గుప్తాంగాల్లో మొటిమలు లేదా పులిపిర్లు ప్రమాదకరమా?

By: sujeeth kumar
Subscribe to Boldsky

గుప్తాంగాల్లో పులిపిర్లు క‌నిపిస్తే చాలు మ‌న‌కు వ‌చ్చే మొద‌టి సందేహం ఏదైనా సుఖ‌వ్యాధికి గుర‌య్యామా అని! చాలా మంది ఇదే అపోహ‌లో ఉంటారు. పులిపిరి మొటిమ‌ల వ‌ల్ల కావొచ్చు.

మొటిమ‌లు లేదా పులిపిర్లు శ‌రీరంలో ఎక్క‌డైనా ఏర్ప‌డ‌వ‌చ్చు. ఇందుకు గుప్త ప్ర‌దేశాలు మిన‌హాయింపేవీ కాదు. శ‌రీరంపైన ఉన్న చ‌ర్మ రంధ్రాలు మూసుకుపోయిన‌ప్పుడు మొటిమ‌లు ఏర్పడ‌తాయి. అది బ్యాక్టీరియా వ‌ల్ల కావొచ్చు.

చీకాకు కలిగించే బుట్ పింపుల్స్ నివారణకు ఎఫెక్టివ్ హోం రెమెడీస్

యోనిపైన ఉండే మొటిమ‌ల‌కు ఇత‌ర శ‌రీర భాగాల్లో ఉండేవాటికి ఒక్క‌టే తేడా. అదే నొప్పి. అక్క‌డ పులిపిర్లు ఏర్ప‌డితే చాలా నొప్పి అనిపిస్తుంటుంది. చాలా అసౌక‌ర్యంగా ఉంటుంది కూడా!

ఆ ప్ర‌దేశాల్లో పులిపిర్లు రావ‌డానికి కొన్ని కార‌ణాలు .....

హార్మోన్ స‌మ‌స్య‌లు

హార్మోన్ స‌మ‌స్య‌లు

ముఖంపై మొటిమ‌ల మాదిరిగానే గుప్తాంగాల్లో మొటిమ‌లు ఏర్ప‌డేందుకు హార్మోన్‌ల అస‌మ‌తుల్య‌తే కార‌ణం కావొచ్చు. దీని వ‌ల్ల ఆ ప్రాంతాల్లో బ్యాక్టీరియా విప‌రీతంగా పెరిగిపోవ‌చ్చు. హార్మోన్ల‌ను స‌మ‌తులంగా ఉంచే ఆహారాన్ని తినేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. ప‌చ్చి కూర‌గాయ‌లు, అవిసె గింజ‌లు, ఆరోగ్య‌క‌ర కొవ్వులుండే ఆహారానికి ప్రాధాన్య‌త‌నివ్వండి.

మ‌ర్మాంగాల్లో వెంట్రుక‌లు

మ‌ర్మాంగాల్లో వెంట్రుక‌లు

త‌ర‌చూ మ‌ర్మాంగాల‌ను షేవ్ చేయించుకోవ‌డం, వ్యాక్సింగ్ చేయించుకోవ‌డం వ‌ల్ల అక్క‌డ చ‌ర్మం గాట్ల‌కు గురికావొచ్చు. కొన్ని సార్లు అక్క‌డ వెంట్రుక‌లను అలాగే ఉంచుకోవ‌డం మేలు. పొడుగ్గా పెరిగితే చిన్న‌గా క‌త్తిరించుకోవ‌డం మంచిది. ప్ర‌తి సారీ షేవింగ్ చేస్తే చ‌ర్మానికి దురద ద‌ద్ద‌ర్లు ఏర్ప‌డుతుంది.

బిగుతైన లోదుస్తులు

బిగుతైన లోదుస్తులు

బిగుతైన లోదుస్తులు ధ‌రిస్తే చ‌ర్మానికి త‌గిన గాలి అంద‌దు. అక్క‌డ తేమ‌, త‌డి వ‌ల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు ఎక్కువ అవ‌కాశం ఉంది.

శుభ్ర‌ప‌రిచే వ‌స్తువులు

శుభ్ర‌ప‌రిచే వ‌స్తువులు

గుప్త ప్ర‌దేశాల్లో జాగ్ర‌త్త‌గా శుభ్ర‌ప‌ర్చుకోవాలి. కొన్ని ర‌కాల సబ్బులు అక్క‌డి పీహెచ్ విలువ‌ను దెబ్బ‌తీసే ప్ర‌మాద‌ముంది. దీంతె ఆ ప్ర‌దేశంలో దుర‌ద‌, వాస‌న‌, ఇరిటేష‌న్ క‌ల‌గొచ్చు.

ప‌డుకునే ముందు

ప‌డుకునే ముందు

మ‌ర్మాంగాల్లో పులిపిర్లు ఏర్ప‌డి దుర‌ద‌గా ఉన్న‌ట్ల‌యితే లో దుస్తులు విప్పేసి ప‌డుకోవ‌డం మంచిది. దీని వ‌ల్ల అక్క‌డ చ‌ర్మం ఊపిరి తీసుకోవ‌డానికి వీల‌వుతుంది. అక్క‌డ తేమ ఏర్ప‌డితే ప‌రిస్థితి మ‌రింత విష‌మిస్తుంది.

అందానికే మచ్చ తీసుకొచ్చే మొటిమలకు మనకు తెలియని 15 కారణాలు

వైద్యం

వైద్యం

ఆ ప్ర‌దేశాల్లో పులిపిర్లు ఏర్ప‌డితే వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం మేలు. వైద్యుడు సూచించిన మందుల‌ను వాడాలి. ఒక్కోసారి ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోకుండానే వాటంత‌ట అవి మాయ‌మ‌వుతాయి.

జాగ్ర‌త్త‌లు

జాగ్ర‌త్త‌లు

గాలి బాగా త‌గిలే లోద‌స్తుల‌ను వేసుకోవ‌డం మంచిది. కాట‌న్ లో దుస్తులు వాడితే బాగుంటుంది. ఆ ప్ర‌దేశాన్ని నీళ్ల‌తోనే శుభ్రం చేసుకోవ‌డం మంచిది. స‌బ్బు వాడ‌కండి. ఆ ప్ర‌దేశాల‌ను పొడిగా ఉంచండి. పులిపిర్లు ఏర్ప‌డితే వాటిని గిల్ల‌కండి. ఒక‌వేళ పొర‌పాటున గిల్లితే ఆ ప్ర‌దేశంలో మంచి యాంటీ బ‌యాటిక్ సొల్యూష‌న్‌ను పూత‌లా పూయండి.

ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మీ గుప్తాంగాలు సుర‌క్షితంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

English summary

Is Acne In Private Parts Dangerous?

Many people think that only sexually transmitted diseases cause pimples near private parts. Well, a pimple could be simply due to acne. Here are some cause
Story first published: Thursday, November 2, 2017, 19:00 [IST]
Subscribe Newsletter