For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ అలర్జీ నివారించే 7 నేచురల్ హోం రెమెడీస్..!

|

ఫుడ్ అలర్జీ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టం. ఫుడ్ అలర్జీకి ఒకటి రెండు ఆహారాలు కాదు, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు చాలానే ఉన్నాయి . వ్యాధినిరోధక వ్యవస్థ కణాలు ప్రతి రక్షకాలను తిరగబెట్టడానికి అనుమతిస్తాయి. ఈ యాంటీబాడీలు అలెర్జీ తటస్థం చేయడానికి సహాయపడుతాయి.

కాబట్టి మీరు అలర్జీకి కారణమయ్యే ఆహారాలను మీరు తీసుకొన్నప్పుడు, వ్యాధినిరోథక శక్తి విడుదల చేసే కెమికల్స్ రక్త కణాల్లోకి చేరుతుంది. ఈ కెమికల్స్ ఫుడ్ అలర్జీకి మరియు ఫుడ్ అలర్జీ లక్షణాలకు కారణం అవుతాయి. అలర్జీ లక్షణాలు వ్యక్తి నుండి మరో వ్యక్తికి మారుతాయి. ఈ లక్షణాలు సాధారణంగా, వాంతులు అవ్వడం, బ్రీతింగ్ ప్రాబ్లెమ్, దగ్గు, పెదాలవాపు, కళ్లుతిరగడం, ముక్కుకారడం, కళ్ళ దురద, డ్రై త్రోట్, రాషెస్, భారీగా అనిపించడం, వికారం, డయోరియా మరియు ఇతర కొన్ని కారణాలకు దారితీస్తుంది.

ఈ లక్షణాలన్నీ ఆహారం తిన్న ఒక గంట తర్వాత బయటపడుతాయి . ముఖ్యంగా ఈ లక్షణాలన్నీ, మొదట చర్మం తర్వాత జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, కార్డియో వ్యాస్కులర్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతాయి. కొంత మందిలో గుడ్లు, పీనట్స్, షెల్ ఫిష్, గోధుమలు, కార్న్, సోయా, మరియు స్ట్రాబెర్రీస్ అలర్జీకి కారణమయ్యే ఆహారాలు.

ఫుడ్ అలర్జీలు వంశపార్యంపరంగాను మరియు వాతావరణ పరిస్థితుల కారణంగాను జరుగుతుంది. ఈ ఫుడ్ అలర్జీకి ఇంట్లోనే చికిత్స అందివ్వొచ్చు . అప్పటికి తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించాలి. మరి ఆ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

అల్లం:

అల్లం:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫుడ్ అలర్జీకి కారణమయ్యే లక్షణాలతో పోరాడుతుంది. ఫుడ్ అలర్జీ అనిపించినప్పుడు ఆరోజంతా జింజర్ టీని కొద్దిగా తీసుకోవడం మంచిది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో వ్యాధినిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది ఫుడ్ అలర్జీని నివారిస్తుంది . శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది మరియు బాడీని క్లీన్ గా ఉంచుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

ఫుడ్ అలర్జీ నివారించే ఉత్తమ హోం రెమెడీ గ్రీన్ టీ. గ్రీన్ టీకి ఫుడ్ అలర్జీ లక్షణాలకు దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్స్ సరిగా జరిగేలా చేస్తుంది. అంతే కాదు, దాంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

క్యారెట్ కీరకాయ జ్యూస్:

క్యారెట్ కీరకాయ జ్యూస్:

విటమిన్ ఇ ఫుడ్స్ కూడా యాంటీ అలర్జినిక్ గా పనిచేస్తాయి . ఇవి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుతాయి . కాబట్టి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే టోఫు, ఆకుకూరలు, బాదం, సన్ ఫ్లవర్ సీడ్స్, అవొకాడో, ష్రింప్ , ఆలివ్ ఆయిల్, బ్రొకోలి వంటివి వాటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఫుడ్ అలర్జీని నివారించడంలో క్యారెట్ అండ్ కీరదోసకాయ గ్రేట్ నేచురల్ రెమెడీ. ఇది అసౌకర్యంను నివారిస్తుంది. ఇది స్టొమక్ రెసిస్టెన్స్ ను మెరుగుపరుస్తుంది.

ఆముదం నూనె:

ఆముదం నూనె:

ఆముదంలో ఉండే మెడిసినల్ గుణాలు, ఫుడ్ అలర్జీతో పోరాడటినిక గ్రేట్ గా సహాయపడుతుంది. మార్నింగ్ జ్యూస్ లో కొన్ని చుక్కల ఆముదం మిక్స్ చేసి తీసుకుంటే అసౌకర్యం తొలగిపోతుంది.

. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ :

. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ :

శరీరంలో విటమిన్ సి లోపం వల్ల వివిధ రకాల అలర్జీలకు కారణం అవుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో తగినన్ని విటమిన్ సి ఫుడ్స్ ను చేర్చుకోవాలి . ఇవి శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడంతో పాటు, అలర్జీలను నుండి ఉపశమనం కలిగిస్తాయి . కాబట్టి విటమిన్ సి అధికంగా ఉండే వెజిటేబుల్ మరియు ఫ్రూట్స్ ను తీసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

వెనిగర్ లోని మెడిసినల్ లక్షణాలు మరియు అసిడిక్ గుణం వల్ల ఫుడ్ అలర్జీకి సంబంధించిన అనేక లక్షణాలను నివారిస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని క్రమబద్దం చేస్తుంది. శరీరంలో పిహెచ్ లెవల్స్ ను పునరిద్దరింప చేస్తుంది.

English summary

7 Home Remedies For Food Allergies

Food allergies are exceedingly common among people all over the world. Most commonly known food allergens are sea food, peanuts, milk, etc. The severity of symptoms in this kind of allergy may range from insignificant to serious. In severe cases, it is critical to consult a specialist to get an in-depth understanding of the allergy.
Story first published: Tuesday, August 30, 2016, 10:59 [IST]