For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నైట్ టైమ్ ఇవి తినడం వల్ల బాగా నిద్రపట్టడంతో పాటు బరువు తగ్గుతారు..!!

|

బరువు తగ్గడానికి వ్యాయామాలు, జిమ్, డైట్ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు ఎందరో ఉంటారు. కొంత మంది రోజంత తినడం మానేస్తే మరికొందరు రాత్రుల్లో అస్సలు ఏమి తినకుండా డైట్ అని చెబుతుంటా. ఇలా చేయడం వల్ల నిద్రపాడవ్వడం మాత్రమే కాదు, ఆరోగ్య కూడా చెడుతుంది. అలా జరగకుండా ఉండాలన్నా..మంచి నిద్ర పట్టాలన్నా.. అదే సమయంలో శరీరంలోని అదనపు క్యాలరీలను తగ్గించుకోవాలన్నా ఏం చేయాలి?

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే 10 బ్రిలియంట్ నైట్ ఫుడ్స్..!!

బరువు తగ్గడానికి డైట్ అని ఆకలితో నిద్రపోడం వల్ల, మీరు అనుకున్న వెయిట్ లాస్ గోల్స్ ను చేరుకోలేరు. ఆకలితో ఉన్నప్పుడు నిద్ర సరిగా పట్టక పోగా..నిద్రలేమి సమస్యల వల్ల మరింత బరువు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

అదే విధంగా, రాత్రుల్లో ఎక్కువగా ఆకలి మరియు నిద్రలేమి సమస్యల వల్ల హార్మోనుల మీద ప్రభావం చూపుతుంది. డైట్ అంటూ రాత్రుల్లో ఏమి తినకుండా పడుకోవడం వల్ల మరుసటి రోజు ఎక్కువ ఆకలి వేయడంతో హైక్యాలరీ ఫుడ్స్ కు ఎక్కువగా తీసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సరిగా నిద్ర పట్టట్లేదా...? చాలా చాలా సింపుల్ టిప్స్ ..!!

అందువల్ల , నిద్రించడానికి ముందు పొట్టను ప్రశాంత పరచాలి, అప్పుడే ప్రశాంతమైన నిద్రపడుతుంది. ఈ ఆర్టికల్లో సూచిస్తున్న కొన్ని ఆహారాలు మంచి నిద్ర పట్టించడంతో పాటు, అదే సమయంలో శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగించుకోవడానికి సహాయపడుతాయి.

మరి అయితే ఈ స్టొమక్ బర్నింగ్ ఫుడ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. బరువు తగ్గించుకోవడానికి బెస్ట్ నైట్ టైమ్ ఫుడ్స్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం...

పెరుగు :

పెరుగు :

పెరుగులో ప్రోటీన్స్ అధికం, షుగర్స్ తక్కువ. ప్రోటీన్ ఫుడ్స్ తిన్నప్పుడు పొట్ట నిండుగా అనిపిస్తుంది. అలాగే మజిల్స్ ఏర్పడుటకు సహాయపడుతుంది. బాగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.

చెర్రీస్:

చెర్రీస్:

నిద్రకు ఉపక్రమింప చేసే హార్మోను ఉద్దీపన కలిగించే మెలటోనిన్ అనే నేచురల్ కంటెంట్ చెర్రీస్ లో అధికంగా ఉన్నాయి. చెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది నిద్ర క్వాలిటీని పెంచుతాయి . బరువు పెరగడానికి సహాయపడుతాయి . బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ నైట్ టైమ్ ఫుడ్ .

బ్రెడ్ తో పాటు పీనట్ బటర్ :

బ్రెడ్ తో పాటు పీనట్ బటర్ :

పీనట్ బటర్ లో ట్రైప్టోఫోన్ అధికంగా ఉంటుంది, దీన్నే అమినో యాసిడ్స్ అనికూడా పిలుస్తారు. ఇది నిద్రపట్టడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి లు బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో మజిల్స్ కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. కాబట్టి రాత్రుల్లో మీరు ఏం తినాలనే చింత లేకుండా బ్రెడ్ బట్టర్ ను ఫాలో అవ్వండి.

ప్రోటీన్ షేక్ :

ప్రోటీన్ షేక్ :

వర్కౌట్స్ తర్వాత ప్రోటీన్ షేక్స్ తీసుకోవడం వల్ల మజిల్స్ బిల్డ్ అవుతాయి. మజిల్స్ ప్రోటీన్స్ కంటే అమినో యాసిడ్స్ ఎక్కువ గ్రహిస్తాయి

కాటేజ్ చీజ్ :

కాటేజ్ చీజ్ :

కాటేజ్ చీజ్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. వీటిని శరీరం చాలా నిదానంగా గ్రహిస్తుంది. ఇది మిమ్మల్ని ఫుల్ గా ఉండేట్లు చేస్తుంది. మజిల్స్ ను రిపేర్ చేయడంతో పాటు బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో నిద్రపట్టడానికి అసవరమయ్యే ట్రైప్టోఫోన్ ఉండటం వల్ల బాగా నిద్ర పడుతుంది.

 టర్కీ :

టర్కీ :

టర్కీలో ఉండే ట్రైప్టోఫోన్ నిద్రపట్టడానికి సహాయపడుతుంది. మరియు రాత్రుల్లో మజిల్స్ హెల్తీగా బిల్డ్ చేయడానికి సహాయపడుతుంది.

 అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో ఉండే అమినో యాసిడ్స్ నిద్రపట్టడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలి కోరికలను తగ్గిస్తుంది. అలాగే డిన్నర్ సమయంలో లేదా రాత్రుల్లో స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తుంది.

చాక్లెట్ మిల్క్ :

చాక్లెట్ మిల్క్ :

చాక్లెట్ మిల్క్ ఐడియల్ వెయిట్ లాస్ బెవరేజ్ . ఇందులో ఉండే క్యాల్షియం కంటెంట్ బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చాక్లెట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారు, సాయంత్రం సమయంలో వ్యాయామం చేసే వారు డిన్నర్ సమయంలో చాక్లెట్ తినవచ్చు.

కెఫిర్ :

కెఫిర్ :

కెఫిర్ లో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఈ ప్రోబయోటిక్స్ గౌట్ బ్యాక్టీరియాకు సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరంను తగ్గిస్తుంది. ఇంకా ఇందులో ఉండే ట్రైఫ్టోఫోన్ అనే కంటెంట్ తర్వగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

బాదం:

బాదం:

బాదంను రాత్రుల్లో తినడం వల్ల రాత్రుల్లో మజిల్ బిల్డ్ కు సహాయపడుతుంది. బాదాంలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలి కోరికలను తగ్గిస్తుంది. బాదం ఒక బెస్ట్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్. అయితే రోజూ 5 నుండి 7 మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. అలాగే నానబెట్టిన బాదం తింటే ఎక్కువ సులభంగా జీర్ణమవుతాయి.

English summary

Best Bedtime Foods For Weight Loss

Before you get some good amount of sleep, you can shed those unwanted pounds. You might be starving at night, but you do not want to eat something that will make your diet plan go for a toss.
Desktop Bottom Promotion