For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేనె & దాల్చిన చెక్కలోని ఆసక్తికరమైన ఆరోగ్య ప్రయోజనాలు

|

దాల్చిన చెక్క మరియు తేనె కాంబినేషన్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడ ద్వారా వివిధ రకాల జబ్బులను నివారిస్తుంది. తేనెలో ఉండే అద్భుతమైన ఔషధ విలువల వల్ల దీన్ని కొన్ని వేల సంవత్సరాల నుండి నేచురల్ హోం రెమెడీగా దీన్ని ఉపయోగిస్తున్నాయి. తేనెలోని అద్భుత ఔషధ గుణగణాల వల్ల కొన్ని రకాల జబ్బులును చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుందని కొన్ని పరిశోధన ద్వారా కూడా నిర్ధారించబడినది.

ప్రస్తుత పరిశోధన ప్రకారం తేనెను ఒక ఔషధంలా సరైన మోతాదులో తీసుకోవడం వల్ల షుగర్ పేషంట్స్ కూడా హాని చేయదు మరియు ఇది షుగర్ పేషంట్స్ కు ఒక రకంగా ప్రయోజకరం . తేనె మరియు దాల్చిన చెక్క కాంబినేషన్ లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చెప్పలేనన్ని ఉన్నాయి.

కార్బోహైడ్రేట్స్ కు తేనె ఒక నేచురల్ మూలం. ఇది శరీరాన్ని బలోపేతం చేస్తుంది మరియు శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. షుగర్ తో పోల్చితే తేనె బ్లడ్ షుగర్ లెవల్స్ నార్మల్ గా ఉంచుతుంది . బరువు తగ్గించుకోవడంలో అతి తక్కువ క్యాలరీలు కలిగిన తేనెను కొన్ని సంవత్సరాలను ఉపయోగిస్తున్నారు. ఉదయం తేనె మరియు నిమ్మరసం రెండింటి మిశ్రంతో గోరువెచ్చని నీరు త్రాగేవారు, అలాగే కొద్దిగా తేనె కూడా వారి బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకుంటే బరువు తగ్గడానికి అద్భతంగా పనిచేస్తాయి. ఇన్ని ప్రయోజనాలను అంధించే తేనెకు, దాల్చిన చెక్కను మిక్స్ చేసి తీసుకోవడం వల్ల పొందే లాభాల గురించి తెలుసుకుంటే, కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఉండలేం . మరి ఆ అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

1. ఆర్థరైటిస్:

1. ఆర్థరైటిస్:

దాల్చిన చెక్క మరియు తేనె కాంబినేషన్ ఆర్థరైటిస్ ఒక ఉత్తమ చికిత్స వంటింది. రెండు బాగాల గోరువెచ్చని నీళ్ళలో ఒక బాగం తేనె మరియు ఒక చెంచా దాల్చిన చెక్క పౌడర్ వేసి, బాగా మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. శరీరంలో నొప్పి, వాపు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. నొప్పి చాలా త్వరగా తగ్గుతుంది . అలాగే ఆర్థరైటిస్ పేషంట్స్ ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్కపౌడర్ మిక్స్ చేసి బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే క్రోనిక్ ఆర్ధరైటిస్ నివారించబడుతుంది.

2. హెయిర్ లాస్:

2. హెయిర్ లాస్:

దాల్చిన చెక్కతేనె కాంబినేషన్ తో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. జుట్టు రాలడం అరికడుతుంది. జుట్టు రాలడం, బట్టతలతో బాధపడే వారు హాట్ ఆలివ్ ఆయిల్,దాల్చిన చెక్క పౌడర్ , ఒక చెంచా తేనె మిక్స్ చేసి దీన్ని తలస్నానానికి ముందు తలకు పట్టించి , 15నిముషాల అలాగే ఉండి, తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

3. బ్లాడర్ ఇన్ఫెక్షన్:

3. బ్లాడర్ ఇన్ఫెక్షన్:

రెండు చెంచాల దాల్చిన చెక్క ఒక చెంచా తేనె ఒక గ్లాసు గోరువెచ్చనీ నీటిలో మిక్స్ చేసి త్రాగాలి. ఇది యూరినరీ బ్లాడర్ లో క్రిములను పూర్తిగా పతనం చేస్తుంది.

