For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ ఫుడ్సే కానీ.. మోతాదు మించితే డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!!

డైట్ లో హెల్తీ ఫుడ్స్ ని ఎక్కువగా చేర్చుకుంటే.. ఎక్కువ హెల్తీగా ఉంటామని భావిస్తున్నారా ? అయితే మీరు పొరబడ్డట్టే. తక్కువ టైంలోనే ఎక్కువ హెల్తీగా మారిపోవాలని అత్యాశ పడితే.. డేంజర్ లో పడిపోతారు.

By Swathi
|

పాలు, టమోటాలు.. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటూ ఉంటాం. ప్రతి ఫుడ్ లో కంపల్సరీ చేర్చి వండుతూ ఉంటాం. కానీ.. మనం హెల్తీ అనుకునే ఆహారాలే కొన్ని సార్లు డేంజరస్ అవుతూ ఉంటాయి. మోతాదుకి మించి తీసుకుంటే.. ఆరోగ్యానికి చాలా డేంజర్ గా మారిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

9 Healthy Foods That Are Actually Dangerous If You Eat Them Way Too Much

డైట్ లో హెల్తీ ఫుడ్స్ ని ఎక్కువగా చేర్చుకుంటే.. ఎక్కువ హెల్తీగా ఉంటామని భావిస్తున్నారా ? అయితే మీరు పొరబడ్డట్టే. తక్కువ టైంలోనే ఎక్కువ హెల్తీగా మారిపోవాలని అత్యాశ పడితే.. డేంజర్ లో పడిపోతారు. అనారోగ్య సమస్యలను కోరితెచ్చుకున్నవాళ్లు అవుతారు. కాబట్టి.. హెల్తీ ఫుడ్స్ అయినప్పటికీ మోతాదు మించకుండా చూసుకోవాల్సిన ఆహారాల లిస్ట్ చూద్దాం.

కొబ్బరినీళ్ల వల్ల కలిగే.. భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్..! కొబ్బరినీళ్ల వల్ల కలిగే.. భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్..!

మీ డైట్ లో ఈ హెల్తీ ఫుడ్స్ ని చేర్చుకోవాలి. కానీ ఏమాత్రం మోతాదు మించకుండా జాగ్రత్త కూడా పడాలి. పోషకారహార నిపుణులు సూచించన మోతాదు మాత్రమే.. డైట్ లో చేర్చుకోవాలి. ఇష్టమైన ఆహారమని, ఆరోగ్యకరమైనదని ఎక్కువ మొత్తంలో లాగించేయకూడదు.

కొబ్బరినీళ్లు

కొబ్బరినీళ్లు

కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలామంచిది. కానీ.. వీటిని మితిమీరి తీసుకుంటే మాత్రం బ్లడ్ షుగర్ లెవెల్స్, పొటాషియం లెవెల్స్ శరీరంలో చాలా పెరిగిపోతాయి. దీంతో బరువు పెరుగుతారు.

పాలు

పాలు

పాలు ఆరోగ్యానికి మంచిది. అందుకే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్లు అయ్యేంతవరకు పాలను కంపల్సరీ తాగుతూ ఉంటాం. కానీ.. మోతాదుకి మించి తాగితే.. ఇన్ల్ఫమేషన్, ఎముకలు విరిగిపోవడానికి కారణమవుతాయి. ముఖ్యంగా మహిళలు అలర్ట్ గా ఉండాలి.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క

ఎక్కువ మొత్తంలో దాల్చిన చెక్కను డైట్ లో చేర్చుకుంటే.. లివర్ పై దుష్ర్పభావం చూపడమే కాదు.. క్యాన్సర్ కి కారణమవుతుంది.

క్యాలీ ఫ్లవర్, క్యాబేజ్

క్యాలీ ఫ్లవర్, క్యాబేజ్

క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, బ్రొకోలి.. ఆరోగ్యానికి మంచిది. వీటిని డైట్ లో కంపల్సరీ చేర్చుకోవాలి. కానీ మోతాదుకి మించి తీసుకుంటే మాత్రం హైపోథైరాయిడిజం లేదా లో థైరాయిడ్ కి కారణమవుతుంది. ఎందుకంటే ఐయోడిన్ ని గ్రహించడం కష్టంగా మారుతుంది.

టమోటా

టమోటా

టమోటాలలో ఎక్కువ మోతాదులో ఎసిడిక్ కంటెంట్ ఉంటుంది. ఇది ప్రీక్యాన్సరస్ కి కారణమవుతుంది. కాబట్టి.. టమోటాలను తగిన మోతాదులో తీసుకోవాలి. మితిమీరి తీసుకుంటే.. డేంజర్ లో పడతారు.

సోయా

సోయా

సోయాను మోతాదుకి మించి డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో ఐరన్ ని గ్రహిస్తుంది. దీంతో అనీమియాకి కారణమవుతుంది.

పాలకూర

పాలకూర

పాలకూరలో ఎక్కువ మోతాదులో ఆక్సలేట్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ కి కారణమవుతుంది. కాబట్టి పాలకూరను న్యూట్రీషియన్స్ సూచించిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.

అరటిపండ్లు

అరటిపండ్లు

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని మరీ ఎక్కువగా డైట్ లో చేర్చుకుంటే.. గుండెలో సమస్యలు, నరాలు, కండరాల్లో సమస్యలకు కారణమవుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీని రోజుకి రెండు మూడు కప్పుల కంటే ఎక్కువ తీసుకోరాదు. మరీ ఎక్కువ మోతాదులో గ్రీన్ టీ తాగడం వల్ల.. పొట్టలో సమస్యలు వస్తాయి. కాన్ట్సిపేషన్ వంటి సమస్యలు రావడమే కాకుండా.. కాలేయం డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి అలర్ట్ గా ఉండండి.

English summary

9 Healthy Foods That Are Actually Dangerous If You Eat Them Way Too Much

9 Healthy Foods That Are Actually Dangerous If You Eat Them Way Too Much. Here is a list of 10 healthy foods that can actually be bad for you if you overeat it.
Story first published: Thursday, December 15, 2016, 12:25 [IST]
Desktop Bottom Promotion