For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పల్చగా, నీళ్ళగా ఉండే వీర్యంను నివారించే బెస్ట్ నేచురల్ రెమెడీస్

|

ఈ మధ్య సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. ఆధునికీకరణ, పట్టణీకరణ పెరుగుదలతోపాటు వాతావరణ కాలుష్యం పెరగడం కూడా మానవుల్లో సంతానలేమి సమస్యకు కారణం అవుతున్నాయి. ఇవేగాక వృత్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడికి గురిచేసే సమస్యలవల్ల, పౌష్టికాహారంలోపంవల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి సంతానలేమి సమస్యకు దారితీస్తోంది.

హెల్తీ అండ్ స్ట్రాంగర్ స్పెర్మ్ కౌంట్ పెంచే హెల్తీ ఫుడ్స్

పురుషుల్లో సంతానలేమికి కారణాలేమిటి? ఎవరికి ఈ సమస్య తలెత్తుతుంది? అనేది గమనిస్తే ఒకటి వయసు మీరిన తర్వాత అంటే 40 ఏళ్లు పైబడిన తర్వాత సమస్య ఏర్పడవచ్చు. రెండోది పుట్టుకతోనే అవయవాలలోపంవల్ల, జననేంద్రియాల్లోగానీ, పిట్యూటరీ గ్రంథిలో సమస్యవల్లగానీ, అవయవాల పెరుగుదల సరిగ్గా లేకపోవడంవల్లగానీ సంతానలేమి సమస్యకు దారితీస్తుంది. అధిక మానసిక ఒత్తిడివల్ల, దీర్ఘకాలిక వ్యాధులవల్ల, పొల్యూషన్‌వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గి సంతానలేమికి కారణం అవుతాయి.

స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం చూపే అంశాలు

పిల్లలు పుట్టనివాళ్లలో పురుషులకు మొట్టమొదట సెమన్ అనాలసిస్ (వీర్యం) పరీక్ష చేస్తారు. దీనిలో వీర్యంలో పస్ సెల్స్ ఉండకూడదు. సెమన్ పల్చగం ఉండటం వల్ల కూడా దీన్ని ఒక సెక్యువల్ సమస్యగా నిర్ధారిస్తారు. వీర్యం పల్చగా ఉంటే పిల్లలు పెట్టడం కష్టం. లోస్పెర్మ్ కౌంట్, స్మోకింగ్, డ్రగ్స్ తీసుకోవడం, స్ట్రెస్, హార్మోనుల్లో మార్పులు, ఫ్రక్టోజ్ లోపం మరియు పూర్ డైట్ ప్లాన్ వంటివి సెమన్ పల్చగా ఉంటుంది. అలాగే ఎక్కువగా సెక్స్ లో పాల్గొనడం మరియు ఫ్రీక్వెంట్ గా హాస్తప్రయోగం వల్ల వీర్యం పల్చగా మారుతుంది. స్పెర్మ్ క్వాలిటి, క్వాంటిటీ తగ్గడం వల్ల పురుషుల్లో పునరుత్పత్తి లోపిస్తుంది. కాబట్టి, అలా జరగకుండా నివారించాలంటే కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

ఫ్రక్టోజ్ అధికంగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి:

ఫ్రక్టోజ్ అధికంగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి:

ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల సెమన్ చిక్కగా మారుతుంది. ఫ్రక్టోజ్ అధికంగా ఉండే ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఆపిల్, బెర్రీస్, పియర్స్, గ్రేప్స్, డేట్స్, జామ, మామిడి, పైనాపిల్ మరియు వాటర్ మెలోన్ లో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. క్యాబేజ్, టమోటో, లెట్యుస్, ఉల్లిపాయల్లో కూడా ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది.

