For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాన్సిల్స్ సమస్యకు సత్వర ఉపశమనం కలిగించే చిట్కాలు

By Nutheti
|

చలికాలం వచ్చిందంటే... దగ్గు, జలుబే కాదు.. టాన్సిల్స్ సమస్య తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది. గొంతువాపు, నొప్పి, ఆహారం మింగలేకపోవడం, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు టాన్సిల్స్ లక్షణాలు. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక సూక్ష్మక్రిములు ఎక్కువ కావడం వల్ల టాన్సిల్స్ ఇన్‌ఫెక్షన్‌కు గురై గొంతు నొప్పి మొదలవుతుంది. దీన్నే టాన్సిలైటిస్ అని పిలుస్తారు.

టాన్సిల్స్ సమస్య చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడక వేధిస్తుంది. పిల్లల్నేకాదు, పెద్దవాళ్లను కూడా ఇబ్బందిపెట్టే ఈ టాన్సిల్స్ సమస్యకు చెక్ పెట్టేందుకు చక్కటి హోంరెమిడీస్ అందుబాటులో ఉన్నాయి. సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా టాన్సిల్స్ వాపు త్వరగా తగ్గించుకోవచ్చు. సత్వర ఉపశమనాన్నిచ్చే రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఉప్పు

ఉప్పు

టాన్సిల్స్ వల్ల వచ్చే నొప్పిని కంట్రోల్ చేయడానికి ఉప్పు చక్కటి పరిష్కారం. కప్పు వేడి నీళ్లలో ఉప్పు వేసి కలపాలి. గోరువెచ్చగా అయిన తర్వాత గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతులో చేరిన బ్యాక్టీరియా నశిస్తుంది. నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.

పసుపు

పసుపు

టాన్సిల్స్ సమస్యను తగ్గించడంలో పసుపు చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా పసుపు కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పాలు, పసుపు

పాలు, పసుపు

రాత్రి పడుకునే ముందు వేడి పాలలో ఒక చెంచా పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల వరకు తీసుకుంటూ ఉంటే.. టాన్సిల్స్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

నిమ్మరసం

నిమ్మరసం

టాన్సిల్స్ వాపుతో బాధపడుతున్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ.. విటమిన్ సి లభించే నిమ్మరసం మాత్రం టాన్సిల్స్ సమస్యకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు.. చక్కగా పనిచేస్తాయి. గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసం తీసి, చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.

చెక్క

చెక్క

ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో చెంచా దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి రోజూ రెండు లేదా మూడు పూటలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. గొంతులో వేధించే నొప్పి, వాపు కూడా తగ్గిపోతాయి.

తులసి

తులసి

తులసిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు టాన్సిల్స్ సమస్యను ఈజీగా తగ్గిస్తాయి. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని తులసి ఆకులు వేసి.. 10 నిమిషాలు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ద్రావణాన్ని వడగట్టి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. అవసరమైతే ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు. ఇలా మూడు రోజుల పాటు మూడు సార్లు తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

మిరియాలు

మిరియాలు

ఒక స్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్ల తేనె తీసుకుని నాలుగు స్పూన్ల వేడినీళ్లలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు ఒక స్పూన్ తీసుకుంటే.. టాన్సిల్స్ నుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది.

English summary

Home Remedies To Cure Tonsillitis

Tonsillitis is a throat infection that occurs on the tonsil. Tonsils are two masses of lymph tissue that are located on each side of the throat. Tonsillitis is often accompanied with sore throat, swollen tonsils, throat pain, itchiness, ear ache, fever and cold chills.
Story first published: Monday, December 28, 2015, 12:12 [IST]
Desktop Bottom Promotion