For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో జలుబు దగ్గు నివారించే ట్రెడిషినల్ హోం రెమెడీస్

|

వేసవి కాలం ఎండల వేడి నుండి కొంచెం ఉపశమనం కలిగించినా...వర్షకాలంలో చలి వల్ల, వాతావరణంలో మార్పుల వల్ల కొంత మంది చాలా బద్దకస్తులుగా మారుతుంటారు. ఈ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. వర్షాకాంలో తరచూ బాధించే సమస్యల్లో సాధారణ జలుబు మరియు ఫ్లూ .

వర్షాకాలంలో మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మన పూర్వీకులు మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారాలనే మెడిసిన్స్ గా ఉపయోగించే వారు. అయితే రెగ్యులర్ ఫుడ్స్ కు కొన్ని ఇతర పదార్థాలను కూడా చేర్చి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల వర్షకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడేవి. ఈ వర్షకాలంలో కోల్డ్ మరియు ఫ్లూ నివారణకోసం కొన్ని ట్రెడిషినల్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

కాధ:

కాధ:

కాధ ఒక హెర్బల్ డ్రింక్ వర్షాకాలంలో మరియు చలికాలంలో దీన్నిఅమ్మమ్మలు వీటిని ఎక్కువగా ఉపయోగించే వారు. ఈ హెర్బల్ డ్రింక్ వర్షకాలం, చలికాలంలో వచ్చే సాధారణ జలుబు మరియు దగ్గును నివారిస్తాయి . దీన్ని కొన్ని మసాలాదినుసులు మరియు మూలికలతో తయారుచేస్తారు . ఇవి మన వంటగదిలోనే ఉండే దాల్చిన చెక్క, యాలకలు, లవంగాలు, మిరియాలు, సోంపు, తులసి, అల్లం మొదలగు వాటితో తయారుచేసి ఒక గ్లాసు కాధ డ్రింక్ శరీరానికి వెచ్చదనం కలిగించి జలుబు దగ్గు, బాడీ పెయిన్స్ ను నివారిస్తాయి.

పసుపు పాలు:

పసుపు పాలు:

మన చిన్నతనంలో అమ్మలు, అమ్మమ్మలు మనకు పసుపు పాలాను తాగించే వారు. గోరువెచ్చని పాలలో పసుపు మిక్స్ చేసి తాగడం వల్ల జలుబు దగ్గు నివారించబడుతుంది. అంతే కాదు, శరీరంలో ఎక్కడైనా గాయాలైతే పసుపు రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. దగ్గు మరియు జలుబు నివారణకోసం పసుపును పూర్వకాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. పసుపు, తేనె మరియు ప్పెపర్ ను మిక్స్ చేసి తీసుకోవడం వల్ల దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది మరియు త్వరగా నిద్రపడుతుంది.

చికెన్ సూప్:

చికెన్ సూప్:

ఫుడ్ లవర్స్ కు ఇది టేస్టీ హోం రెమెడీ. చికెన్ సూప్ వర్షకాలంలో బెస్ట్ ఫుడ్ డ్రింక్ . ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ తాగడం వల్ల జలుబు దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఒక కప్పు వేడి వేడి చికెన్ సూప్ ట్రెడిషినల్ కంట్రీ చికెన్ సూప్ జీకలర్ర, మిరియాలు, వెల్లుల్లి, మిరియాలు, అల్లం మరియు కొత్తిమీరతో తయారుచేసి తీసుకోవడం వల్ల జలుబు, మరియు దగ్గు లక్షణాలు నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

హెర్బ్స్ తో చట్నీ లేదా రసం:

హెర్బ్స్ తో చట్నీ లేదా రసం:

మూలికలు మరియు పచ్చని ఆకులు మనకు దేవుడిచ్చిన వరం. ఇండియన్ కుషన్ లో ఉపయోగించే ప్రతి మూలికలో ఒక్కో ఆరోగ్య ప్రయోజనం దాగుంది. అజ్వైన్ ఆకులు, నైట్ షేడ్స్, తమలపాకులు, తులసి, ధనియాలు వెల్లుల్లి, జీలకర్ర మరియు ఉలవలతో చట్నీ లేదా రసంను వెరైటీగా తయారుచేసుకోవచ్చు.ఈ హెర్బ్స్ మరియు ధాన్యాలు జలబు మరియు దగ్గుకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . వీటితో వంటలను చాలా ఇల్లలో తయారుచేస్తారు . వేడి వేడి రసం తాగడం వల్ల నాజల్ ఫ్రీ అవుతుంది. సైనస్ సమస్యలు ఉండవు.

పెప్పర్ మరియు తేనె మిక్స్ :

పెప్పర్ మరియు తేనె మిక్స్ :

మిరియాల పొడిలో తేనె మిక్స్ చేసి తీసుకోవడం చాలా సింపుల్ మరియు ఎఫెక్టివ్ పద్దతి. వర్షాకాలంలో ఈ రెండింటి కాంబినేషన్ డ్రింక్ ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవడం వల్ల జులుబు, దగ్గు, కఫం సంబంధిత సమస్యలు నివారించబడుతాయి.

పామ్ షుగర్ క్యాండీ మిల్క్:

పామ్ షుగర్ క్యాండీ మిల్క్:

పామ్ క్యాండీ నేచురల్ స్వీట్నర్. డయాబెటిక్ పేషంట్స్ కు ఇది ఉత్తమం. వర్షాకాలంలో జలుబు దగ్గు నివారణకు దీన్ని నేచురల్ హోం రెమెడీగా ఉపయోగిస్తారు. మెడిసిన్ లా పనిచేస్తుంది. సాధారణంగా పసుపు , క్రష్డ్ పెప్పర్ మిక్స్ చేసి తీసుకుంటే గొంతుకు స్మూత్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. అలాగే నట్స్, మాసాలల పౌడర్ మిక్స్ చేసి తీసుకోవచ్చు.

డ్రైజింజర్ మరియు ధనియాల డికాషన్:

డ్రైజింజర్ మరియు ధనియాల డికాషన్:

పెప్పర్ పౌడర్ , డ్రై జింజర్ మరియు ధనియాల మిశ్రమం మెడిసినల్ డికాషన్ గా పనిచేస్తుంది. జలుబు మరియు దగ్గును నివారిస్తుంది. తులసి మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుంది. బెల్లం వాడటం వల్ల కాఫీకి నేచురల్ తిపిని అందిస్తుంది. టేస్ట్ కోరుకునే వారు కొద్దిగా పాలు మిక్స్ చేసుకోవచ్చు.

English summary

Traditional Foods to Fight Cold and Flu

Though monsoon rains bring us the much needed relief from heat and spreads happiness all around, it also makes us feel lazy and brings with it health issues, such as common cold, cough and flu. Our ancestors used food as medicine and mixed and match different items to create a balanced diet that allowed them to stay healthy in all seasons.
Desktop Bottom Promotion