లివర్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి !

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

మన శరీరంలో ఉన్న అవ‌య‌వాల‌న్నింటిలోకెల్లా లివ‌ర్ (కాలేయం) పెద్ద‌దైన అవ‌య‌వం. ర‌క్తంలో ఉన్న విష ప‌దార్థాల‌ను తొల‌గించ‌డం, శ‌రీరానికి అవ‌స‌ర‌మైన‌ప్పుడు శ‌క్తిని అందించ‌డం వంటి ఎన్నో ప‌నుల‌ను లివర్ నిత్యం చేస్తూనే ఉంటుంది. అయితే నిత్యం మ‌నం తీసుకునే ఆహారంతోపాటు, కాలుష్యం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, అనారోగ్యాలు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల లివ‌ర్ పనితీరులో మార్పు వ‌స్తుంది. దీంతో మ‌న దేహం మ‌రింత అస్వ‌స్థ‌త‌కు లోన‌వుతుంది. అయితే కింద ఇచ్చిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను నిత్యం ఆహారంలో తీసుకుంటే లివ‌ర్ ప‌నిత‌నాన్ని మెరుగుప‌ర‌వ‌చ్చు. దీంతో అనారోగ్యాలు కూడా దూర‌మ‌వుతాయి. అంతేకాదు లివ‌ర్‌లో ఉన్న విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. అలాగే కాలేయం మన శరీర జీవక్రియల్లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది మన ఉదరభాగంలో కుడివైపున ఇది ఉంటుంది. ఇది జబ్బున పడినా కూడా తనను తాను బాగు చేసుకోగలదు. జంక్ ఫుడ్, అతిగా ఆహారం తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, పనిభారం తదితర కారణాల వల్ల మన లివర్ చెడిపోతుంటుంది. దీంతో ఆ భాగం శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపడంలో విఫలం చెందుతుంది. దీంతో మనం అనారోగ్యాలకు గురవుతాం. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల లివర్‌ను కాపాడుకోవొచ్చు. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. తద్వారా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవు. మరి ఆ ఆహారాలు ఏమిటో తెలుసుకుందామా.

1. పసుపు

1. పసుపు

లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో పసుపు చాలా బాగా పనిచేస్తుంది. కాలేయ శుద్ధీకరణకు పసుపు ఇది బాగా పని చేస్తుంది. అందువల్ల మీరు రోజూ తీసుకునే ఆహారంలో పసుపు మోతాదును పెంచుకోండి. మన శరీరంలోని కొవ్వులను కరిగించడానికి కూడా పసుపు ఎంతో సహాయపడుతుంది. నిత్యం ఒక గ్లాస్ నీళ్లలో 1/4 టీస్పూన్ పసుపు కలుపుకుని తాగితే చాలు. ఇలా రోజుకు రెండుసార్లు చేయాలి. దీంతో లివర్ శుభ్రం అవుతుంది. విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇలా రెండు వారాలు చేయాలి.

2. క్యాబేజీ

2. క్యాబేజీ

కాలేయ శుద్ధీకరణకు క్యాబేజీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది కాలేయంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి బాగా సహాయపడుతుంది. సౌర్క్క్రాట్, క్యాబేజీ సూప్, కొల్లేస్లా, కింకిలను ఎక్కువగా తీసుకోవాలి. క్యాబేజీని సలాడ్లలో కూడా ఉపయోగించొచ్చు. ఇది ఉదర సమస్యలకే కాకుండా, చర్మ సంరక్షణకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఐసోథ‌యోసయ‌నేట్స్ అనే ఔష‌ధ గణాలు లివ‌ర్‌లో పేరుకుపోయిన విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపుతాయి. ఇవి క్యాబేజీలో ఎక్కువ‌గా ఉంటాయి. కాబట్టి క్యాబేజీని మ‌న ఆహారంలో త‌ర‌చూ తీసుకుంటుంటే లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

