TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
కాఫీ ప్రయోజనాలు తెలిస్తే.. రోజూ తాగుతారు
వేడివేడిగా పొగలు కక్కే కాఫీ తాగడమంటే చాలామందికి ఇష్టం. ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీ పడితేనే ఆరోజు ప్రారంభం అయినట్లు కాఫీ ప్రియులు భావిస్తారు. కాఫీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు, రుచి ఉంది. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. అలాగే తలనొప్పికి కూడా గురువుతుంటారు. ఇంకా చాలా సమస్యలతో బాధపడుతుంటారు. వీటన్నింటి నుంచి ఉపశమనం కలిగించడానికి కాఫీ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండేు కెఫిన్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. పలు వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాదండోయో.. కాఫీ తాగితే మీరు ఆ సమయంలో ఉరకలేస్తారంట. మీలో అంగస్తంభన సమస్య కూడా ఉండదంట. అయితే కాఫీలో అనే ఆరోగ్య ప్రయోజనాలున్నా దీన్ని మోతాదుకు మించి తాగడం కూడా మంచిది కాదని గుర్తుంచుకోండి. మీరు ఏవైనా వ్యాధులతో బాధపడుతుంంటే దీన్ని తీసుకునే ముందు ఒకసారి డాక్టర్లను కూడా సంప్రదించాలి. ఇక కాఫీ వల్ల ఉండే 16 రకాల ఆరోగ్య ప్రయోజనాలనూ మీరూ తెలుసుకోండి.
1. మెదడు చురుగ్గా పని చేసేటట్లు చేస్తుంది
కాఫీ తాగగానే మీ మెదడుకు ఎక్కడలేని చురుకుదనం వస్తుంది. కెఫిన్ అనే పదార్ధం మెదడు కణాలను ప్రభావితం చేయగలదు. దీంతో అవి బాగా ఉత్తేజంగా పని చేస్తాయి. మీ మెదడుకు అవసరమయ్యే ఆక్సిజన్, రక్త సరఫరాను పెంచే సామర్థ్యం కూడా కెఫిన్ కు ఉంటుది. అందువల్ల మీ బ్రెయిన్ కాస్త చురుగ్గా పని చేయాలంటే మీరు ఆ సయమంలో కాఫీ తాగితే సరిపోతుంది.
2. అంగస్తంభన మెరుగవుతుంది
కాఫీ లో ఉండే కెఫిన్ పురుషులలకు బాగా పని ఉపయోగపతుంది. ఇది జననేంద్రియ అవయవాలకు రక్త సరఫరాను మెరుగుపరుచుతుంది. పురుషాంగానికి అవసరమయ్యే తాజా రక్తాన్ని అందించడానికి సహాయపడుతుంది. దీంతో పురుషాంగం ఉత్తేజితంగా పని చేస్తుంది. దీంతో అంగస్తంభన ఈజీగా అవుతుంది. లైంగిక సమస్యలు ఏవైనా ఉంటే కూడా పరిష్కారం అవుతాయి. తక్కువ మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల ఆ సమయంలో మీకు మంచి ఎనర్జీ వస్తుంది. మంచి శృంగార జీవితానికి కాఫీ తీసుకుంటే చాలు మరి. మీ శృంగార జీవితం ఎక్కడా బ్రేకులు లేకుండా సాఫిగా సాగిపోతుంది. అంగస్తంభన సమస్య ఉన్న పురుషులు కాఫీ తాగితే చాలా మంచిది మరి.
3. జ్ఞాపకశక్తి పెరుగుతుంది
కెఫిన్ మీ మెదడు కణాలు ప్రభావితంగా పని చేస్తాయి. మెదడు కణాలు మనం ఏదైనా విషయాన్ని నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తి పెంచడానికి, మన నాలెడ్జ్ పెంచడానికి బాగా పని చేస్తాయి. కాఫీ తాగే వారిలో జ్ఞాపకశక్తి సమస్యలు ఉండవు. డెమెన్షియా, అల్జీమర్స్ వ్యాధులకి మనం కాస్త దూరంగా ఉండవచ్చు.
4. తలనొప్పి తగ్గుతుంది
కాఫీ వల్ల మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అలాగే తలనొప్పి కూడా వెంటనే తగ్గుతుంది. ఒత్తిడి, సైనసిటిస్, గ్రాస్ట్రిక్స్ సమస్యల వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. అలాంటి సమయంలో ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగితే చాలు. మత్తుగా ఉండటం, ఏకాగ్రత లోపించటం, డిప్రెషన్, యాంగ్జైటీ, చిరాకు, తల తిరగటం వంటి సమయాల్లోనూ కాఫీ మనక బాగా పని చేస్తుంది. కాఫీ రక్తంలో పేరుకున్న గ్లూకోజ్ నిల్వలను కాఫీ కరిగిస్తుంది. దీనివల్ల చక్కెర వ్యాధి వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
5. టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కాస్త తగ్గిస్తుందంట
సాధారణంగా మధుమేహం వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. టైప్ - 1, టైప్ - 2. మధుమేహం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి తగ్గిపోతుంది. అయితే కాఫీలో ఉండే కెఫీన్ శరీరానికి అవసరమయ్యే ఇన్సులిన్ హార్మోన్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. కాఫీ అలవాటు లేనివారికి , కప్పు కాఫీ కంటే తక్కువ తాగేవారికి టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం ఉందంట.
