిక్ గుణాలు

ఆవుపాల‌లో కంటే మేక‌పాల‌లో ఫ్యాట్స్ త‌క్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి ఇవి శ‌రీరంలో చీము వంటి అల‌ర్జీ క‌ల‌గ‌జేసే వాటిని ప్రోత్స‌హించ‌కుండా.. చూస్తుంది. అలాగే స్ట‌మ‌క్ ఇరిటేష‌న్ కాకుండా మేక‌పాలు స‌హాయ‌ప‌డతాయి.

కీళ్ల ఆరోగ్యానికి

కీళ్ల ఆరోగ్యానికి

శ‌రీరం క‌ద‌లిక‌ల‌కు ఎముక‌ల కీళ్ల ఆరోగ్యం చాలా అవ‌స‌రం. మేక‌లు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయ‌ని అంద‌రికీ తెలుసు. అంతేకాదు మేక‌పాల‌లో బ‌యో ఆర్గానిక్ సోడియ‌న్ ఉంటుంది. ఇది కీళ్ల ఆరోగ్యానికి, క‌ద‌లిక‌ల‌కు చాలా అవ‌స‌రం.

పుష్క‌లంగా పోష‌కాలు

పుష్క‌లంగా పోష‌కాలు

అవ‌స‌ర‌మైన పోష‌కాలు తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఒక క‌ప్పు మేక పాలలో 35శాతం క్యాల్షియం పొంద‌వ‌చ్చు. మేక‌పాల ద్వారా విట‌మిన్ బి 12, క్యాల్షియం, ప్రొటీన్స్ పొంద‌వ‌చ్చు.

మెద‌డుకు

మెద‌డుకు

మేక‌పాలు మెద‌డుకు చాలా మంచిది. మెద‌డులోని న‌రాల‌కు కావాల్సిన పోష‌కాల‌ను అందిస్తాయి. అలాగే మెమ‌రీ ప‌వ‌ర్ ని ఇంప్రూవ్ చేస్తాయి.

జీరో టాక్సిసిటీ

జీరో టాక్సిసిటీ

ఫుడ్ ప్రొడ‌క్ట్స్ లో టాక్సిటీ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది వెంట‌నే ప్ర‌భావం చూప‌క‌పోయినా.. త‌ర్వాత చాలా అపాయ‌క‌రం. అయితే మేక‌పాల‌లో ఇవి క‌నిపించ‌దు. అదే ఆవు పాల‌లో అయితే ఇవి ఉంటాయి.

క‌ల్తీ ఉండ‌దు

క‌ల్తీ ఉండ‌దు

మేక‌పాల కంటే ఆవు పాలు తీసుకునే వాళ్లే ఎక్కువ‌గా ఉన్నారు. కాబ‌ట్టి ఆవు పాల‌లో ర‌క‌ర‌కాల వాటిని క‌లిపి తాగ‌డానికి అనుకూలంగా మారుస్తాడు. దీనివ‌ల్ల చాలా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే మేక పాల‌లో ఎలాంటి క‌ల్తీ ఉండ‌వు కాబ‌ట్టి ఆరోగ్యానికి మంచి ఆప్ష‌న్.

త‌క్కువ లాక్టోజ్

త‌క్కువ లాక్టోజ్

పాల‌లో లాక్టోజ్ ఉంటుంది. పిల్ల‌లు, కొంత‌మందికి లాక్టోజ్ వ‌ల్ల అల‌ర్జీలు వ‌స్తాయి. కాబ‌ట్టి ఆవుపాల‌తో పోల్చితే మేక‌పాలలో త‌క్కువ లాక్టోజ్ ఉంటుంది. కాబ‌ట్టి ఆరోగ్యానికి ఇది మంచి ఆప్ష‌న్.

English summary

14 Amazing Health Benefits Of Goat Milk

Did you ever consume goat milk before? Have you been aware of the many benefits it offers? Most of us are so consumed by television advertisements and the media, which we have been thinking cow’s milk is the best in the world.
Story first published: Thursday, December 10, 2015, 9:33 [IST]
Desktop Bottom Promotion