For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఇబ్బంది కలిగించే గ్యాస్ర్టిక్ ట్రబుల్ తగ్గించే న్యాచురల్ హోం రెమిడీస్

  By Nutheti
  |

  అందరికీ స్పైసీ, డిలీషియస్ ఫుడ్ అంటే ఇష్టం. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా తింటుంటాం. దీనివల్ల పొట్టలో నొప్పి, ఉబ్బరం, గ్యాస్ర్టిక్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలా అని తినడం మానేయలేం కదా ? కాబట్టి చాలా మందిని వేధించే గ్యాస్ర్టిక్ ప్రాబ్లమ్స్ చెక్ పెట్టడానికి అనేక రకాల హోం రెమిడీస్ ఉన్నాయి. కేవలం పొట్టలో సమస్యలో కాదు కొన్ని రకాల ఆహారాలు హార్ట్ బర్న్, ఎసిడిటీకి కూడా కారణమవుతాయి. కాబట్టి సమస్య కనిపించిన వెంటనే తగ్గించుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

  READ MORE: మీకు గ్యాస్ సమస్య తీసుకొస్తున్న ఆహారాలేంటో తెలుసా ?

  గ్యాస్ ప్రాబ్లమ్ కి సగం కారణం జీర్ణవ్యవస్థలో గాలి చేరడం అయితే.. పొట్టలో బ్యాక్టీరియా చేరడం మరింత సమస్య. తీసుకున్న ఆహారం ఎప్పుడైతే సరిగా కదలదో అప్పుడు గ్యాస్ర్టిక్ సమస్య మొదలవుతుంది. ఇలాంటి సందర్భంలో చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. కాబట్టి చాలావరకు అనేకమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. గ్యాస్ర్టిక్ సమస్యను చిటికెలో తగ్గించుకోవడానికి చక్కటి ఈజీ పరిష్కారాలున్నాయి. ఆ సులభ హోం రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  మిరియాలు

  మిరియాలు

  మిరియాలలో ఉండే హైడ్రోక్లోరిడ్ యాసిడ్ జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. అరస్పూన్ బెల్లం, చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకోవాలి. దీనివల్ల గ్యాస్ర్టిక్ ట్రబుల్ మాత్రమే కాదు ఎసిడిటీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

  దాల్చిన చెక్క

  దాల్చిన చెక్క

  స్పైసీగా, స్వీట్ గా ఉండే చెక్క గ్యాస్ర్టిక్ ప్రాబ్లమ్ కి పవర్ ఫుల్ హోం రెమిడీ. ఒక కప్పు కాచిన నీళ్లలో ఒక స్పూన్ చెక్క పొడి కలిపి కొన్ని నిమిషాలు అలానే వదిలేయాలి. తర్వాత ఈ టీ తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ చెక్క పొడికి కొంచెం తేనెను గోరువెచ్చని పాలలో కలిపి తీసుకున్నా మంచి ఉపశమనం కలుగుతుంది.

  లవంగాలు

  లవంగాలు

  పొట్ట ఉబ్బరంగా, గ్యాస్ర్టిక్ ప్రాబ్లమ్ లేదా డైజెషన్ ప్రాబ్లమ్ అనిపించినప్పుడు ఒకటి లేదా రెండు లవంగాలను నోట్లో వేసుకుని చప్పరించాలి. దీనివల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ లవంగాలు తినడం ఇష్టం లేకపోతే లవంగం నూనెను తీసుకోవచ్చు.

  యాలకులు

  యాలకులు

  యాలకులు డైజెషన్ ప్రక్రియను ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే గ్యాస్ ని అరికడతాయి. యాలకును మరుగుతున్న నీటిలో వేసి 5 నుంచి 7 నిమిషాలు ఉంచాలి. తర్వాత నిదానంగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

  అల్లం

  అల్లం

  భోజనం తర్వాత చిన్న అల్లం ముక్కను నములుతూ ఉండటం వల్ల గ్యాస్ ఏర్పడకుండా అరికట్టవచ్చు. లేదా తాజా అల్లం తీసుకుని మరుగుతున్న నీటిలో కొన్ని నిమిషాలు ఉంచి తర్వాత రోజుకి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల గ్యాస్ర్టిక్ ట్రబుల్ నుంచి బయటపడవచ్చు.

  నిమ్మకాయ

  నిమ్మకాయ

  ఒక గ్లాసు వేడినీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. అలాగే వాంతుల ఫీలింగ్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

  సోపు

  సోపు

  సోపు తినడానికి ఇండియన్స్ ఎక్కువ ఇష్టపడతారు. ఇది గ్యాస్ ఏర్పడకుండా కాపాడుతుంది. కాబట్టి టీ రూపంలో వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. ఒక టీ స్పూన్ సోపు గింజలు ఒక కప్పు మరుగుతున్న నీటిలో వేసి.. 10 నిమిషాల పాటు ఉంచి టీ తయారు చేసుకుని తాగాలి. లేదా కొన్ని సోపు గింజలు తీసుకుని నమలడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.. ఎలాంటి గ్యాస్ సమస్యా ఉండదు.

  పుదీన ఆకు

  పుదీన ఆకు

  గ్యాస్ర్టిక్ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే.. కొన్ని పుదీనా ఆకులను నమలితే సరిపోతుంది. లేదా ఒక కప్పు మరుగుతున్న నీటిలో గుప్పెడు పుదినా ఆకులు వేయాలి. కాసేపు అలానే ఉంచి.. తర్వాత తేనె కలుపుకుని తాగడం వల్ల గ్యాస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

  జీలకర్ర

  జీలకర్ర

  గ్యాస్ర్టిక్ ట్రబుల్ నుంచి ఉపశమనం పొందడానికి జీలకర్ర పవర్ ఫుల్ హోం రెమిడీ. మరుగుతున్న గ్లాస్ నీళ్లలోకి కొన్ని జీలకర్ర వేసి.. ఈ టీని రోజుకి ఒక్కసారి తాగడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. లేదా కొంచెం జీలకర్ర తీసుకుని నములుతూ ఉన్నా ఫలితం ఉంటుంది.

  పెరుగు

  పెరుగు

  పెరుగులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే ఇందులో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. డైజెస్టివ్ ట్రాక్ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

  మంచినీళ్లు

  మంచినీళ్లు

  మంచినీళ్లు శరీరానికి అవసరమైనన్ని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం. కాబట్టి ఎక్కువ మోతాదులో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ సులభంగా వేగంగా జరుగుతుంది.

  వెల్లుల్లి

  వెల్లుల్లి

  గ్యాస్ర్టిక్ ట్రబుల్ నుంచి ఉపశమనం కలిగించే హోం రెమిడీస్ లో వెల్లుల్లి కూడా చాలా బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి వేసి సూప్ తయారు చేసుకుని తాగడం వల్ల గ్యాస్ర్టిక్ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

  గ్రీన్ టీ

  గ్రీన్ టీ

  ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల పొట్టలో వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే కొన్ని తులసి ఆకులు, నిమ్మరసం కూడా గ్రీన్ టీలో కలుపుకోవడం వల్ల సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చు.

  English summary

  Effective And Natural Home Remedies To Treat Gas Troubles: Remedies for Gastric Problems

  We all love to eat spicy and delicious food. Sometimes, we overeat and this results in stomach pain and bloating. Does this mean that you will stop eating? Well there is no need for that, since there are many home remedies which can solve heart burn and bloating.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more