Latest Updates
-
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
45 సెకన్ల మసాజ్ ట్రిక్ తో.. అమోఘమైన హెల్త్ బెన్ఫిట్స్..
సింపుల్..!! ఒక్క మసాజ్ తో రకరకాల అనారోగ్య సమస్యలు, నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు. ఒక చిన్న ట్రిక్.. అది కూడా కేవలం 45 సెకన్లు స్పెండ్ చేస్తే చాలు.. అనేక సమస్యల నుంచి ఎఫెక్టివ్ రిలీఫ్ పొందవచ్చు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు.. ఇలా రకరకాల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం పొందే సింపుల్ ఐడియాను మీరూ ఫాలో అవుతారు కదూ..
లేటెస్ట్ టెక్నిక్..: శరీరంలోని ఏడు భాగాల్లో మసాజ్ తో వెయిట్ లాస్..!!
చేయాల్సిందిల్లా ఒక్కటే. నుదుటిపై రెండు కనుబొమల మధ్య పాయింట్ పై వేలు పెట్టి.. సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా కేవలం 45 సెకన్లు చేస్తే చాలు. రోజూ ఇలా మసాజ్ చేయడం వల్ల మీ శరీరంలో అద్భుతమైన మార్పులు జరగడంతో పాటు, అనేక హెల్త్ బెన్ఫిట్స్ పొందవచ్చు. మరీ ఈ 45 సెనక్ల మసాజ్ ట్రిక్ తో పొందే బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా..

రక్త ప్రసరణ
నుదుటిపై ఆ పాయింట్ లో కేవలం 45 సెకన్ల మసాజ్ తో.. రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి.

ఒత్తిడి
ఒత్తిడితో బాధపడేవాళ్లకు ఈ మసాజ్ చాలా ఎఫెక్టివ్ రిలీఫ్ ని ఇస్తుంది. కేవలం 45 సెకన్లు మసాజ్ చేస్తే.. ఒత్తిడిని జయించడం తేలికవుతుంది.

తలనొప్పి
చాలామంది తరచుగా తలనొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు ట్యాబ్లెట్స్, ఇతర మందులు వాడకుండా.. ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే.. వెంటనే రిలీఫ్ గా ఉంటుంది.

అలసట
ఈ భాగంలో మసాజ్ చేయడం వల్ల అలసట నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కళ్లపై ఒత్తిడి
ప్రస్తుత జనరేషన్ ఎక్కువగా కంప్యూటర్లు, మొబైల్స్ చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెంచుతున్నారు. కాబట్టి నిద్రకు ముందు 45 సెకన్ల పాటు.. పైన చెప్పిన పాయింట్ లో మసాజ్ చేసుకుంటే.. కళ్లపై ఒత్తిడి తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది.

ముక్కు దిబ్బడ
చాలా మందికి సైనస్ లేదా ఎలర్జీ వల్ల ముక్కు పట్టేసినట్టు ఉంటుంది. లేదా తరచుగా జలుబు చేసి.. ముక్కులో ఊపిరి ఆడనట్టు ఫీలవుతుంటారు. అలాంటి వాళ్లు ఈ ట్రిక్ ఫాలో అయితే.. త్వరిత ఉపశమనం లభిస్తుంది.

ప్రశాంతత
ఈ సింపుల్ ట్రిక్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు మంచి ప్రశాంతత లభిస్తుంది. చాలా రిలాక్స్ గా ఉండవచ్చు.



Click it and Unblock the Notifications
