For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయసు పైబడినవారు రాత్రిళ్ళు హాయిగా నిద్రించేందుకై బెస్ట్ డిన్నర్ ఆప్షన్స్

|

సాధారణంగా, ఎనిమిది గంటల నిద్ర అనేది ఆరోగ్యానికి ఎంతో అవసరం. తద్వారా, శక్తి కూడా లభిస్తుంది. ఒక వేళ సరిగా నిద్రపోలేక రాత్రిళ్ళు అనేకసార్లు నిద్రలేస్తూ ఉన్నట్టయితే అనేక రకాల శారీరక, మానసిక సమస్యలు దాడి చేస్తాయి. డిమెన్షియా, సన్ డౌనింగ్ మరియు అల్జీమర్ వంటి వ్యాధులు నిద్రలేమి సమస్యల వలన కలుగుతాయి. వయసు మీదపడే కొద్దీ నిద్రలేమి సమస్య వేధిస్తుంది. ఈ విషయాన్ని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వెల్లడించింది. వృధ్ధులలో 44 శాతం మంది నిద్రకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. నిద్రలేమికి గురవుతున్నారు. తద్వారా, వారి ఆరోగ్యం పాడవుతుందని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ వెల్లడించింది.

Best Dinner For Old People To Sleep Well At Night

సీనియర్ సిటిజన్స్ లో ఈ సమస్య సాధారమే ఆంయినప్పటికీ నిద్రలేమి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. నిద్ర తగినంతగా లేకపోయినా నిద్రలో అనేకసార్లు లేవవలసి వచ్చినా ఫుడ్ థెరపీ ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మెదడు విశ్రాంతి తీసుకోవడానికి సరైన పోషకాలు అవసరమవుతాయి. ఈ పోషకాలు శరీరాన్ని ప్రశాంతపరచడం ద్వారా నిద్ర బాగా పట్టేలా చేస్తాయి.

పోషకాలు అధికంగా కలిగిన పండ్లు:

పోషకాలు అధికంగా కలిగిన పండ్లు:

శరీరంలోని కండరాలను రిలాక్స్ చేయడానికి మెగ్నీషియంతో పాటు పొటాషియం అవసరం. తద్వారా తగినంత నిద్రపడుతుంది. ఈ పోషకాలు అధికంగా కలిగిన పండ్లను తీసుకోవాలి. రాత్రి సమయంలో నెర్వస్ సిస్టమ్ ను ప్రశాంతపరచడానికి కూడా ఈ పోషకాలు అవసరం. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం అలాగే ట్రీప్టోఫాన్ అనే అమినో యాసిడ్ కలదు. ఆపిల్స్, చెర్రీస్, ఆప్రికాట్స్ మరియు పీచెస్ లో మెగ్నీషియం అధిక మోతాదులో కలదు. ఇవన్నీ, నిద్రబాగా పట్టేందుకు సహాయపడే పోషక పదార్ధాలు. మన మెదడు మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. నిద్రపట్టేందుకు ఈ హార్మోన్ తోడ్పడుతుంది.

కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్:

కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్:

తేనెను అద్ది మాష్ చేసిన పొటాటోను వృద్ధులకు మంచి డిన్నర్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. అలాగే, ఓట్ మీల్, పాప్ కార్న్, అలాగే జాస్మిన్ రైస్ కూడా కాంప్లెక్ కార్బోహైడ్రేట్స్ అధికంగా కలిగిన ఆహార పదార్థాలు. ఇవన్నీ, శరీరంలోని ట్రీప్టోఫాన్ స్థాయిలను పెంపొందించి తద్వారా నిద్రపట్టేలా చేస్తాయి. కాల్షియమ్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సిలికాన్, పొటాషియం అధికంగా కలిగిన ఓట్ మీల్ ను రాత్రిపూట ఆహారంగా తీసుకోవడం ద్వారా సరైన నిద్ర లభిస్తుంది.

లీన్ ప్రోటీన్స్:

లీన్ ప్రోటీన్స్:

లీన్ ప్రోటీన్లు అధికంగా కలిగిన ఆహారపదార్థాలు శరీరంలోని ట్రీప్టోఫన్ స్థాయిలను పెంపొందించడానికి తోడ్పడతాయి. తద్వారా శరీరంలోని నిద్రను ప్రేరేపించే సెరోటోనిన్ స్థాయిలు పెరగడం వలన రాత్రిళ్ళు నిద్రబాగా పడుతుంది. పీనట్ బటర్, అరటిపళ్ళు, గుడ్లు, హోల్ గ్రైన్ టోస్ట్, లీన్ టర్కీ అలాగే ఫిష్ లో లీన్ ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. అయితే, వీటిని నిద్రపోవడానికి ముందు అమితంగా తీసుకోకూడదు. వీటిని రాత్రిళ్ళు అమితంగా తీసుకోవడం వలన దుష్ప్రభావాలు కలగవచ్చు.

వెచ్చని పానీయాలు:

వెచ్చని పానీయాలు:

నిద్రపోవడానికి ముందు వేడిపాలను తీసుకోమని పూర్వికులు ఎన్నడో సూచించారు. ఇందుకు తగిన కారణముంది. పాలతో పాటు మిగతా పాల ఉత్పత్తులలో ట్రీప్టోఫన్ అధిక శాతంలో లభిస్తుంది. అలాగే, వీటిలో క్యాల్షియం కూడా తగు మోతాదులో ఉంటుంది. వీటన్నిటి వలన శరీరంలోని మెలటోనిన్ తగినంత ఉత్పత్తి అవుతుంది. అలాగే, నిద్రించే ముందు చాలా మంది వలేరియన్ రూట్ అనే హెర్బ్ తో తయారైన టీ ని తాగుతారు. కొన్ని శతాబ్దాల నుంచి ఈ హెర్బల్ టీని సహజసిద్ధమైన సెడేటివ్ గా భావించి రాత్రిళ్ళు ఈ టీ ని తాగుతారు. అయితే, రాత్రిళ్ళు కెఫయిన్ ని తీసుకోకూడదని గుర్తుంచుకోండి. కెఫైన్ ని కొద్ది మోతాదులో తీసుకున్నా నిద్రాభంగం కలుగుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఫ్యాట్స్:

గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఫ్యాట్స్:

కొవ్వు పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి హానీకరమనే భావన చాలామందిలో ఉంది. అయితే, ఇది కొంతవరకు నిజమే అయినా, కొన్ని రకాల ఫ్యాట్స్ ఆరోగ్యానికి మంచివన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఈ ఫ్యాట్స్ వలన గుండె ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతినదన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. రాత్రిపూట భోజనంలో వీటిని చేర్చుకుంటే శరీరంలోని సెరోటోనిన్ స్థాయిలు పెరిగి సరైన నిద్ర కలుగుతుంది. అవొకాడో, పీనట్ బటర్, మరియు ఆల్మండ్స్ లో మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. కండరాలకు ఉపశమనం కల్గించేందుకు మెగ్నీషియం తోడ్పడుతుంది. అయితే, అనారోగ్యకరమైన శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ని అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ ని దూరంగా ఉంచడం వలన సెరోటోనిన్ స్థాయిలు దెబ్బతినకుండా నిద్ర బాగా పడుతుంది.

English summary

Best Dinner For Old People To Sleep Well At Night

Best Dinner For Old People To Sleep Well At Night,
Story first published:Saturday, December 16, 2017, 17:24 [IST]
Desktop Bottom Promotion