For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధమనులను శుభ్రం చేసి, గుండెజబ్బుల నుండి రక్షించే 10 సూపర్ ఫుడ్స్

By Lekhaka
|

గుండెపోటు వచ్చిన సమయం అనేది అత్యంత ప్రమాదకర పరిస్థితులో ఒకటి, దానినుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతిదీ చేస్తాం. గుండె పోటు నుండి రక్షించబడడానికి సహాయపడే కొన్ని మంచి ఆహారపదార్ధాల జాబితా మీకు ఈ ఆర్టికిల్ లో ఇవ్వబడ్డాయి.

గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి ధమనులు మూసుకుపోవడం. ధమనులు మూసుకు పోయినపుడు గుండెకు సాధారణంగా జరిగే రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్య ఆహారపు అలవాట్లు మరి కొన్ని ఇతర కారణాలు.

10 Foods That Will Clean your Arteries And Protect You From Heart Attack

గుండెపోటు నుండి రక్షించే కొన్ని ఆహారపదార్ధాల జాబితాని మీ ముందు ఉంచుతున్నాము. ఈ ఆహార పదార్ధాలు ధమనులను శుభ్రపరచడంపై శ్రద్ధ పెట్టి, రక్తప్రసరణకు ఆటంకం కలిగించే అన్నిరకాల అడ్డంకుల నుండి రక్షిస్తుంది.

గుండెపోటు నుండి రక్షించడానికి సహాయపడే ఆహార పదార్ధాల విషయానికి వస్తే, అనేకరకాల పళ్ళు, కూరగాయలు గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా, సహజ రూపంలో ఆహార పదార్ధాలను తీసుకోవడం కూడా మంచి మార్గాలలో ఒకటి.

ఈ ఆహారపదార్ధాలు గుండెపోటును నివారించడమే కాకుండా గుండె రక్తనాళాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని నిర్ధారించబడిన మంచి విషయం. నిజమేమిటంటే, మీరు ఏమి తాగుతున్నారు, ఏమి తింటున్నారు అనేవి మీ శరీరాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచడడానికి సహాయపడతాయి.

గుండెపోటు ను నివారించడానికి సహాయపడే అత్యంత ఆహార పదార్ధాలను గుర్తించడం ఎలాగో చదివి తెలుసుకోండి.

1.సాల్మన్:

1.సాల్మన్:

సాల్మన్ లో ఆరోగ్యకర ఫాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండి, రక్తంలోని కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, మంటను నిరోధించడానికి కూడా సహాయపడుతుంది. ఇవి కూడా గుండెపోటుకు కారణమయ్యే సాధారణ కారణాలలో కొన్ని.

2.ఆరంజ్ జ్యూస్:

2.ఆరంజ్ జ్యూస్:

ఆరంజ్ జ్యూస్ విటమిన్ , యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది దెబ్బతిన్న రక్తనాళాలను రక్షించడానికి సహాయపడడమే కాకుండా, రక్తపోటును సాధారణ స్థితిలో ఉంచుతుంది. అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ రెండు గ్లాసుల ఆరంజ్ జ్యూస్ తీసుకున్నట్లయితే, శరీరానికి అవసరమైన పోషకాలు అంది, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

3.నట్స్:

3.నట్స్:

నట్స్ కూడా ప్రధానంగా గుండెకు కావాల్సిన ఆరోగ్యకర ఆహారపదార్ధాలలో ఒకటి. ఇందులో ఫాటీ యాసిడ్స్, అన్-సాచురేటేడ్ ఫాట్స్, ఆరోగ్యకర ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి, కీళ్ళు, గుండె ఆరోగ్యం గణనీయంగా పెరగడానికి సహాయపడతాయి.

4.పసుపు:

4.పసుపు:

పసుపు సర్క్యుమిన్ ని కలిగి ఉండడం వల్ల ఎంతో శక్తివంతమైన యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది మంటను తగ్గించడమే కాకుండా అదనంగా ఉన్న కొవ్వు నిల్వలను కూడా తగ్గిస్తుంది. ఈ రెండిటినీ మీ మీల్ లో చేరిస్తే గుండెజబ్బుల నుండి ఉపశమనం పొందవచ్చు.

5.గ్రీన్ టీ:

5.గ్రీన్ టీ:

గుండెపోటు నుండి రక్షించే మరో ప్రధాన ఆహారపదార్ధాలలో ఒకటి గ్రీన్ టీ. గ్రీన్ టీ లో మీ గుండెను రక్షించే శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు కలిగిన కటేచిన్స్ ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయి ని తగ్గించడమే కాకుండా మెటబాలిజం ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే మంచి ఫలితాలు కలుగుతాయి.

6.పుచ్చకాయ:

6.పుచ్చకాయ:

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పుచ్చకాయ మంచి ఆహారపదార్ధాలలో ఒకటిగా గుర్తించబడింది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే నైట్రిక్ యాసిడ్ ని ఉత్తేజ పరిచి, రక్త నాళాలను శుభ్రపరుస్తుంది.

7.తృణధాన్యాలు:

7.తృణధాన్యాలు:

గుండెపోటును నివారించడానికి సహాయపడే అత్యంత ఆహారపదార్ధాలలో ఓట్స్, హోల్ గ్రైన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ కొన్ని. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల రక్తనాళాలు శుభ్రపడి, గుండెను సురక్షితంగా ఉంచుతుంది. ఇది ఫైబర్ ఎక్కువగా కలిగి ఉండడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది.

8.క్రాన్ బెర్రీస్:

8.క్రాన్ బెర్రీస్:

వీటిలో పొటాషియం, ఎక్కువగా ఉండడం వల్ల ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ప్రతిరోజూ కాన్ బెర్రీ జ్యూస్ రెండు గ్లాసులు తీసుకుంటే, 40% వరకు గుండె జబ్బులను నివారించవచ్చు.

9.దానిమ్మ:

9.దానిమ్మ:

గుండెపోటును నివారించడానికి సహాయపడే ఆహారపదార్ధాలలో దానిమ్మ కూడా ఒకటి. ఇందులో ఫైటో-న్యూట్రిఎంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే నైట్రిక్ ఆక్సైడ్ లను ఉత్తేజపరచడానికి సహాయపడతాయి.

10.అవొకాడో:

10.అవొకాడో:

అవోకాడోలో ఆరోగ్యకర కొవ్వు ఉండడం వల్ల ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయని నిర్ధారించబడింది.

English summary

10 Foods That Will Clean your Arteries And Protect You From Heart Attack

The good news is that these foods that help prevent heart attacks will also ensure our cardiovascular health. The fact is that what you drink and what you eat, will help in keeping your body nourished and healthy.
Story first published: Saturday, December 17, 2016, 20:02 [IST]
Desktop Bottom Promotion