ముల్లంగి కంటే ముల్లంగి ఆకుల్లో అద్భుతమైన ప్రయోజనాలు..!

ముల్లంగి అనగానే ముక్కు మూసుకునే వాళ్లు ఎందరో. దీని వాసన అభ్యంతరకరంగా ఉన్నా కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందివ్వగలదు. ముల్లంగిని చాలామంది ఆహారానికి దూరంగా పెట్టేస్తారు. దాని గురించి సరైన అవగాహన ల

ముల్లంగి అనగానే ముక్కు మూసుకునే వాళ్లు ఎందరో. దీని వాసన అభ్యంతరకరంగా ఉన్నా కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందివ్వగలదు. ముల్లంగిని చాలామంది ఆహారానికి దూరంగా పెట్టేస్తారు. దాని గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు కారణం. కానీ వాస్తవానికి ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచగలదు ఈ ముల్లంగి.

ముఖ్యంగా జాండీస్‌ లేదా కామెర్ల వ్యాధి బారిన పడినవారు తరచూ ముల్లంగి తింటే లేదా రసాన్ని తాగితే శరీరంలోని విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. జీర్ణశక్తిని వృద్ధిచేస్తూ శరీరంలో నీరు నిలిచేలా చేస్తుంది. పైల్‌‌స వ్యాధిగ్రస్తులకు ముల్లంగి చక్కని ఔషధమే. మూ్తప్రిండాలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు శరీర బరువును తగ్గించేందుకు ముల్లంగి ఎంతగానో ఉపయోగపడుతుంది.

15 Amazing Health Benefits Of Radish Leaves..!

ఈ ప్రయోజనాలన్నింటిని చూస్తుంటే ముల్లంగిలోకంటే ముల్లంగా ఆకుల్లో ఎక్కువ ప్రయోజనాలున్నట్లు తెలుస్తుంది. ముల్లంగిలో ఉండే అనేక ఔషధ గుణాలు అనేక జబ్బులను దూరం చేస్తుంది. ముల్లంగి ఉత్తమమైన కురగాయాలలో ఒకటిగా ఉంది.

ముల్లంగి విత్తనాలు, వేరు,ఆకులు అన్నింటిని కూరల్లో ఉపయోగించవచ్చు. ముల్లంగిని ఆహారంలో పచ్చి సలాడ్ లేదా కూరగాయల రూపంలో చేర్చవచ్చు. అయితే ముల్లంగిలో కంటే ముల్లంగి ఆకులో ఎక్కువ పోషకాలు ఉన్నాయి. ముల్లంగి ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...!

విటమిన్స్ మరియు మినిరిల్ అధికంగా ఉన్నాయి :

విటమిన్స్ మరియు మినిరిల్ అధికంగా ఉన్నాయి :

ముల్లంగి ఆకులో శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు మరియు మినిరల్స్ సమృద్దిగా ఉన్నాయి. అందువల్ల దీన్ని న్యూట్రీసియన్ రిచ్ డైట్ గా తీసుకుంటారు. ఇవి శరీరం యొక్క పనితీరును మేరుగుపరచటంలో సహాయపడతాయి. ముల్లంగి ఆకులో కాల్షియం, ఐరన్ , ఫోలిక్ యాసిడ్ మరియు ఫాస్పరస్ వంటి ముఖ్యమైన మినిరల్స్ ఉండటం వల్ల ఇవి శరీరంలో అనేక విధులను నిర్వర్తించటానికి సహాయపడతాయి.

డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది:

డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది:

ముల్లంగి ఆకులు జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతముగా పనిచేస్తాయి. జీవక్రియకు అవసరమైన పైబర్ ముల్లంగి ఆకులో సమృద్దిగా ఉంటుంది. అంతేకాక కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యల చికిత్సలో సహాయపడుతుంది. ముల్లంగితో పోలిస్తే ముల్లంగి అకులోనే ఎక్కువ డైటరీ పైబర్ ఉంటుంది.

