For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్ర గురించి మీకు తెలియని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!

|

నిద్ర అన్నది ప్రకృతి ఇచ్చిన అతిగొప్ప వరం మరియు ఆరోగ్యకరమైన, దీర్ఘమైన మరియు నాణ్యతగల జీవితం జీవించటం తప్పనిసరి. గాఢనిద్ర పోలేనివారు లేదా నిద్ర పోవటంలో కూడా ఇబ్బందులు ఎడుర్కుంటున్నారంటే వారు మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలు, రెండింటితో బాధపడుతున్నారన్నమాట. ఇన్సొమ్నియా (నిద్రలేమి) కలిగిన ప్రజలు ఆందోళన, ఒత్తిడి మరియు ఏకాగ్రత లేకపోవడంతో బాధపడుతుంటారు.

గాఢనిద్ర పోలేని వారు పగటి సమయంలో అలసిన అనుభూతితో ఉంటారు. వారు బరువు పెరగటంతో బాధపడుతుంటారు మరియు వారిలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. గాఢ నిద్రపోవడానికి ధ్యానం, ఒత్తిడి తగ్గించడం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం వంటి అనేక సహజ పద్ధతులు ఉన్నాయి.

అయితే, నిద్రతో సంబంధం ఉన్న అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మీరు నిద్ర గురించి ఆసక్తికరమైన మరియు కొంతవరకు అసహజంగా ఉన్న ఈ వాస్తవాలను తెలుసుకోవాలి.

నిద్ర సమయంలో జరిగే ఈ విచిత్రమైన మరియు ఆసక్తికరమైన విషయాలు కొన్నిటిని తెలుసుకుందాం.

మీ కళ్ళ కదలిక

మీ కళ్ళ కదలిక

నిద్ర పోతున్న సమయంలో కనుగ్రుడ్లను కదిలించటం అన్నది సర్వసాధారణమైన విషయం. నిద్రకు ఐదు దశలు ఉంటాయి, అయితే ఈ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ ఐదవ దశలో జరుగుతుంది. ఈ దశలో మీరు కలగనడం మరియు గాఢనిద్రలో ఉంటారు.

మీరు స్తంభింఛి ఉంటారు

మీరు స్తంభింఛి ఉంటారు

మీరు ఎప్పుడైనా పరుగెత్తుతున్నట్లుగా లేదా మీ శరీరం ఇతర కదలికలు చేస్తున్నట్లుగాని కల గన్నారా? ఏదేమైనా, వాస్తవానికి మీరు స్తంభనలో ఉండి మీ శరీరం కొద్దిగా కూడా కదిలించలేరు. మీరు కలకంటున్నప్పుడు మీలో కదలికలు లేకుండా ఉండటానికి ఇలా జరుగుతుంది. ఈ పక్షవాతం సర్వ సాధారణమైనది మరియు ప్రతి వ్యక్తికి గాధనిద్రలో జరుగుతుంది.

మీరు ఉలిక్కిపడి మేలుకొంటున్నారా

మీరు ఉలిక్కిపడి మేలుకొంటున్నారా

కొన్ని సమయాల్లో మీరు నిద్రలో ఉలిక్కిపడటం లేదా పడిపోవటం జరిగి మేలుకొంటున్నారా! ఇది నిద్ర పోతున్నప్పుడు సర్వసాదారణమైన విషయం. ఈ ఇది మీ మెదడు మిమ్మలిని గాఢనిద్రలోకి ఒరగకుండా అడ్డుకోవటం వలన మరియు మిమ్మలిని మేల్కొని ఉంచాలని ప్రయత్నిస్తుంది. అయితే, శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఇలా జరగటానికి గల కారణం కనుక్కోలేకపోతున్నారు.

నిద్రలో ప్రేరేపణ

నిద్రలో ప్రేరేపణ

ఇలా నిద్రలో ప్రేరేపణ అనుభూతి కలగటం సర్వసాధారణమైన విషయం మరియు ఈ విధంగా ఆడ, మగ ఇద్దరిలోను జరుగుతుంది. పరిశోధనలలో తేలిందేమంటే ఇది కేవలం కోమావంటి స్థితిలోకి వెళ్ళకుండా మీ శరీరాన్నినిరోధించడానికి జరుగుతుందని. ఈ ఉద్రేకం ఒక స్థాయికి చేరిన తర్వాతే మీ శరీరం అవసరమైనప్పుడు నిద్ర నుండి మేల్కొనేట్లుగా చేయవచ్చు అని నిర్ధారిస్తుంది. అందువలన, మీ మెదడు నిద్రలో ఉన్నప్పుడు కూడా వాస్తవ ప్రపంచంతో మిమ్మలిని జత చేసే ఉంచుతుందన్న మాట. నిద్రలో జరిగే అద్భుతమైన నిజాలలో ఇది ఒకటి.

