Latest Updates
-
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.?
పగటిపూట చిన్న కునుకు తీయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు
మధ్యాహ్నం అలా కునుకు తీయడం మీకో అలవాటా? హాయిగా ఓ గంటపాటు మిట్టమధ్యాహ్నం నిద్దరోతున్నారా? అయితే మీ ఆరోగ్యానికేం ఢోకా లేదంటున్నారు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు. ఇకపై మీ వారు మధ్యాహ్నం ఆ మొద్దునిద్దరేమిటని అడిగితే అదో హెల్త్ సీక్రెట్ అని చెప్పండిక.
ఆరోగ్యంగా ఉండాలంటే కాసేపు కునుకు తీయడమే...! పగలు కొంతసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు నిపుణులు...! కొందరు కాసేపు కునుకు తీసుకుంటాను. అని అంటూనే నిద్రలోకి జారుకుంటుంటారు. ఇలా ఎక్కడపడితే అక్కడ కునుకు తీయడం కొందరికి అలవాటే. ఈ అలవాటే వారిని ఆరోగ్యవంతులుగా మారుస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మనలో చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గానీ తీరిక దొరికినప్పుడు గానీ కొద్దిసేపు కునుకు తీయటం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కాసేపు నిద్రపోవటం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల మోతాదులు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
READ MORE: అధిక నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్.!నివారణ ఎలా?
అప్పుడప్పుడు నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి చేకూరుతుంది. దీంతో శరీరం పునరుత్తేజితమవుతుంది. పైగా ఇలా కునుకు తీసుకునే వారికి మానసికపరమైన ఒత్తిడి, శారీరకపరమైన ఒత్తిడి దరిచేరవంటున్నారు పరిశోధకులు.

మెమరీ పవర్
రీసెంట్ గా జరిపిన పరిశోధన ప్రకారం పగటి పూట చిన్న పాటి కునుకు తీయడం వల్ల ఆశ్చర్యం కలిగించే ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా అందులో మెమరీ పవర్ ను పెంచుతుంది.

బ్లడ్ ప్రెజర్
బ్లడ్ ప్రెజర్ ను చాలా గొప్పగా తగ్గిస్తుందని, రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో నిర్ధారించారు.

విశ్రాంతి పరుస్తుంది
గుండె పనితీరు మెరుగయ్యేందుకు, హార్మోన్‌ల హెచ్చుతగ్గులను సమం చేసేందుకు, రక్తనాళాలు శుభ్రపరిచేందుకు పగటి నిద్ర ఉపకరిస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే ఒత్తిడిని దీని ద్వారా తగ్గించుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో 20-30 నిమిషాలు నిద్రపోవడం వల్ల ఆ తరువాత చేసే పనిలో ఉత్సాహం నిండు తుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మగవారితో పోలిస్తే ఆడవారిలో మధ్యాహ్నం నిద్రవల్ల కలిగే లాభాలు కాస్త తక్కువే.

చురుకుదనం
మధ్యహ్నాన సమయంలో ఆఫీసులో లోప్రొడక్టివిటి లెవల్స్ తగ్గడం వల్ల కొద్దిగా బద్దకంగా ఫీలవుతారు. కాబట్టి, భోజనం తర్వాత చిన్నపాటి కునుకు తీయడం చురదనం తిరిగి పొందడం వల్ల ఏకాగ్రతను పెంచుకోవచ్చు.

ఉత్తేజపరుస్తుంది
మిమ్మల్ని మీరు ఉత్తేజపరచడానికి కెఫిన్ కలిగినటువంటి కాఫీని అధికంగా తీసుకుంటుంటారు. అయితే కాఫీకి బదులుగా చిన్న కునుకు తీయడం వల్ల ఆరోగ్యానికి మంచిది మరియు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంటుంది.

నిద్రలేమిని నివారిస్తుంది
కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిదేనా? అవును మంచిదే ఎందుకంటే నిద్రలేమితో బాధపడేవారు. చిన్నపాటి కునుకు తీయడం వల్ల నిద్రలేమి సమస్యను దూరం చేసుకొని బాగా నిద్రపట్టేందుకు సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications