బాడీ హీట్ ను కూల్ చేసే ఆయుర్వేద టిప్స్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఆయుర్వేదం ప్రకారం, సీజన్ బట్టి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి.

ప్రస్తుతం వేసవి సీజన్ . ఈ వేసవి సీజన్ లో వేడి వల్ల, చెమట, హీట్ బాయిల్స్ , బాడీ హీట్ సమస్యలను ఎదుర్కొంటారు. వాతావరణంలో మార్పుల వల్ల బాడీ హీట్ పెరుగుతుంది. దాంతో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మరి బాడీ హీట్ తగ్గించుకోవడం ఎలా?

ఆయుర్వేదం అంటేనే వాత, పిత్త అంటారు. పిత్తాన్నే బాడీ హీట్ గా చెబుతారు. మెటబాలిజం నార్మల్ గా పనిచేస్తే ఎలాంటి సమస్యలుండవు. బాడీ హీట్ ఎక్కువ అయితే ఆయుర్వేదం ప్రకారం ''పిత్త దోషం’’గా పిలుస్తారు. అకస్మాత్త్ గా శరీరంలో బాడీ హీట్ పెరిగితే, శరీరంలో మెటబాలిజం రేటు క్రమంగా పెరుగుతుంది. అంతే కాదు శరీరంలో రసాయనాలు అసమతుల్యం చెందుతాయి.

వేసవిలో బాడీ హీట్ మాత్రమే కాదు, మొటిమలు, మచ్చలు, హీట్ బర్న్, స్కిన్ రాషెస్, డయోరియా వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.

అందువల్ల , ఆయుర్వేదం ప్రకారం బాడీ హీట్ ను తగ్గించుకోవడం చాలా అవసరం. ఆయుర్వేదం ప్రకారం బాడీ హీట్ ను ఏవిధంగా తగ్గించుకోవాలో తెలుసుకుందాం..

శరీరంలో వేడి పుట్టించే మసాలాలకు దూరంగా ఉండాలి:

శరీరంలో వేడి పుట్టించే మసాలాలకు దూరంగా ఉండాలి:

వేసవి సీజన్ లో బాడీ హీట్ కలిగించే మసాలాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, సోంపు, బ్లాక్ పెప్పర్ వంటి చాలా వరకూ తగ్గించాలి. వీటి స్థానంలో కొత్తిమీర, యాలకలు, సీలాంట్రో వంటివి తీసుకోవాలి.

వేడిగా, కారంగా, పుల్లగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి:

వేడిగా, కారంగా, పుల్లగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి:

ఈ వేసవి సీజన్ లో శరీరంలో ఆల్రెడీ వేడిగా ఉంటుంది. ఇంకా వేడి కలిగించే కారం, పులుపు, వేడి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. స్వీట్ అండ్ కూలింగ్ ఫుడ్స్ వైట్ అండ్ రెడ్ రైస్ , గోధుములు, కోకనట్, నెయ్యి వంటివి తీసుకోవాలి

ఐస్ వాటర్, కోల్డ్ వాటర్ డ్రింక్స్ ను తాగడం మానేయాలి:

ఐస్ వాటర్, కోల్డ్ వాటర్ డ్రింక్స్ ను తాగడం మానేయాలి:

కార్బోనేటెడ్ డ్రింక్స్, ఫ్లెవనాయిడ్ జ్యూస్ లు, పాలు, పెరుగు, పండ్లతో తయారుచేసిన జ్యూసులు వంటివని వేసవి సీజన్ లో అవాయిడ్ చేయాలి. ఇవి జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అంతే కాదు ఇవి శరీరంలో టాక్సిన్స్ ను క్రియేట్ చేస్తుంది. ఇమ్యూనిటి పవర్ ను తగ్గిస్తుంది. శరీరాన్ని కూల్ చేయడంలో ఇది ఒక బెస్ట్ ఆయుర్వేదిక్ టిప్ .

