For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 20 రకాల ఆహారాలతో అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం

By Bharath
|

చాలామంది శరీరానికి పోషకాలు ఇచ్చే ఆహారాలుకాకుండా ఏవేవో తింటూ ఉంటారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కేవలం రుచి కోసమే వాటిని తినాలి. మరి శరీరానికి పోషకాలతో పాటు విటమిన్స్ అందించి వివిధ రోగాల నివారణకు ఉపయోగపడే ఆహారాలు ఏమిటనేది అందరి సందేహం. శరీరానికి మంచి శక్తిని ఇచ్చి, రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని బలంగా మార్చే కొన్ని రకాల ఫుడ్స్ గురించి తెలుసుకోండి.

వాటిని రెగ్యులర్ తీసుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే. మరి ఆ 20 రకాల ఫుడ్స్ అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వడమేకాకుండా అనేక రోగాలకు మంచి హోం రెమిడీస్ గా పని చేస్తాయి.

1. దానిమ్మ

1. దానిమ్మ

దానిమ్మ పండు వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఒక దానిమ్మపండులో పిండి పదార్థాలు 14.6 గ్రాములు, క్రొవ్వు పదార్థాలు 0.1 గ్రాము, మాంస కృత్తులు 1.6 గ్రాములు, కాల్షియం 10 మిల్లీగ్రాములు, భాస్వరం 70 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 12 మిల్లీగ్రాములు, ఇనుము 0.3 మిల్లీగ్రాములు, సోడి యం 4 మిల్లీగ్రాములు, పొటాషియం 171 మిల్లీ గ్రాములు, పీచు పదార్థం 5.1 మిల్లీగ్రాములు చొప్పున ఉంటాయి. చర్మ వ్యాధుల నివాణకు దానిమ్మ ఎంతో బాగా పని చేస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడంలోనూ ఇది నెంబర్ వన్. దానిమ్మపండు రసాన్ని చర్మానికి పూసుకుని స్నానం చేస్తే చర్మ సౌందర్యం పెరుగుతుంది. క్షయ, ఉబ్బసము, రక్తక్షీణత, మూత్రవ్యాధులు మూత్రపిండాల వాపు, చర్మ వ్యాధులు, జీర్ణకోశ సంబంధమైన వ్యాధులన్నీ దానిమ్మను తినడం ద్వారా అరికట్టవచ్చును.

గుండెజబ్బును అదుపుతో ఉంచేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. దంతక్షయాన్ని నివారించడంలోనూ ఇది నెంబర్ వన్. పసికర్లు, అధిక రక్తపోటు, బ్రాంఖైటిస్‌, కామెర్లు, హెపటైటిస్‌ తదితర వ్యాధుల నివారణలో దానిమ్మ బాగా పని చేస్తుంది. దానిమ్మపండు రసాన్ని రోజూ తాగితే గుండెకు చాలా మంచిది. అలాగే తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) సమస్యను ఇది తగ్గిస్తుంది.

2. తులసి

2. తులసి

భోజనం చేసిన తర్వాత తులసి ఆకులు నమలడం చాలా మంచిది. నోటికి సంబంధించిన అనేక వ్యాధులు రాకుండా తులసి నివారిస్తుంది. తులసి ఆకుల ద్వారా చాలా ప్రయోజనాలున్నాయి. దగ్గు నుంచి తులుసి ఆకులు ఉపశమనం కలిగిస్తాయి. లేత తులసి ఆకులను, అల్లంతో కలిపి తింటే చాలు.

తులసి ఆకుల రసం, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని చర్మంపై పూసుకుంటే మచ్చలను తొలుగుతాయి. పులియబెట్టిన తులసి రసాన్ని తాగటం వలన తలనొప్పి నుండి ఉపశమనం పొందుతారు. ఎలాకులు, అల్లం మరియు తులసి కలిపిన మిశ్రమం వాంతుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తేనె, అల్లం, తులసి కలిపినా మిశ్రమం శ్వాసనాళల్లో వాపులు, ఆస్తమా వంటి తగ్గుతాయి. తులసి ఆకులను మహిళలు గర్భధారణ సమయంలో తీసుకుంటే లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి.

