Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
మీ ఆహరంలో కందని చేర్చుకుంటున్నారా? ఖచ్చితంగా తినాలి, ఎందుకంటే..
కంద గడ్డ ఇది స్వీట్ పొటాటో కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కంద గడ్డను వంటలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దుంప కూరల్లో కందగడ్డ రుచికి మరొకటి లేదు. అడవులలో తిరిగే మునులు "కందమూలాలు" తిని బతికేవారని పురాణాలు మనకు తెలుపుతున్నాయి. చూపులకు అందంగా కనిపించకపోయినా కంద వంటకాలన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. కంద దుంప చాలా బలమైన ఆహారం. ఈ దుంప తింటే షుగర్, ఒబిసిటీలను అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కంద గడ్డలో బీటా కెరోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్. కందగడ్డ ఆఫ్రికా ప్రదేశంలో ఎక్కువగా పండిస్తారు. ఈ వెజిటేబుల్ ఆఫ్రికా దేశానిదైనా ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రసిద్ది చెందినది. స్వీట్ పొటాటో లాగా కాకుండా ఇది పొడవుగా ఉంటుంది. చూడటానికి రఫ్ గా డార్క్ కలర్లో, పింక్ స్కిన్ తో ఉంటుంది. కందను ఎక్కువగా నైజీరియాలో దేశంలో పండిస్తారు.

కందగడ్డలో విటమిన్ 'ఎ' చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కందలో పొటాషియం, ఫైబర్ నేచురల్ షుగర్స్ చాలా తక్కువ కేలరీస్‌తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. ఇక గర్భిణులకు చేసే మేలు అంతా ఇంతా కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. కంద తీసుకోవడం వలన జీర్ణప్రక్రియ వేగమవ్వడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
చిన్న కంద గడ్డ ద్వారా మన శరీరానికి దాదాపు ఆరు గ్రాముల ఫైబర్ చేరుతుంది. కేన్సర్ బారిన పడకుండా కాపాడమే కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు కంద ఓ దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. .మీ ఆహరంలో కందని చేర్చుకోండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

1. ఇది ఎనర్జీని అందిస్తుంది:
ఈ వెజిటేబుల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ , సోలబుల్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎనర్జీని ఎక్కువగా అందిస్తుంది.

2. జీర్ణ శక్తిని పెంచుతుంది:
కందగడ్డలో ఫైబర్ అధికం. కాబట్టి, ఇది మలబద్దకం తగ్గిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ను న్యూట్రలైజ్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

3. బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది:
కంద గడ్డలో ఉండే లోగ్లిజమిక్ ఇండెక్స్ , బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడకుండా క్రమబద్దం చేస్తుంది.

4. విటమిన్ బి అధికం:
కంద గడ్డలో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి తో పాటు న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉండి, శరీరం ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరంలో ఉండే విటమిన్స్ మెటబాలిక్ రేటును పెంచుతుంది.

విటమిన్ సి ఎక్కువ:
విటమిన్ సి మరియు విటమిన్ ఎ ఎక్కువ. విటమిన్ సి శరీరంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో , ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. కందగడ్డలో ఉండే విటమిన్ ఎ కంటెంట్ కంటి చూపును మెరుగుపుస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పనిచేస్తుంది. ఓరల్ క్యావిటి పెంచుతుంది.

6. బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:
కందగడ్డలో క్యాల్షియం, ఐరన్, మినిరల్స్, పొటాషియం, మ్యాంగనీస్, ఫాస్పరస్ మొదలగునవి అధికంగా ఉండటం వల్ల హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేసి, హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్పడటానికి అవసరం అయ్యే ఐరన్ కంటెంట్ ను అందిస్తుంది. అనీమియా తగ్గిస్తుంది.

7. చర్మంలో పుండ్లను నయం చేస్తుంది:
కంద గడ్డను ఈస్ట్ ఏషియన్ కంట్రీలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే అలెంటోయిన్ అనే కంటెంట్ చర్మంలోని పుండ్లను ఎఫెక్టివ్ గా నయం చేస్తుంది. ఇది ఇంకా ఆకలిని తగ్గిస్తుంది. ఇంకా ఇది బ్రొంకైటిస్ సమస్యను తగ్గిస్తుంది.

8. మోనోపాజ్ :
మహిళలో మోనోపాజ్ సమస్యను నివారించడంలో కందగడ్డ సహాయపడుతుంది. కందగడ్డలో ఉండే సపోనిన్ అనే కంటెంట్ కాంపౌండ్ మహిళలో మోనోపాజ్ సమస్యలను నివారిస్తుంది.

9. కందగడ్డను ఎలా తీసుకోవాలి.
కందగడ్డను ఫ్రెష్ గా కట్ చేసిన తర్వాత వెంటనే వంటలకు ఉపయోగించడం తినడం చేయాలి. ముఖ్యంగా కందగడ్డను పచ్చిగా తినకూడదు. ఎందుకంటే వీటిలో న్యాచురల్ ప్లాంట్ టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. కందగడ్డను శుభ్రం చేసి, బాగా ఉడికించిన తర్వాత తినాలి. కంద గడ్డను ఉడికించి, ఫ్రై చేసి, రోస్ట్ చేసి, బేక్ చేసి తింటారు .



Click it and Unblock the Notifications