డ్రై డేట్స్ మరియు పాలు:

డ్రై డేట్స్ మరియు పాలు:

ఎండు ఖర్జూరాలను రెండు మూడు గంటల సేపు పాలలో నానిబెట్టి వీటిని మెత్తగా పేస్ట్ చేసి, పాలతో పాటు మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ మరియు డైటరీ ఫైబర్ పుష్కలంగా అందుతుంది. ఇంకా ఇందులో విటమిన్ బి1, బి2, బి5 లు అధికంగా ఉన్నాయి. ఇవి సెక్సువల్ స్టామినా పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

జింక్ రిచ్ ఫుడ్స్ :

జింక్ రిచ్ ఫుడ్స్ :

కొన్ని సందర్భాల్లో జింక్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం సెమన్ క్వాలిటీ, క్వాంటిటి పెంచుకోవచ్చు. ఓయిస్ట్రెస్, ల్యాంబ్ మటన్, బాదం, పీనట్స్, పైన్ నట్స్, జీడిపప్పు, మరియు సన్ ఫ్లవర్ సీడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వీటిలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది సెమన్ క్వాలిటి పెంచడానికి ఎక్కువగా సహాయపడుతుంది.

సెలీనియమ్ రిచ్ ఫుడ్స్:

సెలీనియమ్ రిచ్ ఫుడ్స్:

సెలీనియ్ అధికంగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వీర్యం చిక్కగా మారుతుంది. బ్రాజిల్ నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్,గుమ్మడి, చేపలు, సార్డిన్స్, ఓయిస్ట్రెస్, మటన్, చికెన్, గుడ్డు, వీట్ గ్రామ్ , బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్, మరియు ఉల్లిపాయ వంటి ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

విటమిన్ సి, ఇ, మరియు బి12 విటమిన్ రిచ్ ఫుడ్ :

విటమిన్ సి, ఇ, మరియు బి12 విటమిన్ రిచ్ ఫుడ్ :

కొన్ని సందర్భాల్లో విటమిన్స్ లోపం వల్ల కూడా సెమన్ పల్చగా మారుతుంది. విటమిన్ సి, ఇ, బి12 అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్ లోపాలను తగ్గించుకోవచ్చు.

ఒత్తిడి తగ్గించుకోవాలి:

ఒత్తిడి తగ్గించుకోవాలి:

పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థ సరిగా పనిచేయాలంటే స్ట్రెస్ లెవల్స్ తగ్గించుకోవాలి. ఒత్తిడి వల్ల హార్మోనుల్లో వచ్చే మార్పుల వల్ల సెమెన్ క్వాలిటీలో మార్పులు వస్తాయి . స్ట్రెస్ లెవల్స్ తగ్గించుకోవడం వల్ల సెమన్ క్వాలిటీలో మార్పులు రావచ్చు.

రెగ్యులర్ వ్యాయామం :

రెగ్యులర్ వ్యాయామం :

బాడీ మజిల్స్ ను బలోపేతం చేయాలంటే రెగ్యులర్ వ్యాయామం కంపల్సరీ. రెగ్యులర్ వ్యాయామం వల్ల శరీరంలో సెమెన్ హెల్తీగా ఉత్పత్తి అవుతుంది. ఇది సెమన్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి కారణమయ్యే స్ట్రెస్ లెవల్స్ తగ్గిస్తుంది. వ్యాయామం తర్వాత హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం మర్చిపోకండి...

సరైన నిద్ర:

సరైన నిద్ర:

రెగ్యులర్ గా సరైన నిద్రలేకపోతే బ్రెయిన్ ఫంక్షన్స్ మీద తీవ్రప్రభావం చూపుతుంది. ఇది సెక్స్ హార్మోనుల ప్రభావం చూపుతుంది. కాబట్టి రోజూ 6-8గంటల నిద్ర చాలా అవసరం.

English summary

Best Natural Home Remedies To Cure Thin and Watery Semen...

Best Natural Home Remedies To Cure Thin and Watery Semen..!Here are some best natural home remedies to cure thin and watery semen. Read on to know more...
Story first published: Thursday, July 14, 2016, 12:53 [IST]
Desktop Bottom Promotion