4. దంతాల నొప్పి:

4. దంతాల నొప్పి:

దాల్చిన చెక్క, తేనె కాంబినేషన్ లో మారో హెత్త్ బెనిఫిట్ దంతాల నొప్పిని నివారిస్తుంది. ఒక చెంచా దాల్చిన చెక్క పౌడర్, 5చెంచాల తేనె మిక్స్ చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయాలి. ఈ హోంరెమెడీని రోజుకు మూడు సార్ల్ చేస్తే దంతాల నొప్పి నివారించబడుతుంది.

5. కొలెస్ట్రాల్:

5. కొలెస్ట్రాల్:

ఊబకాయస్తులు మరియు అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి 2టేబుల్ స్పూన్ల తేనె మరియ 3టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడినొ ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా మిక్స్ చేసి రెగ్యులర్ కొద్దిరోజులు తీసుకొంటే అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.

6. దగ్గు మరియు జలుబు తగ్గిస్తుంది:

6. దగ్గు మరియు జలుబు తగ్గిస్తుంది:

తరచూ దగ్గు మరియు జలుబుతో బాధపడుతుంటే, గోరువెచ్చగా తేనె మరియు 1/4దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి రోజూ 3రోజుల పాటు తీసుకుంటే, క్రోనిక్ దగ్గు, జలుబు నివారిస్తుంది మరియు సైనస్ ను క్లియర్ చేస్తుంది.

7. వంధ్యత్వం(ఇన్ ఫెర్టిలిటి):

7. వంధ్యత్వం(ఇన్ ఫెర్టిలిటి):

తేనె పురుషుల్లో వీర్యకణాలను ఉత్పత్తికి సహాయపడుతుందని పూర్వకాలం నుండి నమ్ముతున్నారు. నిద్రించడానికి ముందు రెండు చెంచాల తేనె తీసుకుంటే సమస్య పరిష్కరించబడుతుంది. మహిళలు గర్బంపొందలేకపోతే, తేనె దాల్చిన చెక్క పేస్ట్ ను చిగుళ్ళకు అప్లై చేస్తుంటే ఇది త్వరగా రక్తంలో రక్తప్రసరణలో నిధానంగా షోషింపబడుతుంది.

8. స్టొమక్ అప్ సెట్:

8. స్టొమక్ అప్ సెట్:

తేనె మరియు దాల్చిన చెక్క మిశ్రమం జీర్ణ సమస్యలను నివారిస్తుంది . పొట్టబారంను తగ్గిస్తుంది. ఇంకా కడుపు నొప్పి మరియు స్టొమక్ అల్సర్ ను నివారిస్తుంది.

9.గ్యాస్ అండ్ కడుపు ఉబ్బరం:

9.గ్యాస్ అండ్ కడుపు ఉబ్బరం:

కడుపు ఉబ్బరం, త్రేన్పులు మరియు గ్యాస్ అనేవి ఆహారం తీసుకొనేప్పుడు గాలిని మింగడం కారణంగా జరుగుతుంది. మరియు కొన్ని ఆహారాలు జీర్ణ కాకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. తేనెను దాల్చిన చెక్క పౌడర్ తో తీసుకుంటే గ్యాస్ ను నివారిస్తుంది.

10. హార్ట్ డిసీజ్:

10. హార్ట్ డిసీజ్:

తేనె మరియు దాల్చిన చెక్క పౌడర్ ను మిక్స్ చేసి బ్రెడ్ కు జామ్ కు బదులుగా ఈ మిశ్రమాన్ని అప్లై చేసి రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్ లెవల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ నుండి పేషంట్ కు రక్షణ కల్పిస్తుంది.

