For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హై బీపీని తగ్గించడానికి సహాయపడే ఫుడ్స్

By Nutheti
|

హైబీపీతో బాధపడే వాళ్ల సంఖ్య ఎక్కువవుతోంది. హై బ్లడ్ ప్రెజర్, ఫైపర్ టెన్షన్ ఉన్న వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో బ్లడ్ ప్రెజర్ హార్ట్ ఎటాక్ కి, కిడ్నీ డిసీజ్ లకు, స్ర్టోక్ లకు కూడా కారణమవుతాయి. దీనికి ఒత్తిడి, ఎక్కువ సోడియం తీసుకోవడం, షుగర్ వ్యాధి కారణాలు. అధిక రక్తపోటుకి ఎలాంటి వార్నింగ్ సైన్స్, లక్షణాలు కనిపించవు. కాబట్టి రెగ్యులర్ చెక్ అప్ ల ద్వారానే బీపీని గుర్తించవచ్చు.

READ MORE: హై బ్లడ్ ప్రెజర్ ను మరింత పెంచే 10 వరెస్ట్ ఫుడ్స్

మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని మార్పులు తీసుకురావడం వల్ల రక్తపోటుని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును తగ్గించవచ్చు. పండ్లు, కూరగాయలను ఎంపిక చేసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. తక్కువ సోడియం, ఎక్కువ పొటాషియం ఉన్న ఆహారాలు హైపర్ టెన్షన్ ని తగ్గిస్తాయి. అలాగే హార్ట్ ఎటాక్, స్ర్టోక్ రిస్క్ ల నుంచి తప్పించుకోవచ్చు.

బఠాణీలు

బఠాణీలు

బఠాణీల్లో ప్రొటీన్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి కొలెస్ర్టాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే అధిక రక్తపోటుతో పోరాడుతాయి. క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ల నుంచి అరికడతాయి. అలాగే విటమిన్స్, ఫోలిక్ యాసిడ్ ఇందులో ఎక్కువగా లభిస్తుంది.

బొప్పాయి

బొప్పాయి

పొటాషియం కంటెంట్ బొప్పాయిలో పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇందులో మినరల్స్, ఎలక్రోలైట్స్ ఉంటాయి. ఇవి అధిక రక్తపోటుని కంట్రోల్ చేస్తాయి.

గ్రీన్ బీన్స్

గ్రీన్ బీన్స్

గ్రీన్ బీన్స్ బ్లడ్ ప్రెజర్ ని అరికడతాయి. అలాగే స్ర్టోక్, గుండె సంబంధిత వ్యాధులు కూడా అదుపులో ఉంటాయి. ఇందులో ఎక్కువ పొటాషియం ఉంటుంది.. కాబట్టి బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడానికి రెగ్యులర్ డైట్ లో గ్రీన్ బీన్స్ చేర్చుకోవడం మంచిది .

పెరుగు

పెరుగు

పెరుగులో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం ఉండటం వల్ల ఇవి శరీరంలో ఫ్యాట్ తగ్గిస్తాయి. అలాగే రక్తపోటు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. నిత్యం ఎవరైతే పెరుగు తప్పనిసరిగా తీసుకుంటారో వాళ్లకు అధిక రక్తపోటు వచ్చే రిస్క్ తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

సెలరీ

సెలరీ

సెలరీ గుండె పనితీరు సజావుగా సాగడానికి సహాయపడుతుంది. అలాగే బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గడానికి, రక్తపోటు పెరగడానికి కారణమయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్

సన్ ఫ్లవర్ సీడ్స్

బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ తగ్గించడంలో సన్ ఫ్లవర్ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ డీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రొటీన్స్, ఫైబర్ బాగా పొందవచ్చు. సన్ ఫ్లవర్ సీడ్స్ పెప్టిసైడ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఇవి అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది.

అరటిపండ్లు

అరటిపండ్లు

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. అలాగే కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో సోడియం శాతాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

English summary

Foods That Help To Lower High Blood Pressure

High blood pressure, or hypertension, is a medical condition in which the arteries experience an extreme blood pressure regularly while circulating blood throughout the body.
Desktop Bottom Promotion