For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెష్ పొటాటో జ్యూస్ లోని టాప్ 10 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

|

బంగాళ దుంపలు, ప్రపంచంలో చాలా మంది ప్రజలకు ఇష్టమైన ఆహారాలలో ఒకటి. వీటిని చాలా రకాల కరకరలాడే చిరుతిళ్ళు తయారీలో ఎక్కువగా వాడుతుండటంతో, ఇవి ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. వీటి రుచితోపాటు, అనేకమైన ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి మరియు వీటి రసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కోసం ఉపయోగపడే B మరియు C వంటి విటమిన్లు, ఇనుము, పొటాషియం, భాస్వరం, ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లు ఉన్నాయి.

బంగాళదుంప అందరికి సుపరిచితమైన హెల్తీ అండ్ కామన్ వెజిటేబుల్. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది మరియు రుచికరమైనది కూడా . ఎందుకంటే, బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్, పొటాషియం(అమైనో ఆసిడ్స్)మరియు ఇతర విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. బంగాళ దుంపలో విటమిన్ సి, ఎ మరియు బి, ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం మరియు ఫాస్పరస్ లు అధికంగా ఉన్నాయి.

కడుపు మంటను చల్లార్చే బంగాళాదుంప...!

బంగాళదుంపలను ఉడికించి మరియు ఫ్రై చేసి తీసుకోవడం మాత్రమే కాదు, దీన్ని జ్యూస్ రూపంలో తీసుకొన్నా అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి మరియు అల్సర్ వంటి అనేక సమస్యలను నివారిస్తుంది. బంగాళదుంప జ్యూస్ లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. వండినప్పుడు ఈ న్యూట్రీషియన్స్ ను కోల్పోవడం జరుగుతుంది . కాబట్టి, ఈ సారి పొటాటాను హెల్తీగా తీసుకోవాలంటే జ్యూస్ రూపంలో తీసుకోండి.

పొటాటో జ్యూస్ ను హెల్తీ జ్యూస్ గా భావిస్తున్నారు . ఎందుకంటే ఇది ఆరోగ్యపరంగా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా కార్డియో వ్యాస్కులర్ వ్యాధులను మరింత ఎక్కువగా నివారిస్తుంది. క్యాన్సర్ తో బాధపడే వారు కూడా ఈ హెల్తీ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు త్రాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. శరీరంలో ఉండే క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ ను మాత్రమే కాదు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా దిట్ట పొటాటో జ్యూస్.

పొటాటో జ్యూస్ తో కురుల సోయగం రెట్టింపు....

మరి పొటాటో జ్యూస్ శరీరంలో వ్యర్థాలను , స్టొమక్ ఎలిమెంట్స్ ను ఏవిధంగా ఫ్లష్ అవుట్ చేస్తుంది. మరియు జీర్ణక్రియను ఎలా మెరుగుపరుస్తుంది. వీటితో పాటు మరికొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయండి...

1. జాయింట్ పెయిన్:

1. జాయింట్ పెయిన్:

పొటాటో జ్యూస్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. బంగాళదుంప జ్యూస్ లో జాయింట్ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్ పెయిన్ మరియు ఆర్థరైటిస్ ను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. బంగాళదుంప జ్యూస్ ను ఉదయం కాలీ పొట్టతో తీసుకోవాలి . పచ్చిబంగళాదుంప జ్యూస్ వల్ల ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

2.వ్యాధులను నిర్మూలించడానికి:

2.వ్యాధులను నిర్మూలించడానికి:

క్యార్డియో వ్యాస్కులర్ వంటి వ్యాధులను గ్రేట్ గా నివారిస్తుంది, అందుకు పొటాటో జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. వెజిటేబుల్లోని ఆల్కలైన్ నేచర్ శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

3. బరువు తగ్గించే పొటాటో జ్యూస్:

3. బరువు తగ్గించే పొటాటో జ్యూస్:

డైలీ బంగాళదుంప జ్యూస్ తీసుకోవడం ద్వారా బాడీ ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఒక గంటకు ముందుగానే తీసుకోవాలి మరియు నిద్రించే ముందు తీసుకోవాలి. బరువు తగ్గించుకొనే క్రమంలో ఈ జ్యూస్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసుకుంటే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది .

4. గౌట్ నివారణకు పొటాటో జ్యూస్ :

4. గౌట్ నివారణకు పొటాటో జ్యూస్ :

పురుషులు ఎవరైతే గౌట్ పెయిన్ తో బాధపడుతున్నారో అలాంటి వారికి పొటాటో జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది. పొటాటో జ్యూస్ ను ఫ్రెష్ గా త్రాగడం వల్ల శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ ను బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఈ జ్యూస్ లో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఇది ఇన్ల్ఫమేషన్ ను తగ్గిస్తుంది.

5. కొలెస్ట్రాల్ తగ్గించే పొటాటో జ్యూస్:

5. కొలెస్ట్రాల్ తగ్గించే పొటాటో జ్యూస్:

పొటాటో జ్యూస్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడం మరియు తద్వారా గుండె సంబంధిత సమస్యలు మరియు హార్ట్ అటాక్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఫ్రెష్ బంగాలదుంపల జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకొని కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ హార్ట్ హెల్త్ చాలా హాని జరగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడాని, మంచి కొలెస్ట్రాల్ తో ను రీప్లేస్ చేయాలి. ఆ భర్తీని బంగాళదుంప జ్యూస్ ఫిల్ చేస్తుంది.

6. టమ్మీ కోసం పొటాటో జ్యూస్ :

6. టమ్మీ కోసం పొటాటో జ్యూస్ :

అల్సర్ మరియు ప్రేగు సంబంధిత సమస్యలను నివారించడంలో బంగాళదుంప రసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ యాసిడ్ ను నివారిస్తుంది. స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంతో పాటు స్టొమక్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ను కూడా నివారిస్తుంది.

7. క్యాన్సర్ నివారిణి పొటాటో జ్యూస్:

7. క్యాన్సర్ నివారిణి పొటాటో జ్యూస్:

ఫ్రెష్ గా ఉండే పొటాటో జ్యూస్ లో క్యాన్సర్ ను మరియు క్యాన్సర్ సెల్స్ తో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇది శరీరంలోని ఆర్గాన్స్ డ్యామేజ్ ను మరియు క్యాన్సర్ సెల్స్ కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. దాంతో క్యాన్సర్ సెల్స్ బాడీలో విస్తరించకుండా నివారిస్తుంది.

8. హైబిపి తగ్గించుకోవడానికి పొటాటో జ్యూస్:

8. హైబిపి తగ్గించుకోవడానికి పొటాటో జ్యూస్:

బంగాళదుంపజ్యూస్ లో ఉండే పొటాషియం హార్ట్ కు మరియు రక్తకణాలకు చాలా మేలు చేస్తుంది . ఇది నార్మల్ బ్లడ్ ప్రెజర్ నుండి రక్షణ కల్పించి హార్ట్ అటాక్ ను నివారిస్తుంది. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఇందులో వేరే ఇతర పదార్థాలు, షుగర్, సాల్ట్ వంటివి చేర్చకుండా తీసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా ఫనిచేస్తుంది.

9. అల్సర్ కు బెస్ట్ పొటాటో జ్యూస్ :

9. అల్సర్ కు బెస్ట్ పొటాటో జ్యూస్ :

ప్రతి రోజూ రెండు పూటాల పొటాటో జ్యూస్ త్రాగడం వల్ల అల్సర్ నుండి ఉపశమనం పొందవచ్చు . మొదట ఉదయం నిద్రలేవగానే కాలీ పొట్టతో 50 ml జ్యూస్ ను త్రాగాలి . అంతే మోతాదులో రాత్రి డిన్నర్ కు ముందు తీసుకోవాలి.

10. తలనొప్పిని నివారించే పొటాటో జ్యూస్:

10. తలనొప్పిని నివారించే పొటాటో జ్యూస్:

అన్ని రకాల తలనొప్పులను నివారించే లక్షణాలు పొటాటో జ్యూస్ లో పుష్కలంగా ఉన్నాయి . పొటాటో జ్యూస్ ను త్రాగిన 15నిముషాల్లో తలనొప్పి నుండి ఉపశమనం పొందుతారు. అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవడం ద్వారా మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

English summary

TOP 10 Health Benefits Of Potato Juice

Potatoes are considered to be one of the healthiest vegetables to add to your daily diet. Potatoes are rich in vitamins, nutrients and good carbs which convert to energy provided to the body to function well.
Story first published:Tuesday, December 15, 2015, 16:51 [IST]
Desktop Bottom Promotion