For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్కహాల్ తీసుకునే వాళ్ల లివర్ ని క్లెన్స్ చేసే అమేజింగ్ డ్రింక్..!!

ఎక్కువ మొత్తంలో మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నట్టు అయితే.. ముఖ్యంగా.. రాత్రిపూట ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే.. ఇక్కడ వివరిస్తున్న న్యాచురల్ రెమిడీని ఖచ్చితంగా తీసుకోవాలి.

By Swathi
|

రెగ్యులర్ గా మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారా ? ఒకవేళ అవును అయితే.. మీ లివర్ టాక్సిన్స్ తో నిండిపోయి ఉంటుంది. న్యాచురల్ రెమిడీ ద్వారా మీ లివర్ ని ఖచ్చితంగా క్లెన్స్ చేసుకోవాలి.

ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం, ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల.. వాళ్ల లివర్ లో మలినాలు పేరుకుపోతాయి. వీటివల్ల భవిష్యత్ లో చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

liver cleanse

ఒకవేళ మీరు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు రాకూడదు అనుకుంటే, ముఖ్యమైన అవయవాలపై ఎఫెక్ట్ పడకూడదు అంటే.. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. బ్యాడ్ హ్యాబిట్స్ అయిన స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

కాలేయం ఎంత ముఖ్యమైన అవయవమో మనందరికీ తెలుసు. మెటబాలిక్ ఫంక్షన్స్ ని నిర్వహిస్తుంది. అలాగే.. జీర్ణవ్యవస్థలోకి వెళ్లడానికి ముందు.. బ్లడ్ ని ఫిల్టర్ చేయడం కూడా.. కాలేయం బాధ్యత.

లివర్ డ్యామేజ్ అవడానికి అందులో పేరుకున్న టాక్సిన్స్ కారణమవుతాయి. అది కూడా ఆల్కహాల్ తీసుకోవడం, ఒబేసిటి, గాయాలు, వైరల్ ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు.. వంటివన్నీ.. లివర్ డ్యామేజ్ కి కారణాలు.

raisins to cleanse liver

కాబట్టి.. ఎక్కువ మొత్తంలో మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నట్టు అయితే.. ముఖ్యంగా.. రాత్రిపూట ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే.. ఇక్కడ వివరిస్తున్న న్యాచురల్ రెమిడీని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మీ కాలేయంలో చేరుకున్న హానికారక మలినాలను బయటకు పంపుతుంది.

కావాల్సిన పదార్థాలు
ఎండుద్రాక్ష 3 టేబుల్ స్పూన్లు
నీళ్లు 2 కప్పులు

ఎండు ద్రాక్షలో విటమిన్స్, మినరల్స్, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. లివర్ ని క్లెన్స్ చేయడంలో, డ్యామేజ్ అయిన లివర్ ని రిపేర్ చేయడంలో సహాయపడతాయి. ఆల్కహాల్ వల్ల హాని జరిగిన లివర్ కి ఎండుద్రాక్ష చక్కటి రెమెడి.

ఈ హెర్బల్ రెమిడీ.. కాలేయం నుంచి టాక్సిన్స్ బయటకు పంపి.. హెల్తీగా ఉంచుతుంది.

water

తయారు చేసే విధానం
2 కప్పుల నీటిలో 3 స్పూన్ల ఎండు ద్రాక్ష మిక్స్ చేసి.. ఒక గిన్నెలో పోసి.. బాగా మరిగించాలి. రాత్రంతా ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఉదయాన్నే ఆ నీటి నుంచి ఎండుద్రాక్షను సపరేట్ చేసి.. ఆ నీటిని మళ్లీ వేడి చేసి.. ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అంతే. సింపుల్ గా ఉన్న ఈ రెమిడీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి.

English summary

2 Natural Ingredients Can Cleanse Your Liver, After Drinking Alcohol!

2 Natural Ingredients Can Cleanse Your Liver, After Drinking Alcohol! When a person consumes a lot of alcohol and fatty foods, chances are that his/her liver may be accumulated with toxic substances
Story first published: Friday, October 14, 2016, 16:54 [IST]
Desktop Bottom Promotion