Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
రెగ్యులర్ గా కాఫీ తాగడం ఆరోగ్యమా ? అనారోగ్యమా ?
కాఫీ.. !! ఇది ప్రతి ఒక్కరూ ఇష్టపడేది. ప్రతి ఒక్కరికి ఉదయం నిద్రలేవగానే అవసరమైనది కాఫీ. ప్రతి ఒక్కరూ.. రోజుని కాఫీతోనే ప్రారంభిస్తారు. అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్న అపోహ ఉంది. కానీ.. కాఫీలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి అనేది అసలు వాస్తవం. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.
కాఫీ తాగడం వల్ల ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది. కాఫీలో పుష్కలంగా పోషకవిలువలున్నాయి. అలాగే కాఫీలో విటమిన్ బి, రైబో ఫ్లేవిన్, ప్యాంతోథెనిక్ యాసిడ్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, నైసిన్, కెఫీన్ వంటి పోషకాలుంటాయి. ఇంతేకాదు కాఫీ తీసుకోవడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కాఫీలో దాగున్న హెల్త్ బెన్ఫిట్స్ తెలుసుకుందాం..

ఎనర్జీ
కాఫీలో ఉండే కెఫీన్.. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి, శారీరక, మానసిక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏకాగ్రత పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.

డిప్రెషన్
కాఫీ యాంటీ డిప్రెషంట్ లా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మూడ్ మార్చేసి.. హ్యాపీగా ఉండటానికి సహాయపడుతుంది. రోజుకు 3 నుంచి 4 కప్పుల కాఫీ ఎవరైతే తీసుకుంటారో.. వాళ్లకు డిప్రెషన్ వచ్చే ఛాన్స్ తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

డయాబెటిస్
రోజూ కాఫీ తీసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాఫీలో ఉండే పోలీఫెనోల్స్, క్లోరోజెనిక్ యాసిడ్ మధుమేహం నివారించి.. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.

బరువు తగ్గడానికి
కాఫీ ఆకలిని తగ్గిస్తుంది. కప్పు కాఫీ తాగడం వల్ల మధ్యాహ్నం స్నాక్స్, స్వీట్స్ తీసుకోకుండా.. ఆకలిని తగ్గిస్తుంది. అలాగే శరీరంలో క్యాలరీలు కరగడానికి కూడా కాఫీ సహాయపడుతుంది.

కాలేయానికి
కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ల్ఫమేషన్, టాక్సిన్స్ ని నిరోధించడానికి తోడ్పడతాయి. రోజుకి 2 నుంచి 3 కప్పుల కాఫీ తాగేవాళ్లలో కాలేయానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. ఫ్యాటీ లివర్ వంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు.

గుండె
కాఫీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్ గా కాఫీ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు. అలాగే.. స్ర్టోక్ రిస్క్ ని 20 శాతానికి తగ్గిస్తుంది.

అల్జీమర్స్
అల్జీమర్స్ ఎక్కువగా వయసుపైబడిన వాళ్లలో కనిపిస్తుంది. రోజుకి ఎక్కువ కప్పుల కాఫీలు తాగడం వల్ల అల్జీమర్స్ రిస్క్ 60 శాతం తగ్గుతుంది.



Click it and Unblock the Notifications
