మీకు ఇంటిని శుభ్రపరిచే క్రిమిసంహారక ద్రవాలు ఎంత అపాయకరమో తెలుసా?

By: Deepti
Subscribe to Boldsky

టూత్ పేస్ట్, సబ్బులు, డిటర్జెంట్లు, బొమ్మల్లో ఉండే క్రిమిసంహారక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ ఏజెంట్ ట్రిక్లోసన్ ఎక్కువసేపు పీల్చిఉండటం వల్ల మీకు యాంటీబయాటిక్స్ పనిచేయకపోవచ్చని ఒక పరిశోధనలో తేలింది.

బ్యాక్టీరియా పెద్దవయి, యాంటీబయాటిక్ డ్రగ్స్ ను పనిచేయకుండా చేయడానికి ట్రై చేసినప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది.

ఈ ఫలితాలతో తేలిందేంటంటే కొన్ని బ్యాక్టీరియా క్వినోలోన్స్ అనే మందుల గ్రూప్ కి నిరోధకశక్తి పెంచుకున్నప్పుడు, ట్రిక్లోసన్ కి కూడా నిరోధకత పెరుగుతుంది.

Do You Know How Common Household Disinfectants Can Be Dangerous

పరిశోధకులు ఈ.కోలి అనే కడుపులో ఉండే బ్యాక్టీరియాపై పరీక్షలు జరిపి, అది క్వినోలోన్స్, ట్రిక్లోసన్ రెండింటిపై నిరోధకతను పెంచుకుందని, జన్యు అనువర్తనం జరిగిందని తేల్చారు.

యాంటీ బయోటిక్స్ అవసరం లేకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారించే నేచురల్ రెమెడీస్

బ్యాక్టీరియా క్రిమిసంహారక శుభ్రం చేసే ద్రవాలకు పనిచేయకపోవటంతో, అవి ఇంకే మందులకి కూడా లొంగవు.

బర్మింగ్ హామ్ యూనివర్శిటీకి చెందిన సీనియర్ అధ్యాపకుడు మార్క్ వెబ్బర్ మాట్లాడుతూ, "మేము అనుకునేది ఏంటంటే, బ్యాక్టీరియా తాము ఎప్పుడూ ముప్పులోనే ఉన్నామని భావించి అన్నిటికీ తయారయిపోతున్నాయి, ట్రిక్లోసాన్ కి కూడా," అని అన్నారు.

జర్నల్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ కీమోథెరపీలో ప్రచురితమైనదాని ప్రకారం "ఇది వ్యతిరేకంగా కూడా జరగొచ్చు. ట్రిక్లోసాన్ కి స్పందించే, బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ కి వ్యతిరేకంగా మారవచ్చు." అని జతచేసారు.

Do You Know How Common Household Disinfectants Can Be Dangerous

క్వినోలోన్ యాంటీబయాటిక్స్ మనుషుల మందులలో ముఖ్యం మరియు శక్తివంతమైనవి కావడంతో, యాంటిబయాటిక్ నిరోధకతను ప్రోత్సహించడానికి ట్రిక్లోసాన్ వాడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు.

యూరోపియన్ దేశాల్లో, యూఎస్ లో శుభ్రత వస్తువులలో ( చేతులు, చర్మం,బాడీ వాష్ లు) ట్రిక్లోసాన్ వాడకంపై నిషేధం పెట్టబడింది. యూఎస్ ఫుడ్ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిక్లోసాన్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ లేదా నిరోధకతకి కారణం కావచ్చని హెచ్చరించింది.

ఆనందించాలంటే....కడుక్కోవాల్సిందే మరి!

ఈ ఉత్పత్తుల్లో కొన్నిటిలో క్రియాశీలమైన కొన్ని యాంటీమైక్రోబియల్ పదార్థాలు ఒకచోట చేరి పర్యావరణాన్ని మార్చివేసి, యాంటీబయాటిక్స్ పనిచేయని బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతున్నాయి.

వెబ్బర్ వివరిస్తూ, "మనకి ఇంక ప్రభావవంతమైన మందులు ఇలా పనిచేయటం మానేస్తూ పోతే, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎలా జరుగుతుందో, ఏ పరిస్థితులు, వాటిని ఎలా ఆపాలో అని జరిగే పరిశోధన కుంటుపడుతుంది." అని అన్నారు.

English summary

Do You Know How Common Household Disinfectants Can Be Dangerous

Exposure to triclosan, an antibacterial and antifungal agent found in domestic products like toothpaste, soaps, detergents, toys etc. may increase the risk of developing antibiotic resistance, a research has warned.
Story first published: Thursday, July 13, 2017, 8:00 [IST]
Subscribe Newsletter