అలసటను, నీరసంను తగ్గిస్తుంది:

అలసటను, నీరసంను తగ్గిస్తుంది:

ముల్లంగి ఆకుల్లో ఉండే డైటరీ కంటెంట్ డైటేరియన్ అలసటను నివారిస్తుంది. ముల్లంగి ఆకుల్లో ఉండే ఫాస్పరస్, ఐరన్ వంటివి శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా విటమిన్ సి, విటిమన్ ఎ, థైమిన్ వంటి అలసటను , నీరసంను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎవరైతే అనీమీయాతో బాధపడుతుంటారో వారు మరియు హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నావారు రెగ్యులర్ డైట్ లో ముల్లంగి ఆకులను చేర్చుకోవడం వల్ల కొన్ని మెడికల్ కండీషన్స్ ను నివారిస్తుంది.

డ్యూరియాటిక్

డ్యూరియాటిక్

ముల్లంగి ఆకులు నేచురల్ డ్యూరియాటిక్ లక్షణాలు కలది. ఇది యూరినరీ బ్లాడర్ లోని రాళ్ళను కరిగించడానికి సహాయపడుతుంది. ఇంకా ఇది డ్యూరియాటిక్ లక్షణాలను కూడా నివారిస్తుంది. ముల్లంగి ఆకులలలో ఉండే ల్యాక్సేటివ్ లక్షణాలు మలబద్దంక, కడుపుబ్బరాన్ని తగ్గించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

యాంటీ బయోటిక్ వంటిది:

యాంటీ బయోటిక్ వంటిది:

ముల్లంగి ఆకులు యాంటీస్కార్బిటక్ లక్షణలను కలిగినది. ముల్లంగి ఆకుల్లో ఉండే విటమిన్ సి మరియు ఆర్బాటిక్, ల్యాక్సేటివ్ లక్షణాలు ముల్లంగిలో కంటే ఆకుల్లో అధికంగా ఉండటం వల్ల యాంటీ బయోటిక్ గా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి .

పైల్స్ నివారిస్తుంది: :

పైల్స్ నివారిస్తుంది: :

ముల్లంగి ఆకులు పైల్స్ చికిత్సలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పైల్స్ ఉన్న వారిలో పెయిన్ ఫుల్ కండీషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముల్లంగి ఆకులలో ప్రత్యేకమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి పైల్ లక్షణాలను వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఎండిన ముల్లంగి ఆకులను పొడి చేయాలి. ముల్లంగి ఆకుల పొడి, పంచదారను సమాన పరిమాణంలో తీసుకోని నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని తినవచ్చు. లేదా పైల్స్ ప్రభావిత ప్రాంతంలో రాయవచ్చు.

జాండీస్ ను నివారిస్తుంది:

జాండీస్ ను నివారిస్తుంది:

ముల్లంగి ఆకులు జాండిస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముల్లంగి ఆకుల్లో హైపర్ బిలిరుబియాల (చర్మంలో ఎల్లో రంగులో మార్చడం) వంటి లక్షనాలను నివారిస్తుంది. కామెర్లను నివారించడంలో ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, నీళ్ళు సరిపడా నీళ్ళు కలిపి, వడగట్టి తాగడం వల్ల జాండిస్ నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. 10 రోజుల్లోనే కామెర్లు తగ్గుతాయి .

 కీళ్ళవాపు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది:

కీళ్ళవాపు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది:

రుమాటిజం అత్యంత బాధకరమైన డిసీజ్ . ఎందుకంటే జాయింట్ పెయిన్స్, జాయింట్స్ వాపులు వల్ల అసౌకర్యం నొప్పులు, చాలా బాధిస్తాయి . ముల్లంగి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పంచదార మిక్స్ చేసి, నొప్పులు, వాపులున్న జాయింట్స్ లో అప్లై చేయాలి. ఈ పేస్ట్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే, నొప్పులు , వాపులు తగ్గుతాయి.

