For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీగా, యంగ్ గా కనింపించడానికి సూపర్ ఫుడ్స్

By Nutheti
|

యంగ్ గా ఉండటం అంటే కేవలం ముడతల లేని చర్మం మాత్రమే కాదు.. ఆరోగ్యంగానూ ఉండాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా.. వయసు పెరిగినా హెల్తీగా, యంగ్ లుక్ తో ఉండాలి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ గుండె సమస్యలు, డయాబెటీస్, కొలెస్ర్టాల్ వంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఇప్పటికీ, ఎప్పటికీ నవయవ్వనంగా... ఆరోగ్యంగా ఉండాలి అంటే హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి.

మోడల్స్ స్లిమ్ సీక్రెట్ వెనక ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి ? మోడల్స్ స్లిమ్ సీక్రెట్ వెనక ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి ?

ఆరోగ్యంతోపాటు, చర్మంలో ఎలాంటి మార్పులు రాకుండా జాగ్రత్త పడాలి. వయసు ఛాయలు స్కిన్ టోన్ ద్వారా తెలుస్తాయి.. అదేవిధంగా హెల్త్ పరంగానూ గమనించవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా యూత్ ఫుల్ గా కనిపించడానికి ఈ సూపర్ ఫుడ్స్ ని డైట్ లో చేర్చుకుంటే సరిపోతుంది.

పెరుగు

పెరుగు

క్యాల్షియం ఎక్కువగా ఉండే పెరుగు నిత్యం తీసుకునే వాళ్లకు ఎలాంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులు రావు. అలాగే ఇందులో ఉండే ప్రొబయోటిక్స్ ఆరోగ్యంగా, వయసుకు సంబంధించిన ఛాయలు కనిపించకుండా కాపాడుతుంది.

చేపలు

చేపలు

మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి ఫిష్ లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ర్టాల్ పెరగకుండా కాపాడుతుంది. అలాగే ఆర్థరైటిస్ రాకుండా, గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి.

టొమాటో

టొమాటో

చర్మం యూత్ ఫుల్ లుక్ సొంతం చేసుకోవడానికి టొమాటోలు బాగా సహాయపడతాయి. ఇందులో ఉండే లైకోపెన్ పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది అనారోగ్య సమస్యలు నివారిస్తుంది. కాబట్టి టొమాటోలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు బతకడమే కాదు.. యంగ్ గా కూడా కనిపిస్తారు.

పాలకూర

పాలకూర

పాలకూరలో ఉండే లుటీన్, యాంటీ ఆక్సిడెంట్స్.. చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలతో పోరాడుతుంది. దాంతోపాటు క్యాన్సర్, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో పోరాడుతుంది.

నట్స్

నట్స్

నట్స్ ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటారో వాళ్లు చాలా ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటారు. ఇందులో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి ఆలివ్ ఆయిల్ తో సమానం. విటమిన్స్, మినరల్స్, ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల.. ఎలాంటి అనారోగ్య సమస్య దరిచేరదు.

సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్

సాల్మన్ చేపలు చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతాయి. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్.. ఇన్ఫ్లమేషన్ కాకుండా నివారిస్తాయి. అలాగే చర్మంపై ముడతలు, స్కిన్ క్యాన్సర్ రిస్క్ నుంచి నివారిస్తుంది.

క్యారెట్స్

క్యారెట్స్

క్యారెట్స్ రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, క్యాన్సర్ నిరోధించడానికి సహాయపడతాయి. ఈ రంగులో ఉండే స్వీట్ పొటాటో, పంప్కిన్, ఆరంజ్ కలర్ కూరగాయలు తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తలెత్తవు.

వైన్

వైన్

ఆల్క‌హాల్ తీసుకోవ‌డం వ‌ల్ల‌ వ‌య‌సు రిత్యా వ‌చ్చే గుండె సంబంధిత వ్యాధులు, డ‌యాబెటిస్, జ్ఙాప‌క‌శ‌క్తి వంటి స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది. ఈలాగే రెడ్ వైన్ ఏజింగ్ ని కూడా అరిక‌డుతుంది. అయితే.. మోతాదుకు మించి తాగితే.. ఆరోగ్యానికి మంచిది కాదు.

పుచ్చ‌కాయ‌

పుచ్చ‌కాయ‌

పుచ్చ‌కాయ‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ఆరోగ్యానికి మెట‌బాలిజం శ‌క్తికి స‌హాయ‌ప‌డ‌తాయి. కానీ కేవ‌లం రెడ్ క‌ల‌ర్ భాగం మాత్ర‌మే కాదు.. కాయ బెర‌డు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇందులో విట‌మిన్ ఏ, బి, సి పుష్క‌లంగా ఉంటాయి. అంతేకాదు ఈ గింజ‌లు కూడా మంచివే. పుచ్చ‌కాయ గింజ‌ల్లో జింక్, విట‌మిన్ ఈ ఉంటాయి. కాబ‌ట్టి పుచ్చ‌కాయ తీసుకోవ‌డం వ‌ల్ల వ‌య‌సు పెరిగినా, ఆరోగ్యంగా, య‌వ్వనంగా ఉంటారు.

ఓట్ మీల్

ఓట్ మీల్

తృణ‌ధాన్యాలు గుండె ఆరోగ్యానికి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఓట్స్ ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఓట్స్ తీసుకోవ‌డం వ‌ల్ల హెల్తీగా ఉండ‌టానికి, కొలెస్ర్టాల్ లెవెల్స్ కంట్రోల్ చేయ‌డానికి, గుండె సంబంధిత వ్యాధుల‌కు దూరంగా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

కొబ్బ‌రినూనె

కొబ్బ‌రినూనె

కొబ్బ‌రినూనె అన్ని ర‌కాల ఆయిల్స్ కంటే మంచిది. కొబ్బ‌రినూనెలో ఉండే శ్యాచురేటెడ్ ఫ్యాట్ గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇందులో ల్యూరిక్ యాసిడ్, బ్యాక్టీరియా అరిక‌ట్ట‌డానికి, వైర‌స్ రాకుండా నివారించ‌డానికి శ్యాచురేటెడ్ ఫ్యాట్ స‌హ‌క‌రిస్తుంది. ఎక్కువ టెంప‌రేచ‌ర్ లో కూడా వండ‌టానికి ఇది చాలా సేఫ్.

English summary

Superfoods to Keep You Young: What Makes You Old And What Keeps You Young?

Though we associate grey hair or wrinkles on the skin as few of the most common factors in signifying old age, experts state that there are others that can actually determine how fast you are ageing.
Story first published: Wednesday, December 16, 2015, 9:35 [IST]
Desktop Bottom Promotion