For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కండరాల సలుపులు, నొప్పులను నివారించే హెల్తీ ఫుడ్స్...

|

మజిల్ సోర్ నెస్(కండరాల్లో సలుపు)ఇది ఎక్కువగా వ్యాయామాలు చేయడంవల్ల మరియు జిమ్ లో బరువు ఎక్కువగా ఎత్తడం వల్ల వస్తుంటుంది . కండరాల్లో సలుపు డీహైడ్రేషన్ వల్ల రక్తప్రసరణలో అవకతవకలు, మినిరల్స్(క్యాల్షియం మరియు పొటాషియంలోపం) మరియు కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల కూడా కండరాల్లో నొప్పులు వస్తుంటాయి . మజిల్ స్ట్రెయిన్ వల్ల కండరాలు గాయపడుతాయి.

కండరాల బెనుకు లేదా కండరాల నొప్పిని నివారించే 12 ఉత్తమ చిట్కాలు

ఎప్పుడైతే కండరాలు టైట్ గా మారుతాయో అప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్ గాయపడుతుంది . ఇది మజిల్ సెల్స్ కు న్యూట్రీషియన్స్ చేరకుండా సెల్స్ ను నివాిరస్తుంది. ఈ కారణం చేత కండరాల్లో సలుపు మరియు కండరాల నొప్పులకు దారితీస్తుంది. ఈ కండరాల నొప్పులు చాలా బాధాకరంగా ఉంటాయి. ఈ నొప్పులు దినచర్య మీద తీవ్రప్రభావంను చూపుతాయి . కండరాల్లో నొప్పులను తగ్గించుకోవడానికి సులభ మార్గాలు, నేచురల్ పదార్థాలు . అంతే కాదు నొప్పిని నివారించడానికి ఆహారాలు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి.

కండరాల నెప్పులకి 10 సమర్ధవంతమైన హోం రెమెడీస్

కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కండరాల సలుపు, నొప్పులను తగ్గించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి ? అదేవిధంగా నొప్పులను కూడా నివారిస్తాయి. అదే విధంగా ఫైటో కెమకిల్స్ మరియు నొప్పిని తగ్గించడానికి ఇతర పదార్థాలు కూడా గ్రేట్ గా సహాయపడుతాయి.

కండరాల సలపులు మరియు నొప్పులను తగ్గించే కొన్ని ఆహారాలు ఈ క్రింది లిస్ట్ ద్వారా...

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ ఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది వివిధ రకాల నొప్పులను నివారిస్తాయి,. మెడ, తల మరియు బ్యాక్ పెయిన్ మరియు మొత్తం బాడీ పెయిన్ ను నివారిస్తుంది . సాల్మన్లో ఉండే కాల్సిటోనిన్, ప్రోటీన్స్ ఓస్టిరియోఫోస్ మరియు ఇతర ఇన్ఫ్లమేటరీ జాయింట్ కండీషన్స్ ను నివారిస్తుంది.

కాఫీ:

కాఫీ:

కాఫీలో నొప్పి మరియు గాయాలను నివారించే గుణాలు కూడా ఉన్నాయి. వ్యాయామం వల్ల వచ్చే మజిల్ పెయిన్ నివారించడంలో కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . కెఫిన్ బయోకెమికల్స్ ను బ్లాక్ చేస్తుంది. వ్యాయామం వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది . మజిల్ పెయిన్ నివారించుకోవడానికి ఎప్పుడూ కాఫీ త్రాగండి.

అల్లం:

అల్లం:

మజిల్ పెయిన్ నివారించుకోవడంలో అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది సోర్ మజిల్స్ ను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది మరియు నొప్పిని నివారిస్తుంది . అల్లంలో జింజరోల్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ తగ్గిస్తుంది. ఇది కండరాల నొప్పి, ఆస్టిరియోర్థరైటిస్ మరియు కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మలో వివిధ రకాల హీలింగ్ పవర్స్ ఉన్నాయి. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు మజిల్ డ్యామేజ్ ను నివారిస్తాయి . ఇంకా రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి . దాంతో కండరాల నొప్పిని తగ్గించుకోవచ్చు.

బ్లూ బెర్రీస్ :

బ్లూ బెర్రీస్ :

బ్లూ బెర్రీస్ లో ఉండే ఫైటో కెమికల్స్ మజిల్స్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి . బ్లూబెర్రీస్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ మరియు ఎలాజిక్ యాసిడ్స్ కండరాల సలుపును తగ్గిస్తాయి. బ్లూబెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక వ్యాధులకు వ్యతిరేఖంగా పోరాడుతాయి.

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్లో బ్రొమోలిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది . త్వరగా నొప్పులను నివారించుకోవాలంటే పైనాపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి . కండరాల లాగడానికి కూడా తక్షణ ఉపశమనం కలిగించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

 పసుపు పేస్ట్:

పసుపు పేస్ట్:

పసుపులు హీలింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణగణాలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే . పసుపులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి వాపు, నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

హార్స్ చెస్ట్ నట్:

హార్స్ చెస్ట్ నట్:

కండరాల యొక్క నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ను నుండి ఉపశమనం కలిగించడంలో మరియు కండరాల గాయలను మాన్పడంలో ఈ మూలిక చాలా బాగా సహాయపడుతుంది. వీటిలో ఎసిన్ అనే నయం చేసే గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటితో తయారుచేసి జెల్ ను అప్లై చేస్తే వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

పొటాషియం

పొటాషియం

పొటాషియం కండరాలని ఆరోగ్యం గా ఉంచడంలో పొటాషియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అరటిపళ్ళు,తృణధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పొటాషియం అంది కండరాల నెప్పుల మీద పోరాడడం లో సహాయపడుతుంది.

 చెర్రీస్

చెర్రీస్

చెర్రీ జ్యూస్ తాగడం వల్ల మీ కండరాలు పునరుత్తేజం పొందుతాయి.యాంటీ ఆక్సిడెంట్లు అధికం గా ఉంటాయి ఈ జ్యూస్ లో. కనుక ఓ గ్లాసు చెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల కండరాల నెప్పి మరియు ఇన్ ఫ్లమేషన్(ఎర్రబడి వాచి నెప్పిగా ఉండుట) ని నివారించవచ్చు. ఈ చిట్కాలు పాటించడానికి సులభం గా లేవూ?? అవును, పైన చెప్పిన చిట్కాలకి కావాల్సినవన్నీ మనింట్లో రెడీగా ఉంటాయి.మీ కండరాల నెప్పులనుండి ఉపశమనం పొందాలనుకుంటే కనుక వీటిల్లో ఏదో ఒక చిట్కా పాటించి తక్షణ ఉపశమనాన్ని పొందండి.

English summary

TOP 10 Healthy Foods That Soothe Your Sore Muscles

TOP 10 Healthy Foods That Soothe Your Sore Muscles, Muscle soreness is a resultant of heavy workout or overdoing those weight lifts at a gym. Muscle soreness can also be caused by dehydration, disturbance in the blood flow, lack of minerals such as calcium and potassium, and certain medications. A muscle strain is an injury to a muscle.
Story first published: Saturday, January 16, 2016, 16:51 [IST]
Desktop Bottom Promotion