పుల్లని పండ్లకు దూరంగా ఉండాలి:

పుల్లని పండ్లకు దూరంగా ఉండాలి:

సోర్ ఫ్రూట్స్ (పుల్లని పండ్లు)కు దూరంగా ఉండాలి. ద్రాక్ష, దానిమ్మ, స్వీట్ మ్యాంగో, యాపిల్, పియర్స్, నల్ల ద్రాక్ష మొదలగు పుల్లని పండ్లకు దూరంగా ఉండాలి.

కోకనట్ వాటర్ :

కోకనట్ వాటర్ :

సమ్మర్ హీట్ ను బీట్ చేయడానికి ఇది ఒక గ్రేట్ వాటర్ కంటెంట్ . శరీరంను లోపలి నుండి కూల్ గా మార్చడంలో కోకనట్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది.

ఫార్మినేటెడ్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి:

ఫార్మినేటెడ్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి:

పెరుగు, పికెల్స్, బ్రెడ్స్, ఫార్మినేటెడ్ చీజ్ మరియు సోయా ప్రొడక్ట్స్ వంటివి అవాయిడ్ చేయాలి. ఇవి శరీరంలో వేడి పుట్టిస్తాయి. ఇంకా అజీర్ణం, హార్ట్ బర్న్ కు గురిచేస్తాయి. కాబట్టి, వీటికి దూరంగా ఉండటం మంచిది.

డైరెక్ట్ సన్ లైట్ మరియు ఎక్సెసివ్ యాక్టివిటీస్ కు దూరంగా ఉండాలి:

డైరెక్ట్ సన్ లైట్ మరియు ఎక్సెసివ్ యాక్టివిటీస్ కు దూరంగా ఉండాలి:

వేసవి సీజన్ లో ఎక్సెస్ వ్యాయామాలు, ఎండలో ఎక్కువగా తినడం నివారించాలి. బైక్ లో వెళ్లడం, రన్నింగ్ వంటివి చేయకూడదు. ఒక వేళ చేయాల్సి వస్తే ఉదయం, సాయంత్రాల్లో చేయాలి. బాడీ హీట్ ను తగ్గించుకోవడంలో ఇది బెస్ట్ ఆయుర్వేద టిప్ .

రూమ్ టెంపరేచర్ వాటర్ ను తాగాలి:

రూమ్ టెంపరేచర్ వాటర్ ను తాగాలి:

నార్మల్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ ను మాత్రమే తాగాలి. ఈ వాటర్ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. అవసరం అయితే ఆర్గానిక్ రోజ్ వాటర్, పుదీనా మిక్స్ చేసి తాగొచ్చు.

వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి :

వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి :

సమ్మర్ సీజన్ లో బెస్ట్ కలర్స్ కలిగిన, వదులైన దుస్తులను వేసుకోవాలి. వైట్ , గ్రే, బ్లూ, గ్రీన్ వంటి కలర్ దుస్తులను ధరించాలి. డార్క్ షేడ్స్ ఉన్న దుస్తులు త్వరగా వేడి గ్రహిస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. వేసవిలో నేచురల్ గా బాడీ హీట్ తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ మార్గం.

బాడీ మసాజ్ :

బాడీ మసాజ్ :

అన్ రిఫైన్డ్ కోకనట్ ఆయిల్ ను షవర్ చేయడానికి ముందు శరీరానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఉత్తేజం అవుతుంది. శరీరం చల్లటా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం బాడీ హీట్ తగ్గించుకోవడంలో ఇది కూడా ఒక ఎఫెక్టివ్ టిప్ .

English summary

10 Amazing Ways To Keep Your Body Cool According To Ayurveda

According to Ayurveda, "pitta" or body heat allows our metabolism to work normally. When the body heat becomes very high, it is called the "pita dosha". This sudden increase in body heat is undesirable and disrupts the body metabolism. It also causes chemical imbalance in the body.
Subscribe Newsletter