నిద్రలో మాట్లాడటం

నిద్రలో మాట్లాడటం

ఇంచుమించు 6 శాతం ప్రజలు నిద్రలో మాట్లాడుతుంటారు. ఈ విధంగా మహిళల కంటే పిల్లల్లో, పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ స్థితిని సోమ్నిలాక్వీ అంటారు. ఈ స్థితి హానికరమైనదేమీ కాదు మరియు కనీసం మీరు గుర్తించలేరు కుడా. కానీ అది మీ భాగస్వామి యొక్క నిద్రను భంగ పరుస్తుంది. నిద్రలో మాట్లాడటానికి గల ప్రధాన కారణాలు ఒత్తిడి, నిరాశ మరియు అనారోగ్యం మొదలైనవి.

టెక్స్ట్ సందేశాలు

టెక్స్ట్ సందేశాలు

పగటి సమయంలో టెక్స్ట్ సందేశాలను పంపడం వలన ఈ స్థితి ఎక్కువగా యువతలో సర్వసాధారణం మరియు వారికి తెలీకుండానే ఫోన్ వద్దకు వెళ్ళటం మరియు టెక్స్ట్ సందేశాలను పంపుతుంటారు. ఈ సందేశాలలో పదాలు ఏ అర్థం లేకుండా కలగలిసి ఉండవచ్చు.

పళ్ళు కొరకటం

పళ్ళు కొరకటం

చాలామంది నిద్రలో పళ్ళు కోరుకుతుంటారు. ఈ స్థితినుండి బయటపడటానికి వైద్యం చేయించుకోవాలి మరియు దీనిని బ్రక్సిజం అంటారు. దీనివలన దంతాల పగుళ్ళు లేదా దంతాల చిప్పింగ్ వంటివి సంభవిస్తాయి మరియు దవడ కండరాల పుండ్లకు కారణం కావచ్చు. పళ్ళు కొరకటానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు కానీ ఒక అధ్యయనం వలన తేలిందేమంటే ఇది ఒత్తిడి మరియు యాంగ్జైటీ వలన కావచ్చు అని. మీరు నిద్రలో పళ్ళు కొరుకుతున్నట్లయితే వెంటనే దంత వైద్యుడిని సందర్శించండి మరియు వెంటనే మౌత్ గార్డు అమర్చుకోండి.

హార్మోన్ గ్రోత్

హార్మోన్ గ్రోత్

మీరు గాఢనిద్రలో ఉన్నప్పుడు మీ శరీరం హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. మీరు చిన్నవారయితే ఈ హార్మోన్ కండరాలు, ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. మీరు పెద్దవారయితే, అది శరీర మరమ్మత్తుకు సహాయపడుతుంది. ఈ కారణం వలన సౌండ్ స్లీప్ ను అందమైన నిద్ర అని కూడా పిలుస్తారు.

మూత్రపిండాలు నెమ్మదిగా పనిచేయటం

మూత్రపిండాలు నెమ్మదిగా పనిచేయటం

మూత్రపిండాలు రోజంతా రక్తం నుండి విషపదార్థాలను వడకట్టటం మరియు మూత్రాన్ని ఉత్పత్తి చేయటం వంటి పనులను చేస్తుంటాయి. అయితే, రాత్రి సమయంలో మూత్రపిండాల పని తగ్గుతుంది అందువలన మీకు రెండుగంటలకొకసారి మూత్రవిసర్జన అనుభూతి కలుగదు కనుక మీరు ఏ భంగం లేకుండా నిద్రపోవొచ్చు.

English summary

Unknown Facts About Sleep

People who don't get a sound sleep feel tired during the day. They also suffer from weight gain and have decreased immunity. There are many natural methods to fall asleep, such as meditation, reducing stress and eating healthy foods.
Story first published: Saturday, August 13, 2016, 17:56 [IST]
Desktop Bottom Promotion