6. కాలేయానికి బాగా ఉపయోగపడుతుంది
కాఫీలోని కెఫిన్ మెదడు కణాలను ఏవిధంగా చురుకుగా పని చేసేలా చేస్తోందో.. అలాగే కాలేయానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఉదయం ఒక కప్పు కాఫీని తాగడం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాఫీ మన కాలేయాన్ని వివిధ వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది. కాలేయం పనితీరు పూర్తిగా విఫలం కావడానికి కారణమయ్యే ప్రైమరీ స్కెల్రోసింగ్ కొలాంగిటీస్ (పీఎస్సీ) వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు కాఫీ తాగి కాలేయ ఆరోగ్యం కాపాడుకోండి.
7. కంటి చూపును మెరుగుపరుస్తుంది
కాఫీలో ఆరోగ్యకరమైన అనామ్లజనకాలు ఉంటాయి. ఇవి కంటి కణాలు ఉత్తేజంగా పని చేసేలా చేస్తాయి. కాఫీలోని క్లోరోజెనిక్ యాసిడ్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మూలంగా రెటీనా ఆరోగ్యకరంగా ఉంటుంది. మధుమేహం, గ్లూకోమా, వార్ధక్యం వంటి కారణాల వల్ల రెటీనా బలహీనపడుతుంది. కాఫీ తీసుకోవడం వల్ల ఎలాగూ చక్కెర తగ్గుతుంది కాబట్టి కంటిచూపు మందగించడం అనేది కూడా తగ్గుతుంది.
8. క్యాన్సర్ కు చెక్
మెదడుకు అందే రక్త ప్రసరణను "కెఫైన్" నియంత్రించడంతో పాటు ట్యూమర్ల పెరుగుదలను నిలిపివేస్తుంది. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక కణాల నుంచి మెదడును రక్షిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అనేవి వ్యాధులతో పోరాడే రసాయనాలు. కాఫీని రోజూ తీసుకుంటే అందులోని కెఫిన్ మన శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ధిని అరికట్టేందుకు సమాయపడతాయి. మెదడులోని ట్యూమర్స్, కాలేయం క్యాన్సర్, తదితర క్యాన్సర్లు రావు.
9. బరువు తగ్గుతారు
రోజూ కాఫీ తాగడం వల్ల మీ పొట్ట చుట్టు ఉండే కొవ్వు తగ్గుతుంది. అలాగే మీకు త్వరగా ఆకలి వేయదు. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తినకుండా ఇది సహాయపడుతుంది. అందువల్ల ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగుతూ ఉండండి.
10. దీర్ఘాయువు
రోజూ ఒక కప్పు వేడివేడి కాఫీ తాగితే మీరు ఎక్కువకాలం జీవిస్తారంట. కాఫీ మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మీలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీంతో చాలా వ్యాధుల బారిన మీరు పడకుంగా అవకాశం ఉంటుంది. దీంతో మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది.
11. సెక్స్ లైఫ్ మెరుగుపరుస్తుంది
కాఫీలో ఉండే కెఫిన్ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో మీరరు ఆసయంలో రెచ్చిపోవొచ్చు. ఇది ఆడవారిలో, మగవారిలో జననేంద్రియ అవయవాలకు రక్త సరఫరాను మెరుుగుపరుస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన ఆక్సిజన్ ను ఊపిరితిత్తులు సక్రమంగా అందించడానికి సహాయపడుతుంది.
12. ఆందోళనను తగ్గిస్తుంది
కొందిరిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాఫీలోని కెఫిన్ మెదడులోని కర్టిసోల్ హార్మోన్ల మెరుగుపరిచి ఆందోళనను తగ్గిస్తుంది. కాఫీ మనిషిలో త్వరగా స్పందించే గుణాన్ని, ఆలోచించే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. అంతేకాకుండా నిస్సత్తువను మాయం చేసి దాని స్థానంలో ఎంతో ఉత్సాహాన్ని కలుగజేస్తుంది.
ఆందోళన చెందుతున్నప్పుడు కాఫీ మంచి ఉపశమనాన్ని కలగిస్తుంది.
13. గుండెకూ మంచిదే
కాఫీ లో కెఫిన్ గుండెకు అవసరమయ్యే రక్తాన్ని అందించేందుకు సాయపడుతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోజూ ఓ కప్ కాఫీ తాగడం వల్ల గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. రక్తప్రసరణ మెరుగుకావడంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
14.నొప్పిని తగ్గిస్తుంది
కాఫీలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె సంబంధితనొప్పలును, కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే శరీరంలోని కొన్ని భాగాల్లో వచ్చే వాపులను కూడా కాఫీ తగ్గిస్తుంది. ఇలా కాఫీ ద్వారా చాలా వరకు నొప్పులు మటుమాయం అవుతాయి.
15. మలబద్దకం సమస్య పరిష్కారం అవుతుంది
కాఫీ మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మీ పేగులు సక్రమంగా పని చేసేలా చేస్తుంది. దీంతో మలబద్ధకం తగ్గుతుంది. అందువల్ల ఉదయం లేవగానే ఒకకప్పు కాఫీ తాగండి. మీ మలబద్దకం సమస్య కూడా పరిష్కారం అవుతుంది.
16. బ్రెయిన్ డిసీజెస్ ను తగ్గింస్తుంది
కాఫీలో కెఫిన్ కంటెంట్ మీ మెదడు కణాలను ఎక్కువ ఉత్తేజితంగా మారుస్తుంది. దీంతో మెదడు సంబంధిత వ్యాధుల బారిన మీరు పడే అవకాశం ఉండదు. డిమెంటియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన మీరుపడకుండా కాఫీ కాపాడుతుంది. అందువల్ల రోజూ ఒక కప్పు కాఫీ తాగండి. ఆరోగ్యంగా ఉండండి.