Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
గ్రేప్ జ్యూస్ లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు
ఆరోగ్యానికి తాజా పండ్లు ఎంతో అవసరం అన్న విషయం అందరికీ తెలుసు. అలాగే.. ద్రాక్షలోని ఆరోగ్య ప్రయోజనాలు కూడా.. ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అయితే.. గ్రేప్స్ లో అత్యంత ముఖ్యమైన పోషకాలు.. శరీరానికి చాలా అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ద్రాక్ష తినడానికి ఇష్టపడని వాళ్లు జ్యూస్ రూపంలో తీసుకుంటే.. మంచిదని సూచిస్తున్నారు.
ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ లోని అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే.. ఇకపై గ్రేప్ జ్యూస్ తాగడానికే.. ఆసక్తి చూపుతారు. ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ ద్వారా ఫైబర్ పొందవచ్చు. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పొందవచ్చు. మరి.. ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తాగడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటో చూద్దామా..

గుండె ఆరోగ్యానికి
పర్పల్ గ్రేప్స్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ ని తగ్గిస్తాయి. అలాగే.. కరోనరీ హార్ట్ డిసీజ్ తో బాధపడేవాళ్లకు సమస్యను తగ్గిస్తాయి. ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తాగడం వల్ల.. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి.. గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఇమ్యునిటీ పెరగడానికి
ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్.. ఇమ్యునిటీని మెరుగుపరుస్తుందని.. అధ్యయనాలు నిరూపించాయి. అలాగే.. విటమిన్ సి లెవెల్స్ ని కూడా పెంచుతుంది.

గుండెలో బ్లాకేజ్ ని నివారిస్తుంది
ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తీసుకోవడం వల్ల.. గుండెలో ప్లేట్ లెట్ యాక్టివిటీ తగ్గి.. బ్లాకేజ్ కి కారణమయ్యే పరిస్థితులను అడ్డుకుంటాయి. ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తీసుకోవడం వల్ల.. బ్లాకేజ్ సమస్యలు దరిచేరవు.

మెటబాలిజం
ఒకే ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల.. మెటబాలిజం చాలా మెరుగవుతుందని.. తాజా అధ్యయనాలు తేల్చాయి. ఇందులో తక్కువ ఎసిడిక్ ఉంటుంది.

బ్లడ్ ప్రెజర్
గ్రేప్స్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. గుండె కండరాలను రిలాక్స్ చేసి.. బ్లడ్ ఫ్లోను మెరుగుపరుస్తాయి. దీనివల్ల.. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది.

బరువు తగ్గడానికి
బరువు తగ్గడానికి గ్రేప్ జ్యూస్ డైరెక్ట్ గా సహాయపడకపోయినా.. చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతిరోజూ క్రమంతప్పకుండా.. 12 వారాలు గ్రేప్ జ్యూస్ తీసుకోవడం వల్ల.. బరువు తగ్గడానికి.. సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
