మీ ఓవర్ వెయిట్ కు కారణం: రాత్రుల్లో మీకున్నఈ 7 అలవాట్లే..!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీరు ఆరోగ్యంగా ఉండి బరువు తగ్గటానికి మార్గాలను ప్రయత్నిస్తున్నప్పటికీ బరువు పెరుగుతున్నారా? దీనికి మీ నిర్లక్యం ఒక కారణం కావచ్చు. మీరు ఉదయం సాధారణ పనులను కూడా చేసుకోవటం కష్టంగా ఉంటే, అప్పుడు బెడ్ టైమ్ దైనందిన చర్యల గురించి ఆలోచించండి. మీరు బరువు పెరగటానికి అనేక బెడ్ టైమ్ అలవాట్లు కారణం కావచ్చు.

వీటిలో చాలా నిద్ర వ్యవధి మరియు నిద్ర నాణ్యతతో సంబంధం కలిగి ఉంటాయి.నిద్రను ప్రభావితం చేసే అంశాల మీద దృష్టి పెట్టాలి. మీరు డిన్నర్ చేయటం దగ్గర నుంచి పడుకొనే వరకు అన్ని పనుల మీద దృష్టి పెట్టాలి. బరువు పెరగటానికి డిన్నర్ ఎంపిక మరియు సాంకేతికతకు సంబంధం ఉంది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు బెడ్ మీద గాడ్జెట్లతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. బాల్యంలో ఊబకాయం రావటానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి.

ఆరోగ్యకరమైన బెడ్ టైం దైనందిన చర్యలను అనుసరించండి. మీ శరీరం ఎలా ప్రతిస్పందిస్తుందో చూడండి.

మీరు నెలలోపే చెప్పుకోదగిన మార్పును చూడవచ్చు.

ఇక్కడ మేము బరువు పెరగటానికి కారణమైన బెడ్ టైమ్ అలవాట్ల గురించి చర్చిస్తున్నాం.

1. బెడ్ ముందు భారీ భోజనం

1. బెడ్ ముందు భారీ భోజనం

బెడ్ ముందు భారీ భోజనం చేయటం అనేది చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే ఎక్కువగా భోజనం చేస్తే జీర్ణ వ్యవస్థ బిజీగా మారుతుంది. మీరు పడుకున్నప్పుడు జీవక్రియ నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి పడుకొనే ముందు భారీగా భోజనం చేస్తే శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదు.

2. డిన్నర్ చేసిన వెంటనే పడుకోవటం

2. డిన్నర్ చేసిన వెంటనే పడుకోవటం

డిన్నర్ చేసిన వెంటనే పడుకొనే అలవాటు ఉంటే కనుక ఆ అలవాటును వెంటనే మానేయాలి. డిన్నర్ చేసిన తర్వాత కనీసం అరగంట నడవాలి. జీర్ణ ప్రక్రియ సులభంగా మరియు సమర్ధవంతంగా జరగటానికి సహాయపడుతుంది. ఇది బరువు పెరగటానికి బెడ్ టైమ్ అలవాట్లలో ఒకటి.

3. పడుకొనే ముందు హై క్యాలరీ ఫుడ్ తీసుకోవటం

3. పడుకొనే ముందు హై క్యాలరీ ఫుడ్ తీసుకోవటం

హై క్యాలరీ ఫుడ్ తీసుకుని పడుకుంటే కేలరీల ఉపయోగం ఉండదు కాబట్టి శరీరంలో కొవ్వు నిల్వ ఉండిపోతుంది. కాబట్టి అధిక క్యాలరీ ఫుడ్ తీసుకోవటం వలన బరువు పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంది. రాత్రి పడుకొనే ముందు సలాడ్లు లేదా పండ్లు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవాలి.

4. పడుకొనే ముందు ఫోన్ ఉపయోగించకూడదు

4. పడుకొనే ముందు ఫోన్ ఉపయోగించకూడదు

రాత్రి సమయంలో శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. ఆ సమయంలో శరీరంలో నిర్విషీకరణ మరియు అనేక నిర్వహణ విధులు జరుగుతాయి. కాబట్టి పడుకునేటప్పుడు ఫోన్ ఉపయోగిస్తే నిద్ర నాణ్యత మరియు వ్యవధి మీద ప్రభావం చూపుతుంది. దాని ఫలితంగా బరువు పెరుగుతాం.

5. డిన్నర్ తరువాత స్నాక్స్

5. డిన్నర్ తరువాత స్నాక్స్

డిన్నర్ తరువాత స్నాక్స్ తినే అలవాటు ఉందా? ఇది బరువు పెంచే బెడ్ టైం అలవాట్లలో ఒకటి. మీకు కడుపు నిండిన భావన కలగాలంటే డిన్నర్ లో ఫైబర్ ఉన్న కూరగాయలను చేర్చండి.

6. మద్యం తీసుకోవటం

6. మద్యం తీసుకోవటం

పడుకొనే ముందు మద్యం తీసుకోవటం అనేది బరువు పెరిగే బెడ్ టైమ్ అలవాట్లలో ఒకటి. ఇది బరువు పెరగటం మరియు జీవక్రియ మీద ప్రభావం చూపుతుంది. ఇది ఖచ్చితంగా బరువును పెంచే బెడ్ టైమ్ అలవాట్లలో ఒకటి.

7. చాలా ఆలస్యంగా పడుకోవడం

7. చాలా ఆలస్యంగా పడుకోవడం

త్వరగా పడుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. మీరు లేటుగా పడుకొని ఉదయం లెట్ గా లేస్తే బ్రేక్ ఫాస్ట్ ని మానేయటం జరుగుతుంది. రోజు సమయంలో అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు కోరికలను ప్రేరేపిస్తాయి. అందువల్ల ఆహార ఎంపికలు కూడా ముఖ్యమే.

ఆరోగ్యకరమైన నిద్రవేళ అలవాట్లను అనుసరిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు.

English summary

7 Surprising Bed-time Habits That Make You Gain Weight

Certain bed-time habits lead one to gain weight. This article explains about a few of these habits which one needs to avoid to prevent weight gain.
Subscribe Newsletter