3. వాల్‌నట్స్

3. వాల్‌నట్స్

వాల్‌నట్స్ లో అమినో యాసిడ్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌కు సహాయం చేస్తాయి. దీంతో లివర్ శుభ్రం అవడమే కాదు, మరింత మెరుగ్గా వ్యర్థాలను బయటకు పంపుతాయి. గ్లూటాతియోన్లు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కాలేయాన్ని శుభ్రపరచడంలో బాగా పని చేస్తాయి. వాల్నట్స్ లో ఉండే అమైనో ఆమ్లం ఎల్-ఆర్గనైన్ కూడా కాలేయాన్ని శుభ్రపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల మీరు వాల్ నట్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

4. నిమ్మ

4. నిమ్మ

నిమ్మకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థ పదార్ధాలను బయటకు పంపడానికి నిమ్మకాయలు బాగా దోహదం చేస్తాయి. కాలేయం శుభ్రం కావడానికి రోజూ పరగడుపున నిమ్మరసం తాగుతూ ఉండాలి. ఒకగ్లాస్ నీటిలో నిమ్మకాయ రసాన్ని కలిపి తాగడం వల్ల మీ కాలేయం త్వరగా క్లీన్ అయిపోతుంది. ఇక మీకు ఇది కాస్త రుచిగా ఉండాలనుకుంటే తేనెను కూడా కలపాలి. నిమ్మలో విటమిన్ - సీతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్‌ను క్లీన్ చేస్తాయి.

5. కాలీఫ్లవర్, బ్రోకలీ

5. కాలీఫ్లవర్, బ్రోకలీ

శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజాలను వెజిటేబుల్స్ అందిస్తాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు వెళ్తాయి. కాలేయానికి ముఖ్యంగా కాలీఫ్లవర్, బ్రోకలీ చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇవి శరీరంలో గ్లూకోసినోలట్ స్థాయిలను పెంచుతాయి. అందువల్ల కాలీఫ్లవర్, బ్రోకలీతో తయారు చేసిన ఆహారాలను రెగ్యులర్ తీసుకుంటూ ఉండాలి.

6. ధాన్యాలు

6. ధాన్యాలు

బుక్వీట్, మిల్లెట్, క్వినో వంటి ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవి కాలేయంలోని విష పదార్థానలు బయటకు పంపిస్తుంటాయి. అందువల్ల ఇలాంటి ధాన్యాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

7. ఆలివ్ ఆయిల్‌

7. ఆలివ్ ఆయిల్‌

ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల శరీరం ప్రత్యేకమైన లిపిడ్ సమ్మేళనాలను తయారు చేసుకుంటుంది. అవి వ్యర్థాలను గ్రహించి బయటకు పంపుతాయి. దీంతో లివర్‌పై భారం తగ్గుతుంది. తద్వారా లివర్ క్లీన్ కూడా అవుతుంది. అందువల్ల మీ ఆహారాలను ఆలివ్ ఆయిల్స్ తో ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉండండి.

ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.

8. యాపిల్

8. యాపిల్

శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించే గుణాలను ఆపిల్ కలిగి ఉంది. దీంతో కాలేయం పని తీరు మెరుగుపడుతుంది. యాపిల్ పండ్లలో ఉండే పెక్టిన్ లివర్‌కు సహాయ పడుతుంది. ఇది లివర్ మెరుగ్గా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. దీంతో వ్యర్థాలు ఎప్పటికప్పుడు శరీరం నుంచి వెళ్లిపోతాయి. యాపిల్లో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది లివర్ ను సహజసిద్ధంగా క్లీన్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. రోజుకొక యాపిల్ తినాలి. లేదంటే ఒక గ్లాస్ యాపిల్ రసాన్ని తాగాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుండడం వల్ల కాలేయం త్వరగా శుభ్రం అవుతుంది. యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంది.

9. అవొకాడో

9. అవొకాడో

ఇందులో గ్లూటాతియోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయాన్ని శుద్ది చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే అవోకాడోలో మోనో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్స్ ను, తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లను తగ్గించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్స్ ను పెంచడానికి అవొకాడో ఉపయోగపడుతుంది. అలాగే వీటిలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. గ్లూటాథియోన్ ఎక్కువ మోతాదులో కావాలంటే అవకాడోలను రోజూ తినాలి. దీంతో గ్లూటాథియోన్‌ను లివర్ గ్రహించి తద్వారా శరీరంలో ఉన్న వ్యర్థాలను వెంట వెంటనే బయటకు పంపుతుంది. ఇది ఇది కాలేయాన్ని శుభ్ర పచడమే కాకుండా కణజాలాలు మరియు కణాల పునరుద్దించడానికి బాగా సహాయ పడుతుంది. ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల కాలేయానికి మంచి ప్రయోజం చేకూర్చుతాయి.

