For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో ’ఏసి’ వాడకంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్

|

సాధారణంగా వింటర్ ఎంజాయ్ బుల్ సీజన్ అని చెబుతుంటారు, కానీ సీజన్ లో వచ్చే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నప్పుడు. కానీ, అదే క్రమంలో చాలా మందికి కొన్ని సహజంగా వచ్చే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు సురక్షితంగా మరియు హెల్తీగా ఉంచుకోవడానికి ఈ ఆర్టికల్ మీకెంతగానో ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా వేసవిలో ఎసి'లు వాడకంతో శాంతన మరియు ఉపశమనం పొందుతారు. అయితే శీతాలంలో పరిస్థితేంటి? కాలానికి అనుగుణంగా ఏసిని సెట్ చేసుకుంటూ శీతాకాలంలో కూడా ఏసి ఉపయోగిస్తుంటారు . అయితే ఇలా వింటర్ సీజన్లో ఏసిని ఉపయోగించుకోవడం వల్ల కొన్ని హెల్త్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్న సంగతిని తెలుసుకోవాలి . వింటర్ సీజన్లో ఏసిని ఆన్ చేయడానికి వివిధ రకాల కారణాలుండవచ్చు. వింటర్లో ఏసి సెట్టింగ్స్ లేదా హెయిర్ కండీషన్ వల్ల ఇది మీ గదిని డీహుమిడిఫైయింగ్ గా పనిచేస్తుంది, మీ గదిని వార్మ్ గా ఉంచుతుంది .

చలికాలంలో వచ్చే అంటువ్యాధులకు దూరంగా ఉండాలంటే..

సహజంగా చెప్పాలంటే వింటర్ సీజన్ బయట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడం వల్ల ఆరోగ్యానికి హాని ఎక్కువ. దాని తోడు గదుల్లో ఏసిలు ఉపయోగించడం వల్ల మరికొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. వింటర్ సీజన్లో ఏసిలు వాడటం వల్ల ఎదురయ్యే హెల్త్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఇళ్లలో పిల్లలుంటే మరింత అవసరం.

వింటర్ సీజన్ ఎంజాయ్ చేయాలంటే వేడి వేడి సూప్ త్రాగండి..

వింటర్ సీజన్లో ఏసి సెట్టింగ్స్ తో మ్యానేజ్ చేస్తుంటారు. ముఖ్యంగా పనిచేసే చోట వివిధ రకాల చర్మ తత్వాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలుండే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి, హెల్త్ రిస్క్ లు ఎక్కువగా ఉంటాయి . వింటర్ సీజన్లో ఏసి ఉపయోగించడం వల్ల డ్రై స్కిన్ సమస్యతో పాటు, శ్వాససంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది.

వింటర్ స్పెషల్: అందంగా కనబడుటకు వింటర్ బ్యూటీ టిప్స్

వింటర్ సీజన్లో ఏసిలు వాడకం వల్ల ఎదురయ్యే హెల్త్ ఎఫెక్ట్స్ ...

ఆస్తమా:

ఆస్తమా:

వింటర్ సీజన్లో, ఏసిని ఉపయోగించడం వల్ల ఆస్తమా లక్షణాలు ఎక్కువగా కనబడుతాయి . కాబట్టి, వింటర్లో తరచూ ఏసిని ఆన్ చేయడం అంత మంచిది కాదు. దీని వల్ల ఇళ్లలో లేదా ఆఫీసు గదుల్లోని పరికరాల మీద డస్ట్ మరింత ఎక్కువ చేరే అవకాశాలున్నాయి. తర్వాత ‘ఏసి'లను ఆన్ చేసినప్పుడు డస్ట్ ను గది మొత్తం వ్యాపింప చేస్తుంది. వింటర్లో ఏసి'ల వాడకం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే అత్యంత ముఖ్యమైన విషయం.

