For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శరీరం ఈ రంగుల్లోకి మారితే ప్రమాదకరం

By Bharath Reddy
|

మన శరీరంపై ఏర్పడే పలు రంగులు మన ఆరోగ్య లోపాల్ని సూచిస్తాయి. సాధారణంగా ఉండాల్సిన రంగులో కాకుండా వేరే కలర్ లోకి శరీరంలోని అవయవాలు మారితే అది అనారోగ్యానికి సూచికగా పేర్కొనవచ్చు. పెదవులు నీలం రంగులోకి మారినా.. కళ్లు పసుపురంగులోకి మారినా మీరు అనారోగ్యానికి గురైనట్లు సూచిక. ఇలా మనం శరీరంపై ఏర్పడే తొమ్మిది రకాల రంగులు చాలా ప్రమాదకరం. మీరు అవయవాలు ఆ రంగులోకి మారినట్లయితే వెంటనే మీరు డాక్టర్ ని సంప్రదించాలి.

తెలుపు :

తెలుపు :

మీ శరీరంపై అక్కడక్కడ తెల్ల మచ్చలు ఏర్పడడం లేదా శరీరం తెల్లగా మారడం కొన్ని రకాలు అనారోగ్యాలకు సూచనగా చెప్పవచ్చు. మీ చర్మంపై అక్కడక్కడ బిళ్లబిళ్లలుగా తెల్ల మచ్చలు ఏర్పడితే అవి కాస్త ప్రమాదమకరమని తెలుసుకోవాలి. ఇవి టినియా వెర్సిలర్, విటలిగో లేదా తామరని సూచిస్తాయి. మీ శరీరంపై ఎక్కడైన ఇలాంటి తెల్ల మచ్చలు వస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. మీ గోళ్లపై కూడా తెల్లని మచ్చలు వస్తాయి. ఇందుకు కారణం జింక్ లోపం. ఆర్సెనిక్ వంటి ప్రమాదకరమైన రసాయనం కూడా ఇందుకు కారణం అవుతుంది. అందువల్ల మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిది.

పసుపు :

పసుపు :

పసుపు రంగు మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు సీతాకోక చిలుకల రెక్కలు, పొద్దుతిరుగుడు పూల రేకులపై ఉండే పసుపు వర్ణం అద్భుతంగా ఉంటుది. కానీ మీ కళ్లు పసుపుపచ్చ రంగులోకి మారితే అది కాస్త ప్రమాదకరమని గుర్తించాలి. తెల్లగా ఉండాల్సిన మీ కళ్లు అలా పచ్చగా అయిపోయాయంటే మీరు అనారోగ్యానికి గురయ్యారని గమనించాలి. మీరు వెంటనే డాక్టర్ ను కలిసి సమస్య ఏమిటో తెలుసుకోవాలి.

సాధారణంగా కళ్లు పసుపు రంగులోకి మారడానికి కారణం..

మీరు కామెర్లు (జాండీస్) వ్యాధితో బాధపడడమే. రక్తంలో అధికంగా బిలిరుబిన్ ఉండడం వల్ల ఈ వ్యాధి బారినపడతారు. అలాగే చర్మం, గోర్లు కూడా పసుపు రంగులోకి మారుతాయి.

నీలంరంగు :

నీలంరంగు :

మీ పెదవులు నీలరంగులోకి మారాయా? అయితే మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని దీని అర్థం. అలాగే మీ బాడీ కూడా కాస్త నీలం రంగులోకి మారినట్లయితే మీ శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేదని అర్థం. టెట్రాలాజీ ఫాలోట్ వంటి సింటమ్స్ వల్ల శరీరం నీలంరంగులోకి మారుతుంది. అలాగే పుట్టుకతో ఏర్పడే గుండె సంబంధిత వ్యాధులకు కూడా ఇది కారణం అవుతుంది.

పర్పుల్ :

పర్పుల్ :

మీ చర్మంపై పర్పుల్ (ఊదారంగు) పాచెస్ ఉంటే మీరు వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. మీ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉందో చెక్ చేయించుకోవాలి. మీ చర్మం కింద రక్తనాళాల పని తీరు సక్రమంగా లేకపోవడం వల్ల సాధారణంగా పర్పుల్ కలర్ ప్యాచ్ లు ఏర్పడుతాయి. ఒకవేళ పిల్లలను లేదా పెద్దల ముఖంపై లేదా శరీరంపై ఇలాంటి ఊదా రంగు గాయాలు కనబడితే వారిని ఎవరైనా కొట్టారేమో కనుక్కోండి. సాధారణంగా ఎవరైనా బలంగా ముఖంపై కొడితే కూడా చర్మం అలా కందిపోతుంది.

