For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొడ్డులో కొబ్బరి నూనె పోసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు

కాస్త కొబ్బరి నూనెను తీసుకుని బొడ్డుపై వేసుకుంటే చాలా మంచిది. దీంతో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.సంతానోత్పత్తి శక్తి కూడా మెరుగుపడుతుంది. ఇంకా చాలా ప్రయోజనాలు దీని వల్ల ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలు ఏమిట

|

కాస్త కొబ్బరి నూనెను తీసుకుని బొడ్డుపై వేసుకుంటే చాలా మంచిది. దీంతో కొన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. అక్కడ కొబ్బరి నూనెతో మర్దన చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. రుతుక్రమ సమయంలో వచ్చే తిమ్మిర్లు, నొప్పి తగ్గుతుంది. కొన్ని చుక్కల కొబ్బరి నూనెను బొడ్డుపై అప్లై చేసి, ఆ ప్రాంతాన్ని సున్నితంగా మర్దనా చేయండి. ఇలా చేయడంవల్ల సంతానోత్పత్తి శక్తి కూడా మెరుగుపడుతుంది. సాధారణంగా కొబ్బరి నూనె మెదడు చల్లబడటానికి, శరీరంలో వేడి తగ్గటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే మనం పూర్వం నుంచి దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇంకా చాలా ప్రయోజనాలు దీని వల్ల ఉన్నాయి. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో మీరూ తెలుసుకోండి.

# 1 : లైంగిక సామర్థ్యం పెరుగుతుంది

# 1 : లైంగిక సామర్థ్యం పెరుగుతుంది

ఇలా చేయడం వల్ల మీలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. సంతానోత్పత్తికి కూడా ఈ విధానం తోడ్పడుతుంది. సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనేందుకు ఈ విధానం బాగా సహాయపడుతుంది.

# 2: జలుబు తగ్గిపోతుంది

# 2: జలుబు తగ్గిపోతుంది

కొబ్బరి నూనెలో చాలా గుణాలుంటాయి. ఇవి మనలోని చాలా అనారోగ్యాలను దూరం చేస్తాయి. కోల్డ్ లేదా జలబు వంటి సమస్యను ఈజీగా తగ్గించే గుణం దీనికి ఉంటుంది.

# 3: ఋతుక్రమ నొప్పులకు ఉపశమనం

# 3: ఋతుక్రమ నొప్పులకు ఉపశమనం

కొబ్బరి నూనెను ఇలా పెట్టుకోవడం వల్ల ఆడవాళ్లకు చాలా ప్రయోజనాలున్నాయి. కడుపు దగ్గర ఉండే కండరాలు మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తిమ్మిర్ల సమస్య తగ్గిపోతుంది. బుతుక్రమం సమయంలో వచ్చే నొప్పులకు కూడా ఉపశమనం కలుగుతుంది. అందువల్ల మహిళలు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే చాలా మేలు.

# 4 : కంటి చూపు మెరుగవుతుంది

# 4 : కంటి చూపు మెరుగవుతుంది

ఉదరంపై కొబ్బరినూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. అందువల్ల మీరు ఇలా అప్పడప్పుడు కొబ్బరి నూనెను అక్కడ పూసుకుంటూ ఉండండి. కంటి చూపునకు సంబంధించిన సమస్యలు తలెత్తవు.

# 5: ఇలా చేయాలి

# 5: ఇలా చేయాలి

పత్తిని తీసుకుని కొబ్బరి నూనెలో ముంచండి. దాంతో మీ పొట్ట లేదా ఉదరం భాగాన బొడ్డుపైన, బొడ్డు సమీపంలో కొద్ది సేపు మసాజ్ మాదిరిగా చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఇలా తరుచుగా చేసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి.

# 6: లాభాలేంటి ?

# 6: లాభాలేంటి ?

బొడ్డు అనేది మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. కడుపులోని బిడ్డకు దీని ద్వారానే పోషకాలు అందుతాయి. అంతేకాకుండా కొన్ని వేల నరాలు బొడ్డుతాడుతో అనుసంధానంగా ఉంటాయి. ఇలా చాలా అంశాలకు ఇది కేరాఫ్ గా ఉంటుంది. అందువల్ల అక్కడ కొబ్బరి నూనె వేస్తే ఆ ప్రయోజనాలు బాడీ మొత్తానికి వెళ్తాయి.

English summary

benefits of oil in belly button

Some of the benefits of putting coconut oil in your belly button are as follows.
Desktop Bottom Promotion