MOST READ: వృషణాలకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలివే!

3. లవంగాలు

3. లవంగాలు

భోజనం తర్వాత ఒక్క లవంగాన్ని తింటే అజీర్తి సమస్య పరిష్కారం అవుతుంది. ఇది జీర్ణశక్తికి బాగా పని చేస్తుంది. లవంగాలు ఊపిరితిత్తుల కేన్సర్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. వీటిలో యాంటీబ్యాక్టీరియల్ గుణం ఎక్కువగా ఉంటుంది. లవంగ నూనె నోటికి సంబంధించిన రోగాలను నివారిస్తుంది. లవంగాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించగలవు.

డయాబెటీస్ ను లవంగాలు అదుపులో ఉంచగలవు. మంచి ఫలితాలు కనిపించినట్లు మరియు లవంగం నుంచి లవంగాలు రోగ నిరోధక శక్తి మెరుగుపరుస్తాయి. లవంగాలు పంటి నొప్పి ని తగ్గిస్తుంది. దగ్గు నివారణకు బాగా పని చేస్తాయి. కడుపు లో వికారంగా ఉంటే లవంగాల నూనె ను తీసుకోండి. లవంగాలు జలుబు నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తాయి. తులసి, పుదీనా ,లవంగాలు ,యాలకుల మిశ్రమంతో టీ లా చేసుకుని తాగితే నరాలకు మంచి శక్తి వస్తుంది. ఒత్తిడి, ఆయాసం నివారణకు లవంగాలు పని చేస్తాయి.

4. వెల్లుల్లి

4. వెల్లుల్లి

వెల్లుల్లి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లిని రోపూ మన ఆహార పదార్థంలో చేర్చుకోవటం వలన శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. వెల్లుల్లి రసాన్ని కొద్దిగా తాగితే చాలు.. రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. వెల్లుల్లి రసం జుట్టు రాలటాన్ని కూడా తగ్గిస్తుంది. రాలిన వెంట్రుకలు మళ్ళి పెరిగేలా చేస్తుంది.

వెల్లుల్లి రసం మొటిమలను నివారిస్తుంది. వెల్లుల్లి రసాన్ని రోజు తాగటం వలన ఆస్తమా వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, గొంతు నొప్పి నివారణకు వెల్లుల్లి రసం బాగా పని చేస్తుంది. ఒక గ్లాసు దానిమ్మ రసంలో వెల్లుల్లి రసాన్ని కలుపుకొని తాగితే చాలు దగ్గు నుంచి ఉపశమనం పొందుతారు. ఉదయం రోజు ఖాళీ కడుపున వెల్లుల్లిని తింటే ఉదర, గ్యాస్ట్రిక్ సమస్యలు తొలుగుతాయి.

5. పుచ్చకాయ

5. పుచ్చకాయ

ఇవి వేసవిలో మన దాహార్తిని తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే బీటా కెరొటిన్, విటమిన్ బి, సి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాసియం, అయోడిన్‌ పుచ్చకాయలో ఎక్కువగా ఉంటాయి.

పుచ్చకాయ రసాన్ని తాగితే మాంసాహారం తినడం వల్ల ఏర్పడిన కొన్ని వ్యర్థాలు శరీరం నుంచి బయటకు పోతాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారికి పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది. ఇందులోని అమినో ఆమ్లాలు గుండెకు సంబంధించిన కండరాలని సడలించి రక్త సరఫరా సక్రమంగా అయ్యేట్లు చేస్తాయి. పుచ్చకాయ రసాన్ని తాగితే తలనొప్పి తగ్గిపోతుంది.

6. ఆపిల్

6. ఆపిల్

ఉదయం పరగడుపున ఆపిల్ తింటే చాలా ప్రయోజనాలున్నాయి. మైగ్రెయిన్ నొప్పి నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. ఆపిల్ రోజూ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు. మతిమరుపు వ్యాధిని పొగొట్టే గుణాలు ఆపిల్ లో ఉంటాయి. ఆపిల్ తినటం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలో కొవ్వు పదార్థాలను ఇది కరిగించి వేస్తుంది.

