Latest Updates
-
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా? -
చేపల వేపుడును మించిపోయే రుచితో కందగడ్డ ఫ్రై.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండి ఇలా! -
ఒకే రకమైన ఎగ్ కర్రీ తిని విసిగిపోయారా? ఒక్కసారి ఈ నేపాల్ స్టైల్ ఎగ్ రెసిపి తింటే జన్మలో మర్చిపోరు! -
షుగర్ వ్యాధి వచ్చే ముందు కనబడే సంకేతాలు ఇవే! -
బిర్యానీకి మించిన రుచి..తక్కువ మసాలాలతో పిల్లలు,పెద్దలు మెచ్చే మొరాదాబాదీ చికెన్ పులావ్ ఇలా వండండి! -
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
గ్రీన్ టీని ఏ సమయంలో, ఎంత పరిమాణంలో తీసుకోవాలి ??
గ్రీన్ టీ.. చాలా పాపులర్ బివరేజ్. ఇందులోని అత్యంత గొప్ప ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలియడం వల్ల.. అందరూ గ్రీన్ టీ తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. బరువు తగ్గాలి అనుకునేవాళ్లు, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకునేవాళ్లు, అందమైన స్కిన్ పొందాలి అనుకునేవాళ్లు, మెటబాలిజం మెరుగుపడాలి అనుకునేవాళ్లు, ఎనర్జిటిక్ గా, హెల్తీగా ఉండాలి అనుకునేవాళ్లు.. గ్రీన్ టీ తాగాలి.
కానీ నీళ్లు తాగినట్టు.. ఒక కప్పు తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా తాగడం వల్ల అన్ని ప్రయోజనాలు ఒకేసారి పొందవచ్చు అనుకుంటే పొరపాటు. గ్రీన్ టీని సరైన సమయంలో తాగకపోతే.. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలర్ట్ గా ఉండాలి.
గ్రీన్ టీలో కెఫీన్, టాన్నిన్స్ ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్ జ్యూస్ పై ప్రభావం చూపి.. పొట్టకు సమస్య తీసుకొస్తాయి. దీనివల్ల వికారం, గ్యాస్ట్రిక్ పెయిన్, పొట్టలో ఎసిడిటీ సమస్య వస్తుంది. అందుకే గ్రీన్ టీని సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోవాలి. అప్పుడు.. అందులోని ప్రయోజనాలు పొందవచ్చు.
గ్రీన్ టీలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. కానీ.. ఎక్కువగా తీసుకోవడం వల్ల.. ఆరోగ్యంపై చాలా దుష్ర్పభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. గ్రీన్ టీని ఏ సమయంలో తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఖాళీ కడుపుతో తీసుకోరాదు
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే.. శరీరాన్ని శుభ్రం చేస్తుందని నమ్ముతారు. కానీ.. అది పొరపాటు. గ్రీన్ టీలో ఉండే కెఫీన్ పొట్టలో గ్యాస్ట్రిక్ జ్యూస్ ని డైల్యూట్ చేసి.. సమస్యకు కారణమవుతుంది.

సరైన సమయం
గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలన్నీ పొందాలంటే.. భోజనానికి అరగంట ముందు లేదా భోజనం తర్వాత 1 నుంచి 2 గంటల మధ్యలో తీసుకోవాలి.

పాలు, పంచదార వద్దు
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, ధియనైన్ ఉంటాయి. ఇవి.. ఆరోగ్యానికి మంచిది. కానీ.. పాలల్లో ఉండే ప్రొటీన్స్, క్యాలరీలు, పంచరాలో ఉండే ఫ్లేవనాయిడ్స్.. నెగటివ్ రియాక్షన్ కి కారణమవుతాయి. కాబట్టి.. పంచదార, పాలు కలపకపోతే.. అందులోని ప్రయోజనాలన్నీ పొందవచ్చు.

తేనె
గ్రీన్ టీలో ఉండే కెఫీన్, తేనెలో ఉండే విటమిన్స్.. ఫ్యాట్ కరిగించడంలో సహాయపడతాయి. తేనె క్యాలరీలు తగ్గించడానికి, గ్రీన్ మెటబాలిజం పెంచడానికి సహాయపడుతుంది.

భోజనం చేసిన వెంటనే
గ్రీన్ టీని భోజనం చేసిన వెంటనే తీసుకోరాదు. కెఫీన్ జీర్ణక్రియపై ప్రభావం చూపి.. పోషకాలు గ్రహించకుండా అడ్డుకుంటుంది.

రోజుకి రెండు, మూడు కప్పులు
రోజుకి 2 నుంచి 3 కప్పుల గ్రీన్ డీ తాగడం వల్ల.. ప్రయోజనాలన్నీ పొందవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిండెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరంలో టాక్సిన్స్ ని పెంచి.. కాలేయంపై దుష్ప్రభావం చూపుతాయి.



Click it and Unblock the Notifications
