For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టొమక్ అల్సర్ ఉన్నప్పుడు ఈ ఆహారాలను ఖచ్చితంగా తినకూడదు

|

ఈ మధ్యకాలంలో చాలా మంది స్టొమక్ అల్సర్ తో బాధపడుతున్నారు. నిత్యజీవితంలో వేధించే ఆరోగ్య సమస్యల్లో స్టొమక్ అల్సర్ కూడా ఒక సాధారణ సమస్యగా ఉన్నది. చిన్న ప్రేగు, అన్నవాహిక మరియు కడుపు పైభాగంలో బాధాకరమైన నొప్పిని కలిగి ఉండటం అనేది అల్సర్ గా భావిస్తారు. దీనికి కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పవచ్చు. వేళకు తీసుకోని ఆహారం, తీసుకున్నా హడా వుడిగా క్షణాల్లో ముగించటం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం.... వీటితో పాటు నిత్యం ఎదుర్కునే మానసిక ఒత్తిడి తోడుకావటంతో 'గ్యాస్ట్రిక్‌ అల్సర్‌' సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. కడుపు పై బాగంలో వచ్చేటటువంటి అలర్స్ గా భావిస్తారు.

ఈ పెప్టిక్ అల్సర్ ప్రేగుల్లో పుళ్ళు లేదా జీర్ణవాహికలో కోతలా ఏర్పడుతుంది. ఈ బాధాకరమైన పుళ్ళు లేదా ప్రేగులో రాషెష్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల , బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, వ్యాధినిరోధక అసాధారణతలు మరియు ఆస్పిరిన్ మరియు ఐబ్రూఫిన్ వంటి కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కూడా ప్రేగులో పుళ్ళు ఏర్పడుటకు కారణం అవుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం జీర్ణ ద్రవాల్లో హైడ్రోలిక్ యాసిడ్స్ మరియు పొట్టలోని పెప్సిన్ ఎంజైమ్స్ వల్ల జీర్ణవాహిక పాడవుతుంది.

స్టొమక్ అల్సర్ ను టీట్మెంట్ తీసుకున్నా, తిరిగి అది రాకుండా ముందు జాగ్రత్తలతో నివారించుకోవడం మంచిది. స్టొమక్ అల్సర్ ఉన్నవారు ఈ క్రింది ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.

స్పైసీ ఫుడ్స్ :

స్పైసీ ఫుడ్స్ :

స్టొమక్ అల్సర్ ఉన్నప్పుడు పొట్టలో ఎసిడిటి లెవల్స్ పెరుగుతాయి. ఇది పొట్టలో చీకాకు కలిగిస్తాయి. కారం ఎక్కువగా తినడం వల్ల స్టొమక్ లైనింగ్ ఇరిటేషన్ మరింత ఎక్కువ అవుతుంది. పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, స్టొమక్ అల్సర్ తో బాధపడే వారు స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఆల్కహాల్ ఎసిడిటి లెవల్స్ ను పెంచుతుంది. కాబట్టి స్టొమక్ అల్సర్ ఉన్నవారు , ఆల్కహాల్ ను ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి.

కెఫిన్ :

కెఫిన్ :

కెఫిన్ అధికంగా ఉన్నా డ్రింక్స్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. స్టొమక్ అల్సర్ ఉన్నవారు ఖచ్చితంగా కేఫినేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.

రెడ్ మీట్ :

రెడ్ మీట్ :

ప్రోటీన్స్, ఫ్యాట్స్ అధికంగా ఉన్న రెడ్ మీట్ జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దాంతో గ్యాస్ రిలీజ్ అవుతుంది, దాంతో స్టొమక్ లైనింగ్ మీద ప్రభావం చూపుతుంది. చివరకు స్టొమక్ అల్సర్ కు దారితీస్తుంది.

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ :

స్టొమక్ అల్సర్ తో బాధపడే వారు పాలు మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్ ను తినకుండా ఉండటమే మంచిది. డ్రైరీ ప్రొడక్ట్స్ లో ఫ్యాట్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది స్టొమక్ యాసిడ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇది స్టొమక్ అల్సర్ కు దారితీస్తుంది.

 ఉప్పు ఎక్కువ తినకూడదు:

ఉప్పు ఎక్కువ తినకూడదు:

స్టొమక్ అల్సర్ తో బాధపడే వారు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినకూడదు . ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడంవ ల్ల పరిస్థితి మరింత వరెస్ట్ గా మారుతుంది.

సాప్ట్ డ్రింక్స్ :

సాప్ట్ డ్రింక్స్ :

సాప్ట్ డ్రింక్స్ లేదా కార్బోనేటెడ్ డ్రింక్స్ లో సిట్రిక్ యాసిడ్స్, షుగర్ అడిక్టివ్ అధికంగా ఉంటాయి. ప్రిజర్వేటివ్ స్టొమక్ లైనింగ్ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి స్టొమక్ అల్సర్ ఉన్నవారు ఈ ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

English summary

Foods You Should Strictly Avoid If You Have Stomach Ulcer

Do you have that extreme stomach pain and burning sensation that comes along with vomiting? Do you suffer from indigestion, heartburn and irregular bowel movement? These are the major symptoms visible in people suffering from stomach ulcer.
Story first published: Saturday, November 26, 2016, 14:53 [IST]
Desktop Bottom Promotion