For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీర భాగాల్లో ఏర్పడే వాపులు ఎలాంటి వ్యాధులను సూచిస్తాయి ?

By Swathi
|

శరీరంలో కొన్ని సందర్భాల్లో చాలా విభిన్నమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు ఎందుకు వచ్చాయో.. అవి దేనికి సంకేతమో కూడా తెలియని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అయితే కొన్ని మార్పులను పట్టించుకోకపోయినా వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ.. కొన్ని రకాల మార్పులు మాత్రం తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. అలాంటి వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

షుగర్ పేషంట్స్ లో కాళ్ళ వాపులు నివారించే చిట్కాలు

శరీరంలో జరిగే డేంజరస్ మార్పుల్లో వాపు ఒకటి. శరీరంలోని కొన్ని భాగాల్లో ఉన్నట్టుండి వచ్చే వాపులు కొన్ని వ్యాధులను సూచిస్తాయి. కొన్ని రకాల వాపుల వల్ల ఎలాంటి నొప్పి, ప్రమాదం ఉండదు. కానీ.. కొన్ని మాత్రం తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. చర్మం కింద ఫ్లూయిడ్స్ చేరడం వల్ల వాపు వస్తుంది. అయితే కొన్ని రకాల వాపులు డేంజరస్ సిగ్నల్స్ అందిస్తాయి. అవి కొన్ని వ్యాధులను ముందుగా హెచ్చరిస్తాయి. కాబట్టి.. శరీరంలో ఏ భాగంలో వచ్చే వాపు.. ఎలాంటి వ్యాధికి సంకేతం..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ముఖంలో వాపు

ముఖంలో వాపు

ముఖంలోని టిఫ్యూస్ లో ఫ్లూయిడ్స్ ఎక్కువైనప్పుడు ముఖంలో వాపు కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో వాపు వల్ల ఎర్రగా కనిపించడం, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇలా వాపుకి కొన్ని రకాల మందుల నుంచి వచ్చే ఎలర్జీలే కారణం. అలాగే దుమ్ము, కాలుష్యం కూడా ఇందుకు కారణమవుతాయి. థైరాయిడ్ సమస్య ఉన్నా.. ముఖంలో వాపుకి కారణమవుతుంది.

బ్లోటింగ్

బ్లోటింగ్

పొట్టలో గ్యాస్ ఏర్పడటం వల్ల కడుపు వాపుకి కారణమవుతుంది. ఇది మీరు తీసుకునే ఆహారం వల్ల వస్తుంది. అలాగే జీఈఆర్, ఐబీఎస్ అనే సమస్యలు కూడా బ్లోటింగ్ కి కారణమవుతాయి. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించడం అవసరం.

పాదాలు వాపులు

పాదాలు వాపులు

ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చునేవాళ్లకు పాదాల్లో వాపు వస్తుంది. అలాగే హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, థ్రోంబోసిస్ వ్యాధులతో బాధపడేవాళ్లలో పాదాల వాపులు చాలా సాధారణం. పీరియడ్స్ సమయంలో, మెనోపాజ్ లో వాటర్ రీటెన్షన్ వల్ల మహిళల్లో పాదాలు వాపు వస్తాయి.

బ్రెస్ట్ లో వాపు

బ్రెస్ట్ లో వాపు

ప్రెగ్నెన్సీ టైంలో బ్రెస్ట్ లో వాపు రావడం సాధారణం. ఇది హార్మోన్లలో మార్పుల వల్ల వస్తాయి. అంతేకాకుండా బ్రెస్ట్ లో వాపుకి పీఎమ్ఎస్, బ్రెస్ట్ క్యాన్సర్లకు కూడా కారణమవుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేవాళ్లలో నిపుల్ చుట్టూ చర్మం గట్టిగా మారుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.

వృషణాలలో వాపు

వృషణాలలో వాపు

వృషణాలలో వాపు రావడాన్ని వృషణాలు వాచే జబ్బు అనిపిలుస్తారు. ఇక్కడ వాపు రావడానికి ఇన్ల్ఫమేషన్ కారణమవుతుంది. అలాగే వృషణంలో

ఉండే నరానికి సమస్యగా మారుతుంది. దీనికి బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అయి ఉండవచ్చు.

గొంతు వాపు

గొంతు వాపు

గొంతులో వాపు రావడానికి వాపుతో కూడి లింఫ్ నోడ్స్. పంటికి లేదా చిగుళ్లకు, లేదా చర్మానికి గాయాలు, ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఇలా గొంతులో వాపు వస్తుంది. దీనికారణంగా.. చెవి దగ్గరకూడా వాపు వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు ఈ వాపు వస్తుంది.

కళ్ల వాపు

కళ్ల వాపు

ఏడ్చినప్పుడు, ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, డీహైడ్రేషన్ కారణంగా.. కళ్లు వాస్తుంటాయి. అయితే కళ్లలో గాయాలు, ఎలర్జీ అయినప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా.. కళ్లలో వాపు వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి.

English summary

Different types of swelling in your body you shouldn't ignore

Different types of swelling you shouldn't ignore. But there can be more to swelling than just water accumulation, it could be a sign of dangerous disease.
Story first published:Wednesday, May 18, 2016, 12:44 [IST]
Desktop Bottom Promotion