For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ప్రతిరోజూ మీకు తెలీకుండా తినే 5 క్యాన్సర్ కారక పదార్ధాలు!

మనం ప్రతిరోజూ తీసుకునే క్యాన్సర్ కారకాల కొన్ని పదార్ధాల గురించి తెలుసుకుని, వాటిని నివారించడం ఎలాగో కింద పరిశీలించండి.

By Gandiva Prasad Naraparaju
|

ఈ నాగరిక ప్రపంచంలో క్యాన్సర్ అనేది ప్రాణనష్టాన్ని కలిగించే వ్యాధిగా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేకమంది జీవితాలతో ఆడుకుంటుంది.

ఇక్కడ అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి, మధ్యలో క్యాన్సర్ లక్షణాలను కనుక్కున్నా లేదా చివరి దశలో అయినా, చాలా క్యాన్సర్లకు నివారణ లేదు.

క్యాన్సర్ లక్షణాలను, వాటి నివారణలను కనుగొని అన్ని రకాల క్యాన్సర్ ల నుండి సాధారణ ప్రజలను కాపాడాలని వైద్యులు, బయో మెడికల్ సైంటిస్ట్ లు నిరంతరం పరిశోధన చేస్తూనే ఉన్నారు.

cancer causing foods

ప్రజలు వారి దైనందిన జీవితంలో అనేక రసాయనాలు ఉండే ఆహారపదార్ధాలను తెలియకుండానే ఉపయోగించడం, అనేకమంది క్యాన్సర్ కు కారణమయ్యే వివిధరకాల ఆహారపదార్ధాలను తినడం మనం చూస్తూనే ఉన్నాము.

నిజానికి, కొంతమంది శరీర వ్యవస్ధ కొన్ని సహజమైన, కృత్రిమ పదార్ధాలకు ప్రతికూలంగా పనిచేయవచ్చు, శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టడానికి వీటిని ఖచ్చితంగా మానేయాలి.

కొన్ని సందర్భాలలో క్యాన్సర్ వాటి మోసపూరిత ఉత్పత్తులను వాడకూడదు అనే విషయం పట్ల ప్రజలలో ఉండే సరైన అవగాహన వల్ల మాత్రమే నివారించవచ్చు, ఇవి ఇప్పుడు క్యాన్సర్ కి కీలకమైన కారణాలుగా గుర్తించబడ్డాయి.

మనం ప్రతిరోజూ తీసుకునే క్యాన్సర్ కారకాల కొన్ని పదార్ధాల గురించి తెలుసుకుని, వాటిని నివారించడం ఎలాగో కింద పరిశీలించండి.

1.మద్యపానం:

1.మద్యపానం:

చాలామంది పురుషులు, స్త్రీలు ప్రతిరోజూ వివిధ రకాల ఆల్కాహాల్ డ్రింక్స్ తాగడం అలవాటుగా మారింది. ప్రతిరోజూ మద్యపానం తాగడం వల్ల జీర్ణ వ్యవస్ధకు సంబంధించిన అనేక భాగాలలో క్యాన్సర్ రావొచ్చు. అలాగే మత్తుపానీయం అలవాటు వల్ల ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ రావొచ్చని కనుగొనబడింది.

2.నిల్వ ఆహర పదార్ధాలు:

2.నిల్వ ఆహర పదార్ధాలు:

తాజా పండ్లు, కూరగాయలు ఎల్లప్పుడూ ఆరోగ్యకర౦ అయితే, నిల్వ పదార్ధాలు మనిషి శరీరంలో క్యాన్సర్ కి ప్రమాదకర కారకమని గుర్తించబడింది. వాస్తవానికి, ఈ మెటాలిక్ క్యాన్ లోపలి భాగం బిస్ఫేనాల్-ఎ, లేదా తేలికగా BPA అనే రసాయనాన్ని కలిగి ఉంటుంది. ఈ రసాయనం మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం, అంతేకాకుండా ఈ క్యాన్ లలో ఆహారాన్ని నిల్వ ఉంచి వాటితో కలిపితే క్యాన్సర్ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుంది. టమాటో వంటి అసిడిక్ లక్షణాలతో ఉన్న పదార్ధాలు ప్రధానంగా క్యాన్సర్ కారణాలకు దారితీస్తాయి.

3.గ్రిల్ చేయబడిన మాంసం లేదా చేప:

3.గ్రిల్ చేయబడిన మాంసం లేదా చేప:

గ్రిల్డ్ మాంసం లేదా ఫిష్ డిష్ లలో స్పైసీ రుచి అద్భుతంగా ఉంటుంది కాబట్టి అనేకమంది దీన్ని ఇష్టపడతారు. కానీ మాంసం లేదా చేప నేరుగా అధిక ఉష్ణోగ్రతలో కాలిస్తే, క్యాన్సర్ కి కారణమయ్యే కొన్ని ప్రమదరక రసాయనాలు ఈ ఆహారంలో ఏర్పడవచ్చు. ఈ ఆరోగ్యం కాని హైడ్రో కార్బన్స్, అమైన్స్ మనుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ కి కోలోరెక్టాల్ క్యాన్సర్ కి ముఖ్యమైన కారణాలుగా చెప్పబడ్డాయి.

4.సోడా పానీయాలు:

4.సోడా పానీయాలు:

అనేక ప్రసిద్ధ సాఫ్ట్ డ్రింక్ లు ఎక్కువ శాతం సోడాతో కలుస్తాయి, అలాగే సోడా ఎక్కువ ఆహరం తీసుకుని జీర్ణం కాకపోతే ఒక రసాయనంగా సహాయపడుతుందని సాధారణంగా నమ్ముతారు. సోడా పానీయాలను ప్రతిరోజూ తీసుకునే సేలేబ్రల్ స్ట్రోక్స్, చివరికి జీర్ణవ్యవస్ధకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వాస్తవానికి, సోడా లోని అసిడిక్ ప్రభావం వల్ల పొట్ట, ప్రేగులలోని లోపలి పొర కరిగి, ముందు అల్సర్ వచ్చి తరువాత అది క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది.

5.పొటాటో చిప్స్:

5.పొటాటో చిప్స్:

పొటాటో చిప్స్ అనేవి పిల్లలకు అనేకమంది పెద్దలకు కూడా అత్యంత ఇష్టమైన జంక్ ఫుడ్. ఈ చిప్స్ లో అధిక కొవ్వు ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ పొటాటో చిప్స్ లో కొన్ని కృత్రిమ ప్రిజర్వేటివ్స్ కూడా ఉన్నాయి, ఇవి మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదం, ఇది శరీర కణాలలో క్యాన్సర్ కి కారణం కావొచ్చు. అంతేకాకుండా, పొటాటో చిప్స్ అధిక ఉష్ణోగ్రతలో వేయించడం వల్ల, క్యాన్సర్ కి కారణమయ్యే అక్రిలామైడ్ అనే ప్రమాదకర రసాయన౦ ఉత్పత్తి అవుతుంది.

కాబట్టి, పైన తెలియచేసిన సాధారణ మానేసి, క్యాన్సర్ ప్రమాద కారకాల నుండి మనల్ని మనమే రక్షించుకోవడం మంచిది.

English summary

Cancer-causing Foods That We Consume Every Day

Cancer is one of the worst diseases that can totally paralyze a person - physically, mentally and emotionally. As it is said precaution is better than cure, so with proper preventive steps and early diagnosis, cancer can be prevented. You need to be very careful about the foods that you consume, as there are certain foods that can cause cancer..
Story first published:Saturday, December 9, 2017, 14:54 [IST]
Desktop Bottom Promotion