Latest Updates
-
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
నీళ్లు ఏయే సందర్భాల్లో తాగాలి ? ఎంత పరిమాణంలో తాగాలి ?
ఉదయం లేచిన దగ్గర నుంచి నీళ్లు బాగా తాగాలి అని వింటుంటాం. రోజుకి ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలని చెబుతుంటారు. తక్కువగా నీళ్లు తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అజీర్ణం, మలబద్దకం, తలనొప్పి, కిడ్నీల్లో రాళ్లు వంటి రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నీళ్లు శరీరానికి కావాల్సిన స్థాయిలో అందించినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.
Read more:రెగ్యులర్ గా నీరు త్రాగడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్
నీళ్లు బాగా తాగాలని అందరికీ తెలిసిన విషయమే. కానీ.. ఏ సమయంలో ఎలా తాగాలి.. ఎంత పరిమాణంలో తాగాలి అనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగవచ్చా.. లేదా అన్నది అందరినీ వేధించే సమస్య. ఎనిమిది కంటే ఎక్కువ గ్లాసుల నీళ్లు తాగితే ఏమౌతుంది.. ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి కదూ. అలాంటి డ్రింకింగ్ వాటర్ డౌట్స్ క్లియర్ చేసుకోవాలంటే.. ఈ స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే..

నీటి అవసరం
ఎలాంటి అనారోగ్య సమస్యకైనా దివ్యౌషధం నీళ్లు. శరీరంలో జరిగే మెటబాలిక్ చర్యలకు నీళ్లు చాలా ముఖ్యం. నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉన్నడ్రింగ్స్ తాగటం వల్ల ఎన్నో వ్యాధులు దరి చేరకుండా కాపాడుతాయి. శరీరంలో బ్లడ్ కి ఎంత ప్రాధాన్యత ఉందో.. నీటికి అదే స్థాయిలో విలువ ఉంది. మనిషికి రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు అవసరమౌతాయి. మనిషి బరువుని బట్టి కూడా తాగే నీటి పరిమాణం పెంచాల్సి ఉంటుంది.

భోజనానికి మధ్యలో నీళ్లు తాగకూడదా ?
ఈ ప్రశ్న అందరినీ వేధిస్తోంది. భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు తాగాలా లేదా అన్న దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. కానీ.. భోజనం మధ్యలో నీళ్లు తాగాల్సిందే. ఎందుకంటే జీర్ణ సమస్యలు తొలగొపోయి, జీవక్రియ సాఫీగా జరుగడానికి సహకరిస్తాయి.

భోజనానికి ముందు
భోజనానికి ముదు నీళ్లు తాగకూడదు. భోజనానికి ముందు నీళ్లు తాగితే జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అలాగే భోజనం తర్వాత కూడా కడుపునిండా నీళ్లు తాగకూడదు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ఎనిమిది గ్లాసులు
రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం వల్ల.. ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు దూరమవుతాయి.

ఎక్కువ నీళ్లు తాగవచ్చా ?
ఎక్కువ మోతాదులో నీళ్లు తాగడం మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువగా నీళ్లు తాగితే మూత్రపిండాలపై భారం పడుతుంది. కాబట్టి రోజుకి పది గ్లాసుల కంటే ఎక్కువ నీళ్లు తాగరాదు. ఒక్కసారిగా ఎక్కువ పరిమాణంలో తాగడం కంటే.. అప్పుడప్పుడు కొన్ని కొన్ని తాగితే మంచిది.

డీహైడ్రేషన్
శరీరంలో నీటి శాతం తగ్గితే రకరకాల అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు అందకపోతే.. డీహైడ్రేషన్ కు గురవుతారు. నీళ్లకు జీర్ణశక్తి పెంచే గుణం ఉంది. కాబట్టి కావాల్సిన పరిమాణంలో నీళ్లు తాగాలి.

బరువు తగ్గడానికి
ఆకలిని చంపేయగల శక్తి నీటికి ఉంది. నీళ్లు బాగా తాగితే భోజనం తక్కువగా తింటారు. ఫలితంగా బరరువు పెరిగే అవకాశం లేదు. ప్రతిరోజూ ఉదయం రెండు గ్లాసులు, రాత్రి పడుకునే ముందు మూడు నాలుగు గ్లాసుల నీళ్లు తాగాలి.

ఉదర సమస్యలు
నీళ్లు బాగా తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల ఉదరం, మూత్రపిండాల సమస్యలు దరిచేరవు.

వ్యాయామం తర్వాత
నీళ్లు ఆరోగ్యానికే కాదు.. అందానికీ మంచిదే. వ్యాయామానికి ముందు తర్వాత తప్పనిసరిగా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

చర్మ ఆరోగ్యానికి
చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలంటే శరీరంలో నీటి శాతం సక్రమంగా ఉండాలి. చర్మంపై ముడతలు, చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే.. మంచినీళ్లు బాగా తాగాలి. శరీరంలో 75 నుంచి 80 శాతం నీళ్లు ఉండాలి.

గుండె ఆరోగ్యానికి
శరీరంలో తగిన మోతాదులో నీరు ఉంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. రక్త పోటును తగ్గించే శక్తి నీటికి ఉంది.

అలసట, తలనొప్పి
దాహం అనిపించే వరకు నీళ్లు తాగకుండా ఉండకూడదు. దాహంగా అనిపిస్తోంది అంటే.. శరీరంలో నీటిశాతం తగ్గిపోయిందని గుర్తించాలి. తలనొప్పి, అలసటగా అనిపిస్తే.. ఎక్కువ నీళ్లు తాగాలి.



Click it and Unblock the Notifications