For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ సీజన్లో అలర్జీలకు చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కాలు

|

సాధారణంగా వాతావరణ మార్పులతో పాటు, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శీతాకాలంలో ఏదో ఒక అలర్జీ సమస్య వేధిస్తుంది. తుమ్ములూ, దగ్గులే కాదు...ఒక్కోక్క సారి శ్వాస తీసుకోవడమే కష్టంగా మారుతుంది. క్రమంగా సమస్య తీవ్రమయ్యే కొద్దీ లక్షణాలను బట్టి ఇది మామూలు జలుబు సమస్య కాదని తేలిపోతుంది.

అయినా శీతాకాలంలో అలర్జీ ఎందుకొస్తుంది, వాటి లక్షణాలేంటి అనేవి గుర్తించాలి. వాటికోసం ఎలాంటి నివారణ పద్థతులను అనుసరించాలో తెలుసుకుంటే శీతాకాలంలో వచ్చే అలర్జీల నుండి ఉపశమనం పొందడం సులభం అవుతుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అసందర్భంగా ప్రతి చర్యను అలర్జీ అంటారు. ఏదైనా ఒక పదార్థానికి శరీరం సాధారణ స్థితి కన్నా ఎక్కువ మొత్తంలో ప్రక్రియను చూపుతుంది, ఆ పదార్థాలను అలర్జెంట్ అని ప్రతిచర్యను అలర్జిక్ రియాక్షన్ అని అంటారు.

వింటర్లో పైనాపిల్ తినొచ్చా? ఒకవేళ తింటే కలిగే దుష్ప్రభవాలేంటి...?

వాతావరణ మార్పులు అంటే శీతాకాలంలో సమస్య అధికం కావడం, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనలు, మస్కిటో రిపెల్లెంట్స్, వివిధ రకాల స్ప్రేలు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, శీతలపానీయాలు, ఐస్ క్రీములు వంటివి కారణమవుతుంటాయి. చాలా మందిలో అలర్జీవ వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అలర్జీలకు గురైనప్పుడు ముక్కులోని శ్లేష్మపొర వాపుకు గురౌతుంది. దాంతో ముక్కు నుంచి నీరు కారడం, తుమ్ములు, ముక్కుదిబ్బడ, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. వీటినే ఆయుర్వేదంలో 'కఫ దోశ'అని అంటారు. ఆయుర్వేదం వ్యాధినిరోధకతను గురించి చాలా స్ట్రాంగ్ గా నమ్ముతుంది. ఇది నేరుగా జీర్ణవ్యవస్థకు సంబంధించినదై ఉంటుంది

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా మార్చే హెల్తీ వింటర్ ఫుడ్స్

ఒక స్ట్రాంగ్ డైజెషన్ సిస్టమ్ వల్ల, వింటర్లో కూడా మంచి ఆకలిని కలిగి ఉండటం మరియు న్యూట్రీషియన్ డైట్ ను తీసుకోవడం వల్ల ఈ అలర్జీక్ సమస్యలన్నింటిని నివారించుకోవచ్చు. మరి ఈ సమస్యలు రాకుండా శీతాకాలంలో తీసుకోవల్సిన ఆయుర్వేధిక్ మార్గాలేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

ఆహారం తీసుకోవడం తగ్గించాలి:

ఆహారం తీసుకోవడం తగ్గించాలి:

వింటర్ సీజన్లో తరచూ అలర్జీలకు కారణం అవుతుంటే లేదా నిరంతరం దగ్గు, జలుబు ఉంటే ఆహారం లిమిట్ గా తీసుకోవాలి. ఆయుర్వేదంలో, ఈ టెక్నిక్ ను లఘనాన్ థెరఫీ అని పిలుస్తారు. ఫుడ్ క్వాంటిటీని తగ్గించడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది . ఇది పిత్తదోశాన్ని పెంచుతుంది. దాంతో శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తి కలిగి ఉన్నట్లు కనబడుతుంది.

 ఆకలైనప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి:

ఆకలైనప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి:

రోజులో పూర్తిగా ఆకలైనప్పుడు, దప్పికైనప్పుడు మాత్రమే ఆహార పానీయాలు తీసుకోవాలి.

 జీర్ణక్రియకు కష్టమైన ఆహారాలకు దూరంగా ఉండాలి:

జీర్ణక్రియకు కష్టమైన ఆహారాలకు దూరంగా ఉండాలి:

చలికాలంలో మాంసాహారం, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కోలా, సోడా వంటి ఏరియోటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. లేదా పరిమితంగా తీసుకోవాలి.

మసాలాలను జోడించాలి:

మసాలాలను జోడించాలి:

మసాలాలలో, అల్లం పౌడర్, పసుపు, బ్లాక్ పెప్పర్, దాల్చిన చెక్క, యాలకలు, మరియు కరివేపాకు ప్రతి ఒక్క మసాలా దినుసు 1గ్రాము తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు వింటర్లో వచ్చే అలర్జీలు, దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తాయి.

వంటనూనెలు:

వంటనూనెలు:

నూనెలు, ఆలివ్ ఆయిల్, కానోలా ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సీసమ్ ఆయిల్స్ ను వంటకు ఉపయోగించాలి. కొబ్బరి నూనె వంటలకు వాడకూడదు.

గోరువెచ్చనీ నీటిని త్రాగాలి:

గోరువెచ్చనీ నీటిని త్రాగాలి:

వింటర్లో జలుబు, దగ్గు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి గోరువెచ్చని నీరు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి కఫ దోశను నివారిస్తాయి. కఫం అసమతౌల్యత వల్ల జలుబు మరియు దగ్గుకు కారణం అవుతుంది.

నెయ్యి పరిమితం చేయాలి:

నెయ్యి పరిమితం చేయాలి:

వింటర్లో జలుబు మరియు దగ్గు ఉన్నప్పుడు నెయ్యి తినకపోవడం మంచిది . మీకు తప్పనిసరి అనుకుంటే...చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగించాలి . ఒక టెబుల్ స్పూన్ నెయ్యికి 1 గ్రాము పసుపు చేర్చి ఉపయోగించాలి.

 హేర్బల్ టీ త్రాగాలి:

హేర్బల్ టీ త్రాగాలి:

నార్మల్ బ్లాక్ టీకి ప్రత్యామ్నాయంగా తులసి హేర్బల్ టీ లేదా జింజర్ టీ త్రాగడం వల్ల మంచి ఉపశనం ఉంటుంది.

English summary

What Does Ayurveda Recommend For Winter Allergies?

Cold and flu symptoms are a result of imbalances in Kapha Dosha. Ayurveda strongly believes that immunity is directly related to digestion. A strong digestive system, aided by good appetite and nutritious diet can withstand the infections that are prevalent all around.
Story first published: Saturday, January 23, 2016, 19:00 [IST]