10. ఆకు కూరగాయలు

10. ఆకు కూరగాయలు

ఆకు కూరగాయలను నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. వీటిలో ఉండే ఔషధ గుణాలు లివర్‌లో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపి లివర్‌ను శుభ్రం చేస్తాయి. తద్వారా లివర్ పనితనం మెరుగు పడుతుంది. ఆకుకూరల ద్వారా తయారైన ఆహారపదార్థాలనుగానీ, లేదా జ్యూస్ లనుగానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పాలకూరను ఎక్కువగా ఉపయోగించడం మంచిది.

11. గ్రీన్ టీ

11. గ్రీన్ టీ

ఇందులో కాటేచిన్స్ అనే ఆమ్లజనకాలు ఉంటాయి. ఇవి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు గ్రీన్ టీని తాగడం ద్వారా మీ శరీరంలో కొవ్వు తగ్గుతుంది. గ్రీన్ టీలో కేటచిన్లు కాలేయంలోని లిపిడ్ క్యాటాబోలిజంను ప్రేరేపించడానికి సహాయపడతాయిని కొన్ని పరిశోధనల్లో తేలింది. క్యాథెకిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్‌కు చాలా మంచి చేస్తాయి. లివ‌ర్‌లోని వ్య‌ర్థాల‌ను బ‌య‌టికి పంపడానికి తోడ్పడుతాయి. రోజూ గ్రీన్ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గుతుంది.

12. బీట్‌రూట్, క్యారెట్స్

12. బీట్‌రూట్, క్యారెట్స్

వీటిలో ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి. రోజూ క్యారెట్లు, బీట్ రూట్ ఎక్కువగా తినేందుకు ప్రయత్నించండి. శరీరంలోని మలినాలను తొలగించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. అందువల్ల రోజూ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే వీటి జ్యూస్ తాగాలి.

13. గ్రేప్ ఫ్రూట్

13. గ్రేప్ ఫ్రూట్

దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది లివర్ లోని మలినాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రోజూ ఈ పండు జ్యూస్ ను తాగుతూ ఉండాలి. ఇది క్యాన్సింజెన్స్ వంటి అనేక మలినాలను శరీరం నుంచి బయటకు పంపడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే దీనిలో గ్లూటాతియోన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గ్రేప్ ఫ్రూట్ ను ఎక్కువగా తీసుకోవాలి. అయితే ఏవైనా మెడిసిన్స్ వాడుతుంటే మీరు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాకే గ్రేప్ ఫ్రూట్ ను ఉపయోగించాలి.

14. వెల్లుల్లి

14. వెల్లుల్లి

రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చిగా తినడం అలవాటు చేసుకుంటే చాలు. దాంతో లివర్ సురక్షితంగా ఉంటుంది. లివర్ ఎప్పటికప్పుడు శుభ్రం అవుతుంది. వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. వెల్లుల్లి కాలేయాన్ని శుభ్రపరచడానికి బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు కాలేయంలోని మలినాలను బయటకు తొలగిపోయేలా సాయం చేస్తాయి. వెల్లుల్లి ట్రైగ్లిజరైడ్ , కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది కాలేయ పనితీరు మెరుగుపడేలా చేస్తుంది.