ఆపిల్ పండు వలన పురీషనాళం, చర్మ, రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ లను నిరోధించగలుగుతుంది. వయసు మీరిన వాళ్ళలో వచ్చే డిమెంటియాని ఆపిల్ తగ్గిస్తుంది. మెదడును చురుగ్గా ఉంచేలా చేస్తుంది. విటమిన్ ఏ, సీ, ఈ,కే, ఫోలేట్ వంటివి ఇందులో పుష్కలంగా ఉంటాయి. గుండెజబ్బుల నుంచి ఆపిల్ రక్షించగలదు. రోజూ ఒక ఆపిల్ తింటే కంటిచూపు మెరుగవుతుంది.

7. ఖర్జూర

7. ఖర్జూర

అర లీటర్ పాలను 25 నిమిషాల సేపు మరిగించండి. అందులో 6 ఖర్జూరాలను వేయండి. ఆ పాలను కొద్దికొద్దిగా రెండు మూడు సార్లు తాగితే పొడి దగ్గు పరారువుతంది. అలాగే ఖర్జూరాను రోజూ తింటే చాలా ప్రయోజనాలున్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు కరిగించేందుకు ఖర్జూరపండు బాగా పని చేస్తుంది.

ఖర్జూరలో విటమిన్ ఎ,బీ ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుటలో ఖర్జూరాలు ఉపయోగపడతాయి. ఖర్జురాల వల్ల ఎముకలు బలంగా, పటుత్వంగా మారుతాయి. రాత్రి పాలల్లోఖర్జూర పండ్లు వేసి మరగబెట్టి, రాత్రి నిద్రించే ముందు తాగుతూ ఉంతే మలబద్దకము తగ్గుతుంది. ఖర్జూర పండ్లు భోజనము తర్వాత తీసుకుంటూ ఉంటే నీరసము, నిస్సత్తువ పోతుంది.

ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారం గా తీసుకుంటూ ఉంటే రక్తం వృద్ధి చెందుతుంది. మూత్ర సమస్యలను ఖర్జూర పోగొడుతుంది. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం వంటి వాటికి ఈ పండు మంచి మందు.

8. అల్లం+ తేనే

8. అల్లం+ తేనే

కొద్దిగా అల్లం రసం తీసుకోండి. అందులో రెండు స్పూన్ల తేనె కలపండి. దీన్ని తాగితే సాధారణ జలుబు, దగ్గు, గొంతుకు సంబంధించిన వ్యాధులన్నీ దూరం అవుతాయి. కడుపు ఉబ్బరానికి అల్లం చెక్ పెడుతుంది. అలాగే అరస్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనారసం, ఒక స్పూన్ తేనె ఈ నాలుగింటిని కలిపి.. ప్రతి రోజూ ముడు పూటలా తీసుకుంటే.. పిత్త సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. అల్లం రసంతో తేనెను కలుపుకుని రోజుకు మూడు పూటలా స్పూన్ మోతాదులో తీసుకుంటే జలుబు మటాష్ అవుతుంది.

అల్లం, తేనె కాంబినేషన్‌లో కంటి కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టవచ్చు. అల్లం పేస్ట్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి కళ్ళ క్రింది భాగంలో మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముడుతలను నివారిస్తుంది.

MOST READ:ఓర్పు, సహనానికి మారుపేరైన సీతను వెంటాడిన వివాదాలు !!

9. చిలగడ దుంపలు

9. చిలగడ దుంపలు

చిలగడ దుంపల్లో ఫైబర్, విటమిన్లు ఎ,సి,డి, కాల్షియం, పొటాషియం, ఐరన్‌లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తింటే కళ్లకు చాలా మేలు. కెరొటినాయిడ్లు, బీటా కెరొటిన్లు, విటమిన్‌ ఎ వీటిలో లభిస్తాయి. చిలగడ దుంపల్లో విటమిన్‌ బి6 సమృద్ధిగా లభిస్తుంది. గుండె సంబంధితి వ్యాధులను ఇది నివారిస్తుంది.

ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. విటమిన్‌ సి కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఎముకల్నీ, దంతాలను ఇవి దృఢంగా ఉంచుతాయి. రోజూ ఓ ఉడికించిన దుంప తీసుకుంటే ఎంతో మేలు.

10. దగ్గుకు మంచి ఔషధం

10. దగ్గుకు మంచి ఔషధం

ఉల్లిపాయ రసం, తేనె రెండింటిని సమభాగంలో తీసుకొని రెండూ బాగా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఉల్లిపాయను రెండుగా కట్‌చేసి ఒక టేబుల్‌స్పూన్ బ్రౌన్ షుగర్ అప్లయ్ చేయాలి.

ఇలా ప్రతీ లేయర్‌కు అప్లయ్ చేసిన తర్వాత రెండు భాగాలను క్లోజ్ చేయాలి. దానిని ఒక జార్లో పెట్టాలి. ఒక గంట తర్వాత బయటకు తీసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు తగ్గుముఖం పడుతుంది.

11. దోసకాయ

11. దోసకాయ

దోసకాయలో విటమిన్ బీ, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేటేడ్'గా ఉంచుతుంది. అలాగే దోసకాయలు తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కేవలం 15 నిమిషాల పాటూ కళ్ళపై, తాజా దోసకాయ ముక్కలను ఉంచితే చాలు.

మధుమేహ వ్యాధి గ్రస్తులు, దోసకాయ రసాన్ని తాగితే మంచిది. బరువు తగ్గించడానికి కూడా దోసకాయ బాగా ఉపయోగపడుతుంది. దోసకాయను రోజు తింటే జుట్టు బాగా పెరుగుతుంది.

12. రక్తహీనత

12. రక్తహీనత

శరీరంలో బ్లడ్ కౌంట్ తక్కువైతే ఎనీమియా అంటే రక్తహీనత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఐరన్‌పాళ్లు లేకపోవడం, విటమిన్ డెఫిషియెన్సీ వల్ల ఇది ఏర్పడుతుంది. తోటకూర, గోంగూర, పాలకూర, మెంతి కూర లాంటివి రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరాలు వంటి పదార్థాల్లో కూడా ఇనుము పుష్కలంగా లభిస్తుంది.

మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్ సి ఎక్కువగా వుండే నిమ్మ, ఉసిరి, జామ లాంటివి తీసుకోవాలి. బీట్ రూట్ ఆకులలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి బీట్ రూట్ రోజూ తినే ఆహారంలో భాగంగా చేసుకోవాలి. నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. అరటిపండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్‌మిస్, ఉల్లి, క్యారట్, ముల్లంగి, టొమాటోలు తీసుకోవాలి.

13. నల్లటి వలయాలు

13. నల్లటి వలయాలు

కళ్ల కింది వలయాలను ఈ విధంగా తొలగించుకోవొచ్చు. టమాట మన ఇంట్లో ఉండే నిత్యవసర వస్తువు. ఒక టమాట, ఒక టేబుల్ స్సూన్ నిమ్మరసం, చిటికెడు పెసర లేదా శెనగిపిండి, చిటికెడు పసుసు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ చిక్కటి పేస్ట్ ను మీ కళ్ళ చుట్టూ అప్లై చేయాలి. 20నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడు సార్లు చేస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

అలాగే కీరదోస రసం, నిమ్మరసం, టమాటా జ్యూస్ అన్నిటినీ కలిపి వలయాల చుట్టూ రాసి, 15 నిమిషాల తర్వాత కడిగితే సరిపోతుంది. అలాగే ఒక చెంచా తాజా నిమ్మకాయ రసం మరియు టమాట రసాన్ని కలపండి. ఈ మిశ్రమానికి ఒక చెంచా శనగపిండిని కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, కళ్ళ కింద పూసి కనీసం 10 నుండి 15 నిమిషాల వరకు వేచి ఉండండి. కొన్ని రోజులలోనే గమనించతగ్గా మార్పులను గమనిస్తారు.

