Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేప పొడిలో దాగున్న అమేజింగ్ హెల్త్ సీక్రెట్స్..!
వేప ఇండియన్స్ ఎక్కువగా ఉపయోగించే మరో అద్భుత ఔషధం. ఇందులో.. చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉన్న ఔషధ గుణాలు రకరకాల అనారోగ్య సమస్యలను తేలికగా పరిష్కరిస్తుంది.
వేప ఇండియన్స్ ఎక్కువగా ఉపయోగించే మరో అద్భుత ఔషధం. ఇందులో.. చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉన్న ఔషధ గుణాలు రకరకాల అనారోగ్య సమస్యలను తేలికగా పరిష్కరిస్తుంది.

వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. అలాగే.. ఇవి చర్మానికి, జుట్టుకి, ఆరోగ్యానికి కూడా అద్భుత ఫలితాలు అందిస్తాయి. వేప టీ లేదా ఆహారంలో లేదా మందుగా ఉపయోగిస్తే.. రకరకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఇవాళ వేప పొడిలో దాగున్న ప్రయోజనాలు తెలుసుకుందాం..

పంటి ఆరోగ్యానికి
వేప పొడిని మీ పళ్లు తోముకోవడానికి ఉపయోగించవచ్చు. ఇది చిగుళ్లను, పళ్లను హెల్తీగా ఉంచుతుంది. నోట్లో బ్యాక్టీరియాను నాశనం చేసి.. క్వావిటీల సమస్య నివారించి.. మంచి శ్వాసను అందిస్తుంది.

డయాబెటిస్
ఒకవేళ మీరు డయాబెటిస్ తో బాధపడుతుంటే.. ఒక టీ స్పూన్ వేప పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి.. ఉదయాన్నే పరకడుపున తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ తీసుకుంటే.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇన్సులిన్ లా పనిచేస్తుంది.

సైనస్
వేప పొడిని ముక్కులో డ్రాప్స్ లా ఉపయోగిస్తే.. సైనస్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. ఒక టీస్పూన్ వేప పొడిని.. ఒక గ్లాసు వేడి నీటిలో కలపాలి. 3చుక్కల ఈ డ్రాప్స్ ని రోజుకి రెండుసార్లు వాడితే.. ఇన్ల్ఫమేషన్ తగ్గుతుంది.

బ్లడ్ ఫ్యూరిఫికేషన్
వేపపొడి రక్తన్ని ప్యూరిఫై చేసి.. డెటాక్స్ చేస్తుంది. కొద్దిగా వేప పొడి తీసుకుని పాలలో కలిపి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా వేగంగా మెరుగుపడుతుంది.

పాదాలు
పాదాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే.. దాన్ని నివారించడంలో వేప పొడి అద్భుతంగా పనిచేస్తుంది. వేపపొడిని వేడినీటిలో మిక్స్ చేసి.. ఆ పాదాలకు రాసుకుంటే.. మెరుగైన ఫలితాలు చూడవచ్చు.

వేపపొడి తయారు చేసేవిధానం
కొన్ని వేపాకులు తీసుకుని ఎండబెట్టాలి. రెండురోజులు ఎండిన తర్వాత.. మరో మూడు రోజులు ఇంట్లోనే ఎండబెట్టాలి. తర్వాత.. రుబ్బి పొడిచేసి పెట్టుకోవాలి. అంతే.



Click it and Unblock the Notifications