For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిగుళ్ళ వాపు మరియు నొప్పిని నివారించే సింపుల్ హోం రెమెడీస్

By Super
|

చిగుళ్ళు వాపునకు గురి కావడాన్ని వైద్య పరిభాషలో జింజివైటిస్ అంటారు . బాక్టీరియా కారణం గా చిగుళ్ళు దెబ్బ తనడం ద్వారా ఈ వ్యాధి ఏర్పడుతుంది . చిగుళ్ళకు దంతాలకు మధ్య ఉండే సన్నని ఖాళీ స్థలాల్లో ఆహారపు తునకలు పేరుకు పోవడం , దంతాలపై పాచి ఏర్పడటం ద్వార అక్కడ బాక్టీరియా చేరుతుంది . దంతాలపైన సందుల్లో నిలువ ఉండే పదార్దాలు అతి సుక్ష్మమైన పరిమాణంలో ఉన్నప్పటి కీ వాటిలోకి బాక్టీరియా చేరి రసాయనాలను , విషపదర్దాలను ఉత్పత్తి చేస్తాయి ... ఫలితం గా అ దంతాల చుట్టూ ఉన చిగురుభాగం ఎర్రగా కండి , వాపు ఏర్పడుతుంది . ఈ స్థితిని 'ఇన్ఫ్లమేషన్ 'అని వ్యవహరిస్తారు .

ఈ ఇంఫమేషన్ దీర్ఘకాలం పటు కొనసాగితే దవడ ఎముక దెబ్బతిని దంతాలు వదులు గా తయారై వుడిపోయే ప్రమాదం ఉంది. తరువాత " నేక్రోతిజిన్ అల్సిరేటివ్ జింజివైటిస్ "మారే ప్రమాదం ఉంది . కొంతకాలనికి " Peridontitis " (దంతాల చుట్టూ దంతాలకు ఆధారం గా ఉండే కణజాలం - వ్యాధిగ్రస్తం అయి పళ్ళు వుడిపోతాయి.

చిగుళ్ళలో రక్తస్రవానికి గృహ వైద్యం

చిగుళ్ళ వ్యాధి లక్షణాలు : నోటినుండి దుర్వాసన , చిగుళ్ళ నొప్పి, చిగుళ్ళ నుండి రక్తం కారడం, పళ్ళు వుడిపోవడం. చిగుళ్ళ వాపును దంత సమస్యను నేచురల్ గా నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఉప్పు నీరు:

ఉప్పు నీరు:

కొద్దిగా ఉప్పును ఒక గ్లాసు నీళ్ళలో వేసి నోట్లో పోసుకొని పుక్కలిస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఓరల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. ఉప్పులుో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చిగుళ్ళను స్ట్రాంగ్ గా మార్చుతుంది మరియు దంతాలు వదలవ్వకుండా నివారిస్తుంది. వదులైన దంతాలకు ఇది ఒక బెస్ట్ నేచురల్ క్యూర్.

.లవంగాలు లేదా నూనె:

.లవంగాలు లేదా నూనె:

లవంగాలను నోట్లో పెట్టుకోండి లేదా నిదానంగా చప్పరించండి లేదా చిగుళ్ళపై లవంగాల నూనెను రాయండి. ఇది అన్ని రకాల పళ్ళ సమస్యలకు పురాతన కాలంనాటి తేలికైన గృహ వైద్యం. చిగుళ్ళ వాపుకు లవంగం నూనె కూడా అద్భుతంగా సహాయపడుతుంది . నూనెను వాపున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గించుకోవచ్చు.

అల్లం:

అల్లం:

అల్లం పేస్ట్ చేసి కొద్దిగా ఉప్పు చేర్చి ఈ పేస్ట్ ను చిగుళ్ళ వాపు మీద అప్లై చేయాలి . ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది . వాపును కూడా తగ్గిస్తుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా నోటి ఆమ్లాలలో ఇరుకైన ప్రదేశంలో ఏర్పడిన బాక్టీరియాని చంపుతుంది, వేళ్ళ సహాయంతో దీనిని చిగుళ్ళపై పూయవచ్చు.బేకింగ్ సోడాను పసుపు నీటిలో మిక్స్ చేసి చిగుళ్ళ మీద మసాజ్ చేస్తే తక్షణ ఉపశమనం పొందవచ్చు.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంతో దంతాల వాపు తగ్గించుకోవచ్చు. నిమ్మరసాన్ని బాయిల్ చేసి నీటిలో వేసి ఆ నీటితో నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయాలి. ఈనీటితో ప్రతి రోజూ చేయడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు.

సేజ్, పిప్పరమెంట్ ఆయిల్:

సేజ్, పిప్పరమెంట్ ఆయిల్:

సేజ్, పెప్పర్మేంట్ ఆయిల్ ని ఉపయోగించి బ్రష్ చేసినట్లైతే ఇవి నోటిని తాజాగా, శుభ్రంగా ఉంచుతాయి. వాపును తగ్గిస్తాయి . ఈ నూనెలతో రోజూ నోటిని పుక్కలించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా జెల్

అలోవెరా జెల్

అలోవెరా జెల్ గ్రేట్ హోం రెమెడీ . ఈ జెల్ ను వాపు ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల వాపు మరియు నొప్పి తగ్గించుకోవచ్చు. ఈ జెల్ ను అప్లై చేయడం లేదా గార్గిలింగ్ చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

English summary

7 Simple Home Remedies For Swollen Gums

Swollen gums are commonly caused by allergies, infections and gum injury, among others. Some of the common symptoms that come with this condition include bleeding of the gums, pain, increase in gaps between the teeth, etc.
Story first published: Monday, February 22, 2016, 10:21 [IST]
Desktop Bottom Promotion