15. బీట్ రూట్

15. బీట్ రూట్

బీట్ రూట్ ఎక్కుగా తీసుకోవడం చాలా మంచిది. కాలేయం పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని శుభ్రపర్చడానికి ఇది బాగా పని చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్, ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కాలేయ పనితీరు ఉత్తేజపరుస్తాయి. అందువల్ల బీట్రూట్ తో తయారు చేసిన ఆహారపదార్థాలనుగానీ లేదుంటే బీట్ రూట్ రసంగానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

16. బ్రొకోలి

16. బ్రొకోలి

ఇందులో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాలేయ-శుద్ధి ప్రక్రియకు బ్రోకోలి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో గ్లూకోసినోలేట్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి హాని కలిగించే కార్సినోజెన్లు, ఇతర విషపదార్ధాలను తొలగించడానికి బ్రోకోలి బాగా ఉయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుది. ఇది జీర్ణక్రియ ప్రక్రియకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ ఈ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. కాలేయం బాగా పనిచేయటానికి అవసరమైన కీలకమైన అమ్లజనకాలు ఇందులో ఉంటాయి. వారానికి మూడు సార్లు బ్రోకలీని తీసుకుంటూ ఉండాలి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మాంసం, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, అధిక కెఫిన్ ఉండే పదార్థాలను తీసుకోకూడదు.

17. నీరు

17. నీరు

పరిశుభ్రమైన నీరు శరీరానికి చాలా అవసరం. శరీరం నుంచి వ్యర్ధాలను తొలగించేందుకు నీరు ఎంతో అవసరం. నీళ్ళు ఎక్కువగా తాగితే శరీరంలోని మలినాలను బయటకు పంపేందుకు మూత్రపిండాలు సహకరిస్తాయి. అందువల్ల శరీరానికి అవసరమైన నీటిని తాగుతూ ఉండండి.

18. తృణధాన్యాలు

18. తృణధాన్యాలు

కాలేయ పనితీరు మెరుగుపరచడానికి ఇవి బాగా పని చేస్తాయి. వీటిలో బీ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. తృణధాన్యాల ద్వారా తయారు చేసిన ఆహారాలనుగానీ, లేదంటే మొలకెత్తిని వాటినిగానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు ఇవి బాగా సహాయపడుతుంది.

19. సిట్రస్ పండ్లు

19. సిట్రస్ పండ్లు

వీటిలో విటమిన్ సి లో చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది సులభంగా తీసివేయుటకు నీటిలో కరిగిపోయే పదార్ధాలకు విషాన్ని మార్చడంలో సహాయపడుతుంది. వ్యవస్థ నుండి అదనపు కొవ్వులు మరియు ఎక్కువ టాక్సిన్ను బయటకు త్రోయుటకు పైత్య ఉత్పత్తిని ప్రేరేపించడంలో కూడా ఇవి సహాయపడతాయి. అందువల్ల ఆరెంజ్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి లివర్ ను కాపాడడంలో బాగా పని చేస్తాయి. వీటిలో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల రెగ్యులర్ ఆరెంజ్ పండ్లను, సిట్రస్ పండ్లను తీసుకోవాలి.

20. ఆర్టిచోకెస్

20. ఆర్టిచోకెస్

కాలేయాన్ని శుభ్రం చేయడానికి ఇది బాగా పని చేస్తుంది. శరీరంలోని ఫ్యాట్ ను కరిగించడానికి ఎంతో పని చేస్తుంది. అందువల్ల ఆర్టిచోకెస్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. దీంతో కాలేయం క్లీన్ గా మారిపోతుంది.

21. అల్యూమియాలు

21. అల్యూమియాలు

అల్యూమియాలు సెలీనియం అల్లియాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండూ కాలేయంలోని కొవ్వులను, మలినాలను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. శరీరానికి హాని కలిగించే శిలీంధ్రాలు, వైరస్లు, బ్యాక్టీరియాలను ఇవి క్లియర్ చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

22. టమాట

22. టమాట

టమోటా ఎరుపు రంగులో ఉండడానికి ప్రధాన కారణం అందులో లైకోపీన్ ఉండడం. అందువల్ల టమాట శరీరంలోని మలినాలను తొలగించడంలో బాగా పని చేస్తుంది. టమాట జ్యూస్ ను తాగడం లేదా టమాటతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.

English summary

Best liver cleansing diet tips

The liver, weighing in at about three pounds in a normal adult, is one of the most important organs in the human body. It is responsible for several crucial functions related to immunity, metabolism, digestion, and the storage of essential nutrients that our body needs to survive.In addition, liver is a gland that helps to secrete chemicals required by every other part inside our body. Actually, liver is the single body part that is both a gland and an organ.
Subscribe Newsletter