14. గొంతులో గరగరా

14. గొంతులో గరగరా

గొంతులో గరగరా అనిపించడం లేదంటే గొంతులో కాస్త ఇబ్బందిగా అనిపించినా కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. ½ కప్ వేడి నీరు తీసుకోండి. ½ టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకోండి. ¼ స్పూన్ పసుపు తీసుకోండి. వీటన్నింటినీ మిక్స్ చేయండి . ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కలించి ఉమ్మి వేయండి. మింగకండి. తాగకండి. అయితే దీని తర్వాత అరగంట వరకు ఏమి తినకండి. తాగకండి. ఇలా చేయడం వల్ల ఈ రెమిడీ బాగా పని చేస్తుంది. మీరు ఒక రోజులో పలుమార్లు ఇలా చేస్తూ ఉంటే చాలు సమస్య పరిష్కారమువుతుంది.

15. చెవినొప్పి

15. చెవినొప్పి

మీరు చెవినొప్పితో బాధపడుతూ ఉంటే ఒక చుక్క వెల్లుల్లి రసాన్ని చెవిలో వేసుకోండి. ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. వెల్లుల్లిరసం ఇందుకు చాలాబాగా పని చేస్తుంది.

16. దుర్వాసన పోతుంది

16. దుర్వాసన పోతుంది

బేకింగ్ సోడా, నిమ్మ రసాన్ని సమపాళ్లల్లో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ చంకల్లో పూసుకోవడం వల్ల శరీర దుర్వాసన అనేది ఉండదు. మీ నుంచి మంచి సువాసన వెదజల్లుతుంది.

17. సోంపు

17. సోంపు

నీళ్లలో కొన్ని సోంపు గింజలను వేయండి. ఆ నీళ్లను తక్కువ మంటపై ఐదు నిమిషాల పాటు మరిగించండి. తర్వాత చల్లగయ్యాక ఆ మిశ్రమాన్ని తాగండి. అలాగే తాజా సోంపు ఆకులను నమలవచ్చు. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. కొన్ని నీళ్లలో సోంపు ఆకులు వేసి, ఆ నీళ్ళు సంగం అయ్యే వరకూ మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటితో అప్పుడప్పుడు కళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

18. నిమ్మకాయ

18. నిమ్మకాయ

నిమ్మ లో 'విటమిన్ సి' పుష్కలంగా ఉంటుంది. రోజూ ఉదయం వేడి నీటిలో కాస్తంత నిమ్మరసం పిండుకుని తాగితే జీర్ణవ్యవస్థ పరిశుభ్రమవుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గ్లాసు నిమ్మరసం తాగితే ఫ్లూ, జలుబుల నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే, రక్తాన్ని శుద్ధీకరించడమే కాకుండా శరీరంలోని విషతుల్య ద్రవాన్ని బయటకు విడుదల చేయడంలోనూ దోహదపడుతుంది. నిమ్మతో చాలా ప్రయోజనాలున్నాయి.

19. హ్యాంగోవర్

19. హ్యాంగోవర్

అరటి మిల్క్ షేక్ లో తేనే కలుపుకుని తాగడం వలన హ్యాంగోవర్ బారి నుంచి అతి తొందరగా కోలుకోవచ్చు. అరటి మీ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. తేనే రక్తంలో చక్కర శాతాన్ని సమపాళల్లో ఉంచుతుంది. పాలు మీ శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తాయి.

20. దగ్గు

20. దగ్గు

తులసి రసంలో కాస్త తేనె, వెల్లుల్లి రసాన్ని కలపాలి. దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీంతో దగ్గు మటుమాయం అవుతుంది. రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఇలా చేయాలి.పదకొండు తీసుకుంటారు.

English summary

20 Best Home Remedies For Good Health Everyone Should Know

Here 20 Best Home Remedies For Good Health Everyone Should Know