For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ స్పైసెస్ కంపల్సరీ..

By Swathi
|

ఆహారంలో స్పైసెస్ చేర్చుకోవడం వల్ల.. అవి టేస్ట్ ని పెంచడంతో పాటు, పోషకాలను అందిస్తాయి. అయితే ఈ న్యూట్రీషియస్, టేస్టియస్ట్ ఫుడ్ గుండె ఆరోగ్యానికి చాలామంచిదని నిపుణులు సూచిస్తున్నారు. టేస్ట్ కోసం ఉపయోగించే దినుసులు.. మీకు తెలియకుండానే గుండెకు మేలుచేస్తాయట.

డైలీ డైట్లో కొన్ని రకాల దినుసులు చేర్చుకుంటే.. గుండె సంబంధిత అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. వీటన్నింటిలో హార్ట్ హెల్త్ ని కాపాడే పోషకాలు ఎక్కువగా ఉంటాయట. మరి.. ఆ దినుసులేంటో మీరే చూడండి..

 వెల్లుల్లి

వెల్లుల్లి

హైకొలెస్ట్రాల్ వల్ల కార్డియోవాస్క్యులర్ డిసీజ్ లు వస్తాయి. దీన్ని డైట్ లో వెల్లుల్లి చేర్చుకోవడం వల్ల నివారించవచ్చు. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు, బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా వెల్లుల్లి తీసుకుంటే.. గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి.

పసుపు

పసుపు

యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు మెండుగా ఉండే పసుపు బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే హార్ట్ ఎటాక్ రిస్క్ కి కారణమయ్యే డయాబెటిస్ రిస్క్ ని తగ్గిస్తుంది.

అల్లం

అల్లం

యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా కలిగి ఉన్న అల్లం హార్ట్ హెల్త్ కి గ్రేట్ గా సహాయపడుతుంది. డైట్ లో అల్లం చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గించడమే కాదు.. కార్డియోవాస్క్యులర్ డిసీజ్ లకు దూరంగా ఉంచుతుంది.

మిరియాలు

మిరియాలు

నల్ల మిరియాలలో ఉండే పైపరైన్ కార్డియోప్రొటెక్టివ్ కి సహాయపడుతుంది. యాక్సిడేటివ్ డ్యామేజ్ ని రక్షించడమే కాకుండా.. హైపోలిపెడిమిక్ ఎఫెక్ట్ ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే వానేడియం అనే పదార్థం.. గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క కొరోనరీ బ్లడ్ ఫ్లో ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల గుండె పనితీరు చురుగ్గా ఉంటుంది. కాబట్టి.. ఆహారాలు, సూప్, సలాడ్స్ పై.. దాల్చిన చెక్క పొడి చల్లుకుని తినడం వల్ల అందులోని పోషకాలు గ్రహించవచ్చు.

ధనియాలు

ధనియాలు

ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, హైపోలిపిడెమిక్ యాక్షన్ ఉంటుంది. ఇవి గుండెకు హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి. అలాగే బ్లడ్ ఫ్లో ని మెరుగుపరుస్తాయి.

English summary

6 Indian spices you must add to your food for a healthy heart

6 Indian spices you must add to your food for a healthy heart. Some spices are loaded with heart health benefits and if you care for your heart. Heart healthy spices you should include in your diet.
Story first published: Thursday, July 7, 2016, 15:56 [IST]
Desktop Bottom Promotion