For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భోజనం తర్వాత చేయకూడని పనులు ?

By Nutheti
|

భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తుంటాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతూ మరింత డైలమాలో పడేస్తుంటారు. కొందరేమో అన్నం తిన్న వెంటనే పడుకుంటే లావైపోతారు అంటారు.. మరికొందరేమో తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగకూడదు అంటారు.

అసలు భోజనం చేసిన తర్వాత నియమాలు ఎందుకు ? అంటే.. తిన్న ఆహారం సరైన క్రమంలో జీర్ణమైతే ఎలాంటి సమస్యా ఉండదు. భోజనం తర్వాత చేసే కొన్ని పనుల వల్ల జీర్ణక్రియ సరిగా జరగక అనవసర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి భోజనం తర్వాత ఏ పనులు చేయకూడదో ఓ అవగాహనకు వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి భోజనం తర్వాత చేయకూడని ఆరు ముఖ్యమైన
పనులున్నాయి. అవేంటో చూడండి..

smoke

పొగత్రాగరాదు
చాలామందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. అయితే భోజనం తర్వాత స్మోకింగ్ అలవాటు అస్సలు మంచిది కాదు. కాబట్టి భోజనం తర్వాత సిగరెట్ తాగితే 10 సిగరెట్స్ తాగినట్టు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

fruits

పళ్లు తినకూడదు
భోజనం తర్వాత పండ్లు తినడం చాలా పాటిస్తుంటారు. అయితే ఆహారం తిన్న తర్వాత వెంటనే పండ్లు తినకూడదు. దీనివల్ల కడుపులో గాలి నిండి పొట్టలో సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి భోజనం చేసిన 2 గంటల తర్వాత పండ్లు తీసుకుంటే మంచిది.

tea

టీకి నో
భోజనం చేసిన తర్వాత టీ అసలు తాగకూడదు. ఎందుకంటే టీ తాగితే ఎక్కువ మోతాదులో ఆసిడ్ విడుదలై.. ఆహారం జీర్ణమవడానికి కష్టమవుతుంది.

bath

స్నానం చేయకూడదు
భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. దీనివల్ల రక్తం అంతా చేతులకి కళ్లకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణ ప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.

sleep

నిద్రపోకూడదు
భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ర్టిక్ ట్రబుల్ తోపాటు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది. మరీ ఎక్కవగా నిద్ర వస్తుంటే.. 15 నుంచి 20 నిముషాల కంటే ఎక్కువగా పడుకోకూడదు.

English summary

Things You Should Avoid After Lunch in telugu

Things You Should Avoid After Lunch.
Story first published: Thursday, November 19, 2015, 12:31 [IST]
Desktop Bottom Promotion