రెగ్యులర్ డైట్ లో ధనియాల అవసరమేంటి ?

By Nutheti

మసాలా దినుసుల్లో కంపల్సరీ వాడే ధనియాలు ప్రతి ఇంట్లోనూ అవసరమే. చేదు, కారం, వగరు వంటి రుచుల సమ్మేళనమైన ధనియాలను సాంబారు, చారు, కూరల్లో వాడుతారు. ఏ వంటకానికైనా మంచి రుచితో పాటు, ఘాటైన సువాసనను ఇస్తాయి ధనియాలు. ధనియాలు లేనిదే ఏ కూరలు వండరు. అలాంటి అమోఘమైన ధనియాలలో రుచే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.

ధనియాలలో పొటాషియం, ఇనుము, విటమిన్ ఎ, కె, C, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన 30 శాతం విటమిన్ సి లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో ఐరన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి స్ర్తీలు వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

READ MORE: కొత్తిమీరలోని 11ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

గ్యాస్‌ నుంచి ఉపశమనం కలిగించడానికి, శరీరాన్నిచల్లబరచడానికి, లైంగిక శక్తి పెంచడానికి, రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించడానికి ధనియాలు చాలా బాగా పనిచేస్తాయని తాజా అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చిటికెలో చెక్ పెట్టే అద్భుతమైన గుణం కూడా ఈ ధనియాల్లో ఉంది. ధనియాల వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో ఓ సారి చెక్ చేద్దాం..

రక్తస్రావం

రక్తస్రావం

కొందరు మహిళల్లో పీరియడ్స్ టైంలో రక్తస్రావం ఎక్కువగా అవుతుంటుంది. తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడే మహిళలు ధనియాలను కషాయంలా తయారు చేసుకుని ప్రతిరోజు మూడు పూటలా రెండు చెంచాల చొప్పున తీసుకుంటే రక్తస్రావం తగ్గి ఉపశమనం కలుగుతుంది.

మోకాళ్ళ నొప్పులకు

మోకాళ్ళ నొప్పులకు

మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఒక చెంచా ధనియాల చూర్ణంలో రెండు చెంచాల చక్కెరను కలిపి సేవిస్తే మోకాళ్ళ నొప్పులు మటుమాయమవుతాయి.

మధుమేహానికి

మధుమేహానికి

మధుమేహానికి ధనియాలు మంచి మందు. రోజూ ఉదయం, సాయంత్రం ధనియాల రసాన్ని తాగితే మధుమేహం నుంచి బయటపడవచ్చు. సహజ రూపంలో ధనియాలను తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిచవచ్చని అనేక పరిశోధనులు, అధ్యయనాలు చెబుతున్నాయి.

కొలెస్ర్టాల్ తగ్గించడానికి

కొలెస్ర్టాల్ తగ్గించడానికి

ధనియాల పొడి కొలెస్ట్రాల్‌ని నియంత్రిస్తుంది. మరిగించిన నీటిలో ధనియాల పొడి కలిపి వడకట్టాలి. ఆ నీటిని రెండు పూటలా కొన్ని నెలలపాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

అల్జీమర్స్ వ్యాధికి

అల్జీమర్స్ వ్యాధికి

శరీరంలో పేరుకుపోయిన సీసం, ఆర్సెనిక్, పాదరసం, అల్యూమినియం వంటి విషపూరిత లోహాల వలన అల్జీమర్స్ వ్యాధి, జ్ఞాపకశక్తి కోల్పోవటం, కంటిచూపు మందగించటం, కార్డియో వాస్కులర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహారంలో ధనియాలు ఎక్కువగా వాడటం వలన శరీరంలో ఉండే ఈ విషపూరిత లోహాలను బయటకు పంపిస్తాయి.

జీర్ణక్రియకు

జీర్ణక్రియకు

ధనియాలలో ఉన్నఅనామ్లజనిత లక్షణాలు జీర్ణక్రియ సజావుగా జరగడానికి తోడ్పడతాయి. అంతేకాదు మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. జీర్ణక్రియకు కావాల్సిన ఎంజైమ్స్, రసాలను ఉత్పత్తి చేయటంలో ధనియాలు సహాయపడతాయి.

అజీర్ణం

అజీర్ణం

ధనియాలను ముఖ్యంగా పైత్యానికి ఉపయోగిస్తారు. ధనియాలను నూనె లేదా నేయ్యిలో వేయించి కొద్దిగా ఉప్పు,కారం కలిపి పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకుని తింటే అజీర్ణం, విరేచనాలు తగ్గిపోతాయి.

జ్వరం

జ్వరం

జ్వరం వచ్చినప్పుడు చాలా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. కొందరికి తలతిరగడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటప్పుడు ధనియాల కషాయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ధనియాలను నూరి తలకు రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

ఆకలి పెంచడానికి

ఆకలి పెంచడానికి

చాలా మంది ఆకలి ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాసిన్ని ధనియాలను నీళ్లలో ఉడకబెట్టి కషాయంలా తీసుకుంటే ఆకలి ఎక్కువ అవడానికి సహకరిస్తుంది.

కడుపులో మంట

కడుపులో మంట

కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడే వాళ్లు నిత్యం కాస్త ధనియాల కషాయం తాగితే మంచి ఫలితం ఉంటుంది. గ్యాస్ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.

నిద్రకు

నిద్రకు

నిద్రలేమితో బాధపడేవాళ్లకు ధనియాలు చక్కటి పరిష్కారం. ధనియాల కషాయంలో పాలు, పంచదార కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.

జలుబు నివారణకు

జలుబు నివారణకు

జలుబుతో బాధపడుతున్నప్పుడు కాస్త ధనియాల కషాయం తీసుకుంటే సరిపోతుంది. అలాగే ముక్కులో రక్తం కారుతు ఇబ్బందిపెడుతుంటే.. కొన్ని చుక్కల ధనియాల రసాన్ని ముక్కులో వేస్తే ఆగిపోతుంది.

లైంగిక శక్తికి

లైంగిక శక్తికి

ధనియాలలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి అనారోగ్య సమస్యలు నివారించడానికే కాదు.. లైంగిక శక్తి పెంచడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకోవడం చాలా అవసరం.

టైఫాయిడ్

టైఫాయిడ్

టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో ధనియాలు పోరాడగలవు. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ధనియాల పొడిని చేర్చుకోవడం వల్ల ఆహారం వల్ల వచ్చే వ్యాధులను నివారిస్తుంది.

మొటిమలు, మచ్చలు

మొటిమలు, మచ్చలు

ధనియాల పొడి వల్ల సౌందర్యానికి కూడా సహాయపడుతుంది. ధనియాల పొడి, పసుపును పేస్ట్ లా తయారు చేసుకుని మొటిమలు, మచ్చలపై అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అంటువ్యాధుల నివారణకు

అంటువ్యాధుల నివారణకు

అంటువ్యాధులైన చికెన్ పాక్స్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఇవి సహాయపడతాయి. అంటువ్యాధులకు కారణమయ్యే సూక్మక్రిములతో పోరాడటానికి ధనియాల్లోని ఔషధ గుణాలు ఉపయోగపడతాయి.

ఫుడ్ పాయిజనింగ్

ఫుడ్ పాయిజనింగ్

ధనియాలు ఫుడ్ పాయిజనింగ్ కు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ధనియాల నుంచి తీసిన నూనె ఫుడ్ పాయిజనింగ్ కి కారణమయ్యే విషపూరిత బ్యాక్టీరియాతో పోరాడుతుంది.

Story first published: Tuesday, November 24, 2015, 11:28 [IST]
Desktop Bottom Promotion