డయాబెటిస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది:

డయాబెటిస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే సత్తా ముల్లంగి ఆకుల్లో ఎక్కువగా ఉంది, ముల్లంగి ఆకులు డయాబెటిక్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ముల్లంగి ఆకలు డయాబెటిస్ ను తగ్గించడంతో పాటు, హై బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది

డిటాక్సిఫైంగ్ ఏజెంట్

డిటాక్సిఫైంగ్ ఏజెంట్

ముల్లంగి ఆకుల్లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఈ న్యూట్రీషియన్స్ తో పాటు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. టాక్సిన్ ను బయటకు నెట్టేస్తుంది.

శ్వాస వ్యాధులకు చికిత్స

శ్వాస వ్యాధులకు చికిత్స

ముల్లంగి ఆకు శ్వాస వ్యవస్థలో అడ్డంకులను నిరోధిస్తుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థకు ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది. అలెర్జీలు, జలుబు, అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా నిరోధిస్తుంది. ముల్లంగి ఆకులో ఉండే విటమిన్లు శ్వాస వ్యవస్థను రక్షించడానికి సహాయపడతాయి.

కార్డియోవాస్క్యులర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది

కార్డియోవాస్క్యులర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ముల్లంగి ఆకులలో యాంతోసైనిన్ అనే ఫ్లవనయిడ్ సమృద్దిగా ఉంది. ఇది హృదయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. యాంతోసైనిన్లలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉండుట వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

హైడ్రేడ్ గా ఉంచుతుంది

హైడ్రేడ్ గా ఉంచుతుంది

ముల్లంగి ఆకులలో నీరు సమృద్దిగా ఉంటుంది. అందువల్ల ముల్లంగి రసాన్ని త్రాగితే శరీరం హైడ్రేడ్ గా ఉంటుంది. ఇది హైడ్రేడ్ గా ఉంచటమే కాక మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది. ముల్లంగి ఆకుల రసం జీర్ణక్రియను మేరుగుపరచటంలో సహాయపడుతుంది.

చర్మ లోపాలకు

చర్మ లోపాలకు

చికిత్స ముల్లంగి ఆకులు చర్మ లోపాలను నయం చేయటంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముల్లంగి ఆకులలో ఉండే ఖనిజాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ముల్లంగి ఆకులో ఉండే క్రిమినాశక లక్షణాలు అన్ని రకాల చర్మ లోపాలను నయం చేయటంలో సహాయపడతాయి. అలాగే పగుళ్లు, దద్దుర్లు మరియు పొడి చర్మం వంటి సమస్యలు నయం అవుతాయి.

కిడ్నీ హెల్త్ కు : మూత్రపిండాలను రక్షిస్తుంది

కిడ్నీ హెల్త్ కు : మూత్రపిండాలను రక్షిస్తుంది

ముల్లంగి ఆకులు వివిధ రకాల రుగ్మతల నుండి మూత్రపిండాలను రక్షిస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళను తొలగించటానికి ముల్లంగి ఆకులు మంచి ప్రభావవంతమైన ఇంటి నివారిణిగా ఉంది. ముల్లంగి ఆకులో విటమిన్ B6 సమృద్దిగా ఉండుట వలన ఈ రసాన్ని త్రాగితే సహజంగా మూత్రపిండాల్లో రాళ్లను తొలగించటానికి సహాయపడుతుంది. అలాగే రాత్రంతా నీటిలో ముల్లంగి ఆకులను నానబెట్టి, మరుసటి ఉదయం ఈ ఆకులను పేస్ట్ గా చేసి కూడా తినవచ్చు. కాబట్టి, ముల్లంగి ఆకులను నిర్లక్ష్యం చేస్తే అనేక ప్రయోజనాలను కోల్పోతారు? ముల్లంగి ఆకులను మీ రెగ్యులర్ వంటలో ఒక బాగం చేసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Story first published: Wednesday, October 19, 2016, 11:39 [IST]
Desktop Bottom Promotion