వంటగదే..ప్రథమ చికిత్సాలయం! మీ వంటగదే మీ ఫస్ట్ ఎయిడ్ అని మీకు తెలుసా?

By: Madhavi Lagishetty
Subscribe to Boldsky

మీ వంటగదే మీ ఫస్ట్ ఎయిడ్ అని మీకు తెలుసా? ప్రథమ చికిత్సకు కావాల్సిన మందులన్నీ కిచెన్ లోనే ఉన్నాయంటే మీరు నమ్ముతారా? వంటగదిలో ప్రథమ చికిత్సకు మందులా! చాలా మందికి ఇది ఆశ్చర్యం కలిగించేలా అనిపించవచ్చు. కానీ వంటగదిలో కనిపించే సాధారణ ప్రొడక్ట్ లు అనేక చిన్న రోగాలకు, ప్రమాదాలకు ప్రథమ చికిత్సగా ఉపయోగపడతాయి. చాలా వరకు వంటగదిలోని అల్మారాల్లో ఉండే కొన్ని ఫుడ్స్, స్పైసెస్ రోగాలను తగ్గించడానికి సహాయం చేస్తాయి.

ఇక్కడ మేము కొన్ని ప్రథమ చికిత్సకు అవసరమైన పదర్ధాల గురించి వివరించాము. ఏమైనా సందేహం ఉంటే...దయచేసి మీ ఆరోగ్య సలహాదారున్ని సంప్రదించండి. ఏ రోగమైన సరే గాయం లేదా దాని తీవ్రతను బట్టి వైద్యం ఉంటుందని గుర్తుంచుకోండి.

వెల్లుల్లి...

వెల్లుల్లి...

తాజా వెల్లుల్లిలో ఎన్నో సహజగుణాలు ఉన్నాయి. యాంటీబయాటిక్స్ కు సమానంగా వెల్లుల్లి పనిచేస్తుందని ఈ మధ్యే అధ్యయానాలు వెల్లడించాయి. స్వచ్చమైన వెల్లుల్లిని వంటల్లో ఉపయోగించినట్లయితే...ఎన్నో లాభాలు ఉంటాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అలెర్జీలను దూరం చేస్తుంది. జలుబు మరియు ఇన్ల్ఫుఎంజా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. మీ బ్లడ్ లోని షూగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరం నుంచి పిన్ పురుగులు వంటి పరాన్నజీవులను చంపడం మరియు తొలగించేందుకు ఉపయోగపడుతుంది. చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఒక కాగితంలో చిన్న వెల్లుల్లి ముక్కను చుట్టి చెవిలో పెట్టుకోవాలి. చెవిలో నొప్పి వెంటనే తగ్గిపోతుంది. మంచి ఫలితాన్ని పొందాలంటే రాత్రిపూట పాటించడం ఉత్తమం.

ఇక వెల్లుల్లి.. కీటకాల కాటుతో వచ్చే నొప్పిని నయం చేయడంలో సహాయపడుతుంది. ఉప్పు కలిపిన వెల్లుల్లి రసాన్ని గాయాలు, బెణుకులకు వాడకూడదు. చాలామంది వెల్లుల్లిని చెడు శ్వాసను తొలగించేందుకు శ్వాసనాణాల ద్వారా పెడుతుంటారు. అలా చేయకూడదు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం నిమ్మరసం లేదా నిమ్మకాయ ముక్కలను తినడం వల్ల చెడు శ్వాస నుంచి విముక్తి లభిస్తుంది.

దాల్చిన చెక్క....

దాల్చిన చెక్క....

దాల్చిన చెక్కలో రక్తంలోని చక్కెరను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు దాల్చినచెక్క నుంచి కొంత పొడిని తయారు చేసుకుని ఖాళీ క్యాప్సుల్లో ఉంచండి. రోజుకు ఒకటి రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడా...

బేకింగ్ సోడా...

బేకింగ్ సోడాను ఎక్కువగా కేక్స్ మరియు కుకీస్ లో ఉపయోగిస్తారు. బేకింగ్ సోడాలో చర్మానికి సంబంధించిన సమస్యలను నివారించే గుణం ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను కలుపుకుని తాగాలి. దీనివల్ల చిన్న చిన్న నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. బేకింగ్ సోడాను కొంచెం వేడి నీటిలో కలుపుని...అందులో సగం నిమ్మకాయ జ్యూస్ ను కలిపి తాగాలి. దీంతో తలనొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ ను ప్రతి 15 నిమిషాలకోసారి తగ్గడం వల్ల తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు దంతాలను శుభ్రపరచడంలోనూ బేకింగ్ సోడా పనిచేస్తుంది. నోట్లో నుంచి వచ్చే చెడువాసనతోపాటు ఇతర సమస్యలకు చెక్ పెట్టడంలో ఏజెంట్ గా పనిచేస్తుంది.

పసుపు....

పసుపు....

పసుపును ఆసియాలో ఆస్పిరిన్ అనే నామకరణంతో పిలుస్తారు. కూరల్లో ఉపయోగించే ఈ పసుపు, నారింజ పొడి, సుగంధాల కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఆయుర్వేద ఔషధంలో శతాబ్దాలుగా వాడుతున్నారు. గాయాలను నయం చేయడంతోపాటు ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తారు. అల్లంకు పసుపు తో దగ్గరి సంబంధం ఉంటుంది. పసుపురంగులో ఉండే CURCUMIN ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామెటిక్ గ్గా మరియు యాంటిక్సైడ్ గా పనిచేస్తుంది.

వినెగార్....

వినెగార్....

ప్రథమ చికిత్స కోసం అన్ని రకాల వినెగార్లు ఉపయోగపడతాయి. వినెగర్ చుండ్రును తగ్గించడంతోపాటు తేనెటీగలు కుట్టడం, సూర్యరశ్మి, గొంతు నొప్పి, దోమకాటు దురదల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ వెచ్చని నీటితో వినియోగిస్తే..ఆర్థరైటిస్ నుంచి నొప్పిని పారద్రోలుతుంది. వెచ్చని నీరులో కొంచెం వినెగర్, తేనె కలిపి తీసుకున్నట్లయితే జలుబు నుండి కోలుకునేలా చేస్తుంది. ముఖానికి మొటిమలు ఉన్నట్లయితే వినెగర్ ను అప్లై చేయండి. అంతేకాదు పళ్లను శుభ్రపరచడంలోనూ వినెగార్ ను ఉపయోగించవచ్చు.

తేనె...

తేనె...

వంటగదిలో బిజీగా ఉన్నప్పుడు మంటల వల్ల చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి. పక్కన ఉన్న కత్తితో ఆకుకూరలు, కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు సడెన్ గాయం అవుతుంది. ఇలాంటి మైనర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అయినప్పటికీ చిన్న గాయం అవగానే ఉపశమాన్ని పొందడానికి వంటగది బెస్ట్ అని చెప్పవచ్చు. మొదట గాయం అవ్వగానే కొన్ని చల్లని నీటితో కడగాలి. మంట ఎక్కువగా ఉన్నట్లయితే బెస్ట్ సబ్ స్టేయిన్ తేనె అని చెప్పొచ్చు. తేనె తీసుకుని గాయం అయిన ప్రదేశంలో సన్నని పూతలా రుద్దాలి. దీంతో ఎంతో ఉపశమనం ఉంటుంది.

English summary

Common kitchen ingredients that double up as first aid!

Common kitchen ingredients that double up as first aid!
Story first published: Thursday, September 14, 2017, 16:30 [IST]
Subscribe Newsletter