For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇవి ఆరోగ్యానికి మంచివే, కానీ ఓవర్ గా తింటే హాస్పటల్ పాలవ్వడం ఖాయం..!!

ది. ఏ ఆహారాలైనా, ఆరోగ్యానికి ఎంత మేలు చేసేవైనా పరిమితికి మించి తీసుకుంటే హాస్పటల్ పాలవ్వక తప్పదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా..

|

సహజంగా సీజన్ బట్టి ఆహారాలు తినాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఆయా సీజన్స్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్, వ్యాధులతో పోరాడాలంటే సీజనల్ ఫుడ్స్ తప్పకుండా సహాయపడుతాయి. సీజనల్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధకతను పెంచుకోవచ్చు. ఎలాంటి ఆహారాలైనా సరే ఎక్సెస్ గా తీసుకున్నా మంచిది కాదు. పరిమితంగా తీసుకోవడం మంచిది. కొంత మంది టమోటోలు మంచిదని అన్ని రకాల సలాడ్స్ లో జోడిస్తుంటారు. ఎక్సెస్ అయితే ప్రమాదం తప్పదు.

అలాగ టమోటాలకు బదులుగా బ్రొకోలీ, ఆకుకూరలు రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా తీసుకుంటే మరింత మంచిదని భావిస్తే తప్పే అవుతుంది. ఏ ఆహారాలైనా, ఆరోగ్యానికి ఎంత మేలు చేసేవైనా పరిమితికి మించి తీసుకుంటే హాస్పటల్ పాలవ్వక తప్పదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, ఆరోగ్యానికి మేలు చేసేవే అయినా..కొన్ని ఆహారాలను ఓవర్ గా తినడం వల్ల అనారోగ్యానికి గురి అవుతారని నిపుణుల హెచ్చరిక.

ఈ క్రింది సూచించిన ఆహారాలు ఓవర్ గా తింటే ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాగని పూర్తిగా మానేయక్కర్లేదు. పరిమితంగా తీసుకుంటే మంచిది. మరి ఆ ఆహారాలేంటో ఒక సారి తెలుసుకుందాం..

కొంబరి బోండాం:

కొంబరి బోండాం:

కొబ్బరి బోండాంలో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. టండర్ కోకనట్ వాటర్ పరిమితంగా తాగితే డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు. అయితే పరిమితికి మంచి తాగితే, శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్, పొటాషియం లెవల్స్ ను పెంచుతుంది. ఇంకా బరువు పెరగడానికి కారణమవుతుంది.

పాలు :

పాలు :

పాలు కొంత మంది అలర్జీ కలిగిస్తాయి. అలాంటి వారు పాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే పాలు పరిమితికి మంచి తాగడం వల్ల ఇన్ఫ్లమేషన్ కారణమవుతుంది. ఎముకలు బలహీనతగా మారి విరిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సమస్య ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది.

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిదే, పరిమితికి మించి తీసుకోకపోవడమే మంచిది. దాల్చిన చెక్క పరిమితికి మించి తీసుకుంటే, లివర్ డ్యామేజ్ అవుతుంది. క్యాన్సర్స్ కు కారణమవుతుంది.

కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకోలీ:

కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకోలీ:

క్రూసిఫెరస్ కుటుంబానికి చెందిన ఈ గ్రీన్ టీఫీ వెజిటేబుల్స్ వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరగుతుంది. అయితే పరిమితికి మించి తీసుకోవడం వల్ల, సోడియం గ్రహించడంలో కష్టంగా మారడం వల్ల హైపోథైరాయిడిజం లేదా లోథైరాయిడిజంకు కారణమవుతుంది.

టమోటోలు :

టమోటోలు :

టమోటోల్లో విటమిన్ సి అధింగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. అయితే టమోటోల్లో ఉండే అసిడిక్ కంటెంట్ వల్ల ప్రికెన్సేరియస్ కండీషన్ (బ్యారెట్ ఈసోఫాగస్ కు )దారితీస్తుందని నిపుణుల హెచ్చరిక.

సోయ:

సోయ:

సోయాను పరిమితిమికి మంచి తినడం వల్ల శరీరంలో ఐరన్ గ్రహించడంలో ఇబ్బంది కలగించడంతో అనీమియాకు దారితీస్తుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఆక్సలేట్ అధికంగా ఉండటం వల్ల , పరిమితికి మించి తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కు దారితీస్తుంది.

అరటిపండ్లు :

అరటిపండ్లు :

అరటిపండ్లు ఆరోగ్యానికి మంచిదే అయితే పరిమితికి మించి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ హార్ట్, నాడీవ్యవస్థ, మజిల్స్ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీని రోజూ ఒకటి రెండు కప్పులు తీసుకుంటే మంచిదే, కానీ పరిమితికి మంచి తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు, మలబద్దకంకు గురిచేస్తుంది. అలాగే లివర్ ను డ్యామేజ్ చేస్తుంది.

English summary

9 Healthy Foods That Are Actually Dangerous If You Eat Them Way Too Much

9 Healthy Foods That Are Actually Dangerous If You Eat Them Way Too Much,Here is a list of 10 healthy foods that can actually be bad for you if you overeat it.
Story first published: Saturday, January 7, 2017, 11:43 [IST]
Desktop Bottom Promotion