Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వర్షాకాలంలో తేనెతో పొందే సూపర్ పవర్ ఫుల్ హెల్త్ బెన్ఫిట్స్..
తేనెను లిక్విడ్ గోల్డ్ అనిపిలుస్తారు. పురాతన కాలం నుంచి దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇందులో రకరకాల ఆరోగ్య ప్రయోజనాల కారణంగా.. తేనెను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ తర్వాత.. దీన్ని మోడ్రన్ మెడికేషన్స్ లో ఉపయోగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో తేనెను ఖచ్చితంగా చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
వాతావరణంలో మార్పుల వల్ల వర్షాలు వస్తాయి. చాలామందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటారు. ఇమ్యునిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్లలో.. ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇమ్యునిటీ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్లకు, ఇమ్యునిటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్లతో పోల్చితే.. వైరల్ ఇన్ఫెక్షన్స్ వర్షాకాలంలో ఎక్కువగా వస్తాయి.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయాల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ తో ఎఫెక్టివ్ గా పోరాడతాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలో ఇమ్యునిటీ పెంచడానికి సహాయపడే విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, మినరల్స్ తేనెలో లభిస్తాయి.

అలాగే తేనెలో కాపర్, జింక్, ఐయోడిన్, గ్లూకోజ్ లభిస్తాయి. దీన్ని పాలు, నిమ్మ, చెక్క, మిరియాలతో కలిపి తీసుకోవచ్చు. మరి వర్షాకాలంలో తేనె తీసుకోవడం వల్ల పొందే సూపర్ హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..
జలుబు, దగ్గు నివారించడానికి
వైరల్ కోల్డ్, కాఫ్ వర్షాకాలంలో చాలా కామన్. ఈ కామన్ ఇన్ఫెక్షన్స్ వర్షాకాలంలో చాలామందిని వేధిస్తాయి. హనీ తీసుకోవడం వల్ల గొంతులో సెక్సిటివిటీని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయోల్ గుణాలు.. జలుబు తగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శ్వాసనాళాల్లో ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను గోరువెచ్చని నీటిలో కలిపి నెమ్మదిగా తాగాలి.

పొట్టలో ఇన్ఫెక్షన్ నివారించడానికి
పొట్టలో ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ వర్షాకాలంలో సాధారణం. జంక్ ఫుడ్ రెగ్యులర్ గా తినేవాళ్లలో పొట్టలో ఇన్ఫెక్షన్ కి ఎక్కువ అవకాశాలుంటాయి. తేనెలో ఎక్కువ ప్రొబయోటిక్ లేదా మంచి బ్యాక్టీరియా ఉండటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ని నివారిస్తుంది. ఒక టీ స్పూన్ తేనెను ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటూ.. ఈ ఇన్ఫెక్షన్ కి దూరంగా ఉండవచ్చు.

ఇమ్యునిటీ లెవెల్ పెంచడానికి
తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. శరీరంలో ఇమ్యునిటీ పెరిగి, ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. టీ స్పూన్ తేనె, టీ స్పూన్ జింజర్ సిరప్, నిమ్మరసం తీసుకుని.. గోరు వెచ్చని నీటిలో కలపాలి. ఇది ఇమ్యునిటీ లెవెల్ పెంచి.. కామన్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా కాపాడుతుంది.

బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల బ్యాక్టీరియాతో పోరాడుతుంది. వర్షంలో తడిచినప్పుడు ఏర్పడే క్రిములను నాశనం చేస్తుంది. ముఖ్యంగా పాదాల చుట్టు ఎక్కువ బ్యాక్టియా ఉంటుంది. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యలు డయేరియా, కలరా. వీటిని నివారించడంలో తేనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.




Click it and Unblock the Notifications