అలర్జీలు:

అలర్జీలు:

వింటర్ సీజన్ లో డస్ట్ చేరడం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏసి గదుల్లో మరింత ఎక్కువగా చేరుతుంది . దాంతో ఏసి ఆన్ చేసినప్పుడు పోలెన్ గ్రెయిన్స్, డస్ట్ లేదా అనిమల్ హెయిర్ గదిమొత్తం వ్యాప్తి చెందేలా చేస్తుంది. అందువల్ల వింటర్లో ఏసిను ఉపయోగించడం వల్ల అనేక రకాల అలర్జీలకు గురికావల్సి వస్తుంది.

 డ్రై స్కిన్:

డ్రై స్కిన్:

వింటర్ సీజన్ అంటేనే డ్రై స్కిన్. చర్మం డ్రైగా మారడం, పగుళ్ళు ఏర్పడటానికి గురిచేస్తుంది. వింటర్ సీజన్లో ఏసిలను వాడటం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. డ్రై ఎయిర్ మరియు చల్లలి గాలి చర్మాన్ని మరింత కూల్ గా మరియు డ్రైగా మార్చుతుంది . ఏసిల నుండి వచ్చే గాలి వల్ల చర్మంలోని మాయిశ్చరైజర్ ను మొత్తం గ్రహిస్తుంది. దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా తయారవుతుంది. బయట చాలా శీతల వాతావరణం మరియు గదుల్లో ఏసి సెట్టింగ్స్ వల్ల చర్మం మరింత తీవ్రంగా పగుళ్ళుకు కారణం అవుతుంది.

ఇన్ఫెక్షన్స్:

ఇన్ఫెక్షన్స్:

వింటర్ సీజన్లో ఏసి'లను వాడటం వల్ల ఇండోర్ పొల్యూషన్ పెరిగిపోతుంది . ఈ కారణం చేత గదుల్లో బ్యాక్టీరియా, ఫంగస్ మరియు వైరస్ లు పెరుగుతాయి . సెంట్రల్ ఎయిర్ యూనిట్ ఉన్నట్లైతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది . ఈ యూనిట్ బయట నుండి ఫ్రెష్ ఎయిర్ ను గదుల్లోకి ఎప్పటికీ తీసుకురాలేందు. అందువల్ల బ్యాక్టీరియా, మరియు ఫంగస్ గ్రోత్ కు ఏసి కండీషనర్స్ మరింత అనువుగా పనిచేసి, వాటిని విస్తరింప చేస్తాయి.

దురద:

దురద:

వింటర్ సీజన్లో కూడా ఏసిగదుల్లో గడిపే వారికి స్కిన్ దురదగా ఉంటుంది . ముఖ్యంగా ఆఫీల్లో పనిచేసే వారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఏసి సెట్టింగ్స్ వల్ల వారి టెంపరేచర్ ను కంట్రోల్ చేసుకోలేరు. చల్లని గాలి, తేమ వల్ల చర్మం త్వరగా డ్రైగా మారుతుంది . శ్వాసనాళాల్లో డ్రైనెస్ మరియు దురదగా అనిపిస్తుంది.

డీహైడ్రేషన్:

డీహైడ్రేషన్:

వింటర్ సీజన్లో గదుల్లోని ఏసిల యొక్క టెంపరేచర్ సెట్టింగ్స్ ను మార్చుకోవచ్చు . ఏక్కువ సమయం ఏసి సెట్టింగ్ ను ఉపయోగించడం వల్ల అది క్రమంగా డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. వింటర్ సీజన్లో ఏసిని ఉపయోగించడం వల్ల ఇది ఒక సీరియస్ హెల్త్ ఎఫెక్ట్ గా గుర్తించాలి. కాబట్టి ముందుగానే అవసరం అయిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

English summary

Health Effects Of Using AC In Winter

Health Effects Of Using AC In Winter,If you are one among those people who use AC full time by changing it to the winter settings, you have to know that it can cause many health effects. You may have many reasons to switch on your AC during the winter season. It can be dehumidifying your room, keeping your ro
Story first published: Tuesday, January 12, 2016, 15:52 [IST]
Desktop Bottom Promotion