11. వ్యాధినిరోధకతను పెంచుతుంది:

11. వ్యాధినిరోధకతను పెంచుతుంది:

తేనె మరియు దాల్చిన చెక్క కాంబినేషన్ వ్యాధినిరోధకతను పెంచుతుంది. మరియు శరీరంను బ్యాక్టీరియా మరియు వైరల్ అటాక్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. వివిధ రకాల విటమిన్స్ మరియు ఐరన్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని పరిశోధన ద్వారా వెల్లడైనది. కాబట్టి, తేనెను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకతను పెచుతుంది.

12. అజీర్ణం:

12. అజీర్ణం:

తేనె మరియు దాల్చిన చెక్క కాంబినేషన్ లో జీర్ణక్రియను పెంచుతుంది. రెండు చెంచాల తేనె మీద కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ ను చిలకరించి ఆహారం తీసుకొనే ముందు తీసుకుంటే ఎసిడిటి నివారిస్తుంది.

13. ఇన్ఫ్లూయాంజా:

13. ఇన్ఫ్లూయాంజా:

తేనెలో నేచురల్ పదార్థాలు ఉండటం వల్ల , ఇది ఇన్ఫ్లూయాంజాకు సంబంధించన క్రిములను నాశనం చేసి, ఫ్లూ నుండి పేషంట్ ను రక్షిస్తుంది. తేనెను దాల్చిన చెక్కతో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల ఇన్ఫ్లూయాంజాకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. లక్షణాలను మరియు జర్మ్స్ ను నాశనం చేస్తుంది.

14. మొటిమలు:

14. మొటిమలు:

ఒక చెంచా తేనెలో మరియు ఒక చెంచా దాల్చిన చెక్క మిక్స్ చేసి ఈ పేస్ట్ ను మొటిమలున్న ప్రదేశంలో నిద్రించడానికి ముందు అప్లై చేయాలి . ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ రెండు వారాల పాటు చేస్తే మొటిమలను పూర్తిగా తగ్గించేస్తుంది.

15. స్కిన్ ఇన్ఫెక్షన్స్:

15. స్కిన్ ఇన్ఫెక్షన్స్:

ఎగ్జిమా, రింగ్ వార్మ్, మరియు అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది .

16. బరువు తగ్గిస్తుంది:

16. బరువు తగ్గిస్తుంది:

దాల్చిన చెక్క, తేనె మిశ్రమంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసి, ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ఒక గంట ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రి నిద్రించే ముందు కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

17. చెడు శ్వాస:

17. చెడు శ్వాస:

కొద్దిగా వేడినీళ్ళలో తేనె మరియు దాల్చిన చెక్క పౌడర్ వేసి మిక్స్ చేసి నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెడు శ్వాస నివారించబడుతుంది.

ఆకలిని కంట్రోల్ చేస్తుంది

ఆకలిని కంట్రోల్ చేస్తుంది

తేనె మరియు దాల్చిన చెక్క పొడి బరువు తగ్గించడానికి సహాయపడటంతో పాటు ఆకలిని కంట్రోల్ చేస్తుంది. దాల్చిన చెక్క మరియు తేనె మిశ్రమం పెద్దప్రేగులలోని పారాసైట్స్, ఫంగస్, మరియు బ్యాక్టీరియాను శుభ్రం చేస్తుంది. తేనె బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. దాంతో ఆకలి కంట్రోల్ అవుతుంది.

English summary

18 Interesting Health Benefits Of Honey And Cinnamon

It is found that mixture of Honey and Cinnamon cures most of the diseases. Honey has been used as a medicine for centuries and is a natural medicine. Scientists also accept honey as a very effective medicine for all kinds of diseases.
Desktop Bottom Promotion