Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల పొందే గ్రేట్ బెన్ఫిట్స్..!!
ఒకరోజు ఫుల్ టైం ఫ్రీగా గడపాలని, ఫుల్ గా ఎంజాయ్ చేయాలని మీరు ఫీలవుతుంటారా ? మరి మీ శరీరం కూడా అలానే ఫీలవుతుందని.. ఎందుకు రియలైజ్ కావడం లేదు ? చాలా మంది ఎక్స్ పర్ట్స్.. మీ శరీరానికి రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం అని సూచిస్తూ ఉంటారు. వారానికి ఒకసారి.. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచి ఐడియా అని చెబుతున్నారు.
హెల్తీ ఫుడ్స్ తినడం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్ అందరూ వినే ఉంటారు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ వల్ల పొందే ప్రయోజనాల గురించి చెప్పనక్కరలేదు. కానీ.. అప్పుడప్పుడు ఉపవాసం ఉంటూ.. మీ శరీరాన్ని హెల్తీగా ఉంచవచ్చని ఎప్పుడూ ఆలోచించలేదా ? చాలా అధ్యయనాలు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాయి.
కనీసం వారానికి లేదా నెలకు ఒకసారి.. ఉపవాసం ఉండటం వల్ల.. శరీరానికి చాలా మంచిదని, ఇతర మందులు వాడటం కంటే.. ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల చాలా ప్రయోజనకరమని అధ్యయనాలు చెబుతున్నాయి. మీ ఆరోగ్యాన్ని బట్టి.. ఎన్ని రోజులకు ఒకసారి ఉపవాసం మంచిది అనేది డిసైడ్ అయి ఉంటుంది. కానీ.. వారానికి ఒకసారి చాలామంచిదని.. ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
ఉపవాసం.. శరీరానికి కావాల్సిన విశ్రాంతిని ఇస్తుంది. ఉపవాసం పాటించడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలను.. ఇప్పుడు.. తెలుసుకుందాం. ఈ ఫలితాలను చూస్తే.. ఇవాళ్టి నుంచే.. మీరు ఈ టిప్ ఫాలో అయిపోతారు.

బరువు తగ్గడానికి
ఆహారం తీసుకోవడం వల్ల డైరెక్ట్ గా బరువుపై ప్రభావం చూపుతుంది. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండటం వల్ల.. బరువు తగ్గడంలో శరీరం పాజిటివ్ గా స్పందిస్తుంది. ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో.. శరీరంలో పేరుకున్న ఫ్యాట్ ని శరీరం ఉపయోగించి.. ఎనర్జీ ఇస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.

మెటబాలిజం
శరీరంలో పేరుకున్న క్యాలరీలు కరిగించడానికి ఉపవాసం చక్కటి పరిష్కారం. లేదంటే.. క్యాలరీలు బరువు పెరగడానికి కారణమవుతాయి. దీనివల్ల మెటబాలిజం మెరుగుపడి.. ఫుడ్ జీర్ణమయ్యే శక్తి పొందుతుంది. బోవెల్ ఫంక్షన్ సజావుగా ఉంటే.. మెటబాలిజం పర్ఫెక్ట్ గా ఉంటుంది.

ఆకలి పెరగడానికి
రోజుకి మూడు సార్లు ఆహారం తీసుకోవడం వల్ల.. ఆకలిగా అనిపించడం చాలా తక్కువ అవుతుంది. ఆకలి ఫీలవ్వాలంటే.. కనీసం 12 గంటలు ఉపవాసం ఉండాలి. ఫాస్టింగ్ వల్ల హార్మోనస్ బ్యాలెన్స్ గా ఉంటాయి.

మెదడు పనితీరుకి
మెదడు పనితీరు మెరుగ్గా సాగడానికి ఉపవాసం.. సరైన ఔషధం. దీనివల్ల మెదడు కణాలు మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఉపవాసం న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే ప్రొటీన్స్ ని ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది బ్రెయిన్ సెల్స్ ఆరోగ్యానికి సహాయపడతాయి.

ఇమ్యునిటీ మెరుగుపడటానికి
వారానికి లేదా నెలకు ఒకసారి ఉపవాసం ఉండటం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే సెల్ డ్యామేజ్ అవకుండా నిరోధిస్తుంది. అలాగే అంతర్గత ఒత్తిడిని తగ్గిస్తుంది.

క్లియర్ స్కిన్ పొందడానికి
చర్మ సమస్యలకు.. శరీరంలో పేరుకున్న మలినాలే ముఖ్య కారణం. వీటివల్ల మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఉపవాసం ఉండటం వల్ల.. శరీరాన్ని డెటాక్సిఫై చేస్తుంది. అలాగే.. ఇది క్లియర్ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ అందిస్తుంది.

ఇన్సులిన్
కణాల్లో ఇన్సులిన్ ని పెంచడం వల్ల.. కణాల కార్బొహైడ్రేట్ మెటబాలిజం మెరుగుపడుతుంది.

యంగ్ గా ఉండటానికి
ఉపవాసం ఉన్నప్పుడు మీ శరీరంలోని హానికారక మలినాలను శరీరం తొలగిస్తుంది. ఈ డెటాక్సిఫికేషన్ వల్ల..యూత్ ఫుల్ లుక్ సొంతం చేసుకోవచ్చు. మొటిమలు, పిగ్మెంటేషన్, జుట్టు రాలడం వంటి సమస్యలను నివారించవచ్చు.



Click it and Unblock the Notifications