For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల్లో సంతానోత్పత్తి ప్రక్రియను మెరుగుపరిచే ఆయుర్వేద చిట్కాలు

|

మానవ శరీర ప్రధాన లక్ష్యం పునరుత్పత్తే. కామం, సంతానప్రాప్తి జీవసహజమైన ధర్మాలు. సంతానప్రాప్తిని నియంత్రణ చేసేది హార్మోనులే. స్త్రీ, పురుష శరీరాలలోని పునరుత్పత్తి వ్యవస్థలు సంతానప్రాప్తికి తమ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తుంటాయి. స్త్రీ, పురుషులలోని పునరుత్పత్తి వ్యవస్థల నుండి సంయోగబీజాలు (గామెట్స్‌) లభ్యమవుతుంటాయి. వీటినే 'సెక్స్‌ కణాల'నీ వ్యవహరిస్తుంటారు. కణాల స్థాయిలో చూస్తే- స్త్రీ పురుష శరీరాలలోని కణాలు ఒకేరకమైన ధర్మాలను నిర్వర్తిస్తుంటాయి. ఆ కణాలే ధాతువులు, అవయవాలు, వ్యవస్థలు, వ్యక్తులుగా రూపొందినప్పుడు, అవి నిర్వహించే ధర్మాలలో భిన్నత్వం వ్యక్తమవుతుంటుంది.

గర్భధారణ, సంతానోత్పత్తికి సాయపడే అవయవ నిర్మాణం స్త్రీలు మాత్రమే కలిగి ఉంటారు. స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థలో- పిండదశలో శిశురక్షణకు తోడ్పడే ధాతువులు, అవయవాలన్నీ ఉంటాయి. శిశువును ప్రసవించే వరకూ పిండపోషణకు సహాయపడే ధాతువులన్నీ స్త్రీల శరీరంలో ఉంటాయి. సంతానోత్పత్తి కార్యక్రమంలో పునరుత్పత్తి ఆరోగ్యం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్త్రీలో సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా వైద్య కారణాలు, పర్యావరణ కారకాలు, జన్యు శాస్త్రం లేదా జవీనశైలి మొదలగునవి అనేకం ఉన్నాయి.

మహిళలు సంతానం పొందడానికి ఒక మంచి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. మొదట సంతానోత్పత్తిపై ప్రభావితం చేసే అంశాల గురించి బాగా అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఆ ప్రభావితం చేసే అంశాలను నివారించడానికి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. సంతానోత్పత్తిని మెరుగుపరుచుకోవడానికి ఎన్నో మెడికేషన్స్ ఉపయోగించి ఉంటారు. మెడికేషన్స్ కంటే, నేచురల్ గా మరియు ఆయుర్వేద మార్గాలను అనుసరించడం వల్ల సంతానోత్పత్తి ఆరోగ్యవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది.

కొందరి శరీరానికి అలోపతి మెడికేషన్స్ అంతగా పనిచేయవు, అలాంటి వారు నేచురల్ గా ఆయుర్వేద పద్దతులను అనుసరించడం మంచిది. మహిళల్లో రీప్రొడక్టివ్ (సంతానోత్పత్తి హెల్త్ ను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

 శతావరి:

శతావరి:

ఆయుర్వేదంలో శతావరి బాగా పాపులర్ అయిన హెర్బ్ ,. ఇది మహిళల రీప్రొడక్టివ్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . దీన్ని పౌడర్ రూపంలో లేదా లిక్విడ్ రూపంలో తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ శతావరి పౌడర్ ను గ్లాసు గోరువెచ్చని పాలలో వేసి, తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

అశ్వగంథ:

అశ్వగంథ:

అశ్వగంథ పూర్వ కాలం నుండి బాగా ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద హెర్బల్ రెమెడీ. ఇది మహిళల శరీరంలో హార్మోన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది . ఒక గ్లాసు నీటిలో అశ్వగంద పౌడర్ మిక్స్ చేసి బాగా మరిగించి తర్వాత వడగటి రోజూ పరగడపున తీసుకోవాలి.

విధారి కొండ :

విధారి కొండ :

ఇది ఒక నేచురల్ హెర్బ్ . ఇది మహిళ పునరుత్పత్తి వ్యవస్థ మెరుగుపరచడానికి సహాయపడుతుంది . ఇది పౌడర్ రూపంలో మనకు అందుబాటులో ఉంటుంది. ఒకటి రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవడం

సోంపు

సోంపు

సోంపు విత్తనాలు పొడి చేసి రోజుకు 5గ్రాములు తీసుకొని నీటిలో కలిపి తీసుకోవాలి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి మెరుగుపడుతుంది.

లికోరైస్

లికోరైస్

మహిళల్లో వంధ్యత్వాన్ని నివారించే గుణాలు లికోరైస్ లో ఎక్కువగా ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ లికోరైస్ నీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ తీసుకోవాలి. పునరుత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది.

జెరేనియం ఎసెన్షియల్ ఆయిల్

జెరేనియం ఎసెన్షియల్ ఆయిల్

జెరేనియం ఎసెన్షియల్ ఆయిల్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మహిళల్లో రీప్రొడక్టివ్ మెరుగ్గా ఉంటుంది. హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. లింఫాటిక్ సిస్టమ్ డిటాక్సిఫై చేస్తుంది. కొన్ని చుక్కల నూనె వేడి నీటిలో వేసి ఆవిరి పట్టాలి. స్నానం చేసే నీటిలో కూడా వేసుకోవచ్చు.

తులసి

తులసి

ఇది ఒక ట్రెడిషినల్ మెడిసినల్ హెర్బ్ . తులసి యూట్రస్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది.ప్రతి రోజూ ఒక టేబుల్ స్పూన్ తులసి రసం తీసుకోవడం మంచిది. మార్నింగ్ , ఈవెనింగ్ తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ ఫలితాలుంటాయి.

అశోక:

అశోక:

అశోక బెస్ట్ ఆయుర్వేదిక్ రెమెడీ . ఇది యూట్రస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆషోక ఆకులే లేదా వేర్లు, నీటిలోవేసి ఉడికించి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి.

ఆమ్లా:

ఆమ్లా:

ఆమ్లాను పౌడర్ గా లేదా ఫ్రెష్ జ్యూస్ గా తీసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

జీలకర్ర:

జీలకర్ర:

జీలకర్ర పొడిని గోరువెచ్చని పాలలో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మహిళ ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది . ఇది మహిళలో అన్ని రకాల రీప్రొడక్టివ్ హెల్త్ ను మెరుగు పరుస్తుంది.

English summary

10 Best Ayurvedic Remedies For Women's Reproductive Health

10 Best Ayurvedic Remedies For Women's Reproductive Health,There are several medications in the form of health drinks, tablets and capsules available over the counters to improve reproductive health and well-being of a woman.
Desktop Bottom Promotion