ఆకుపచ్చ :

ఆకుపచ్చ :

కళ్లకు హాయినిచ్చే రంగు ఆకుపచ్చ రంగు. అయితే మీ పసుపు రంగులో మీ ముక్కు నుంచి చీముడి వస్తుంటే మాత్రం అది కాస్త ప్రమాదకరమైన విషయం అని గుర్తించుకోవాలి. ఇది సైనసిటిస్, బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి లక్షణాలను సూచిస్తుంది. అలాగే గ్రీనీస్ వజినల్ డిశ్చార్జి అనేది

ట్రినిమోనియనిసిస్ వంటి వాటి వల్ల వస్తుంది. అలాగే మీ మలం ఆకుపచ్చరంగులో వస్తున్నట్లయితే జీర్ణశయాంతర సమస్యలకు సూచిక. అలాగే క్రోన్ స్ వ్యాధి లేదా పలు బ్యాక్టీరియా, వైరస్ ల దాడిని కూడా ఇది సూచిస్తుంది.

నలుపు :

నలుపు :

ఇక మీ శరీరంలో ఏదైనా పార్ట్ నల్లగా మారితే అది కూడా అనారోగ్యానికి సూచిక. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది గ్యాంగ్రేన్ లేదా కణజాల నశించిపోవడానికి సూచన. ఎప్పుడైతే ఒక శరీర భాగానికి రక్త సరఫరా నిలిచిపోతుందో అప్పుడు అది నలుపు రంగులోకి మారుతుంది. అలాగే నలుపు రంగులో మలం వస్తున్నట్లయితే అది జీర్ణ వ్యవస్థ పనితీరు సక్రమంగా లేదని సూచిస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థకు పైన ఉన్న భాగం లో రక్తస్రావం జరుగుతుందని సూచిక.

బ్రౌన్ :

బ్రౌన్ :

సాధారణంగా అనారోగ్యానికి గురైన వ్యక్తి మూత్రం లేత పసుపు రుంగులో ఉంటుంది. కానీ అది ముదురు గోధుమ రంగులో ఉంటే మాత్రం.. మూత్ర నాళంలో రక్త స్రావం, హేమోలిటిక్ రక్తహీనతవంటి లక్షణాలకు సూచిక. అలాగే హెపటైటిస్, మెలనోమా వంటి పరిస్థితులకు కూడా ఇది దారితీస్తుంది. మీరు తీవ్రంగా డీహైడ్రేటెడ్ గురైతే ఈ సమస్య తలెత్తుంది.

ఆరెంజ్:

ఆరెంజ్:

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరెంజ్ కలర్ లో ఉంటారు. ఈ విషయంలో ఆయనను చాలామంది ఎగతాళి చేశారు. అయితే ఆయన చర్మం మొత్తం అలా మారడానికి వేరే కారణాలు ఉండొచ్చు. సాధారణంగా నాణ్యతలేనటువంటి టానింగ్ స్ప్రేలు, టానింగ్ క్రీమ్స్ వల్ల చర్మం ఇలా ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది. రక్తంలో కెరోటిన్ పెరుగుదల కారణంగా ఏర్పడే కరోటినాసిస్ కూడా చర్మం ఆరెంజ్ కలర్ లోకి మారడానికి కారణం కావొచ్చు. ఇలా చర్మం ఆరెంజ్ కలర్ లోకి మారితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

ఎరుపు :

ఎరుపు :

ఎరుపు అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఇది డేంజర్. అవును ఇది నిజంగా ప్రమాదానికి సూచికనే. ఎక్కడా రక్తస్రావం అవుతుందని మీరు సూచిస్తున్నందున ఈ రంగు ఎక్కడైనా భయపడవచ్చు. ఎరుపు లేదా పింక్ కలర్ లో మూత్రం వస్తున్నట్లయితే అది రక్త సమస్యలకు సూచిక. చర్మంపై ఎక్కడైన ఎర్రటి బిళ్లలు ఏర్పడితే.. ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ ఎక్కువగా ఉందని అర్థం. ఎరిథేమా వంటి వాటికి కూడా ఇదే కారణం. అలాగే శరీరంలోని పార్ట్స్ ఎర్రగా మారుతున్నట్లయితే కళ్ల కలక, అలెర్జీలు, స్క్లేరిటిస్ లేదా యువెటిస్ను సూచిస్తాయి.

English summary

9 colours that indicate SERIOUS health concerns

Blue eyes and red lips wouldn't seem so great if the colours were interchanged would they? Here are nine colours don't come bearing good news. If you see them, give your doctor a call.The colour white can be a cause for concern if you spot it on your skin.The sunshine colour is a treat to behold on a butterfly's wings or on the petals of a sunflower, but not on your sclera! If the whites of your eyes turn yellow, rush to the doctor's office.If there is a colour that is soothing to the eyes, it is green.Bright greenish-yellow phlegm could mean sinusitis, bronchitis or even pneumonia.
Story first published:Tuesday, November 7, 2017, 11:46 [IST